నాలుగు రోజుల్లో రూ.10 కోట్ల ఇసుక మింగేసిన ఎమ్మెల్యే

రాజ‌మండ్రి మాజీ ఎంపీ మార్గాని భ‌ర‌త్ స్థానిక టీడీపీ ఎమ్మెల్యేపై సంచ‌ల‌న ఆరోప‌ణ చేశారు. నాలుగు రోజుల్లో రూ.10 కోట్ల ఇసుక మింగేశార‌ని ఆయ‌న ఆరోపించ‌డం చ‌ర్చ‌నీయాంశ‌మైంది. ఉచిత ఇసుక పేరుతో టీడీపీ, జ‌న‌సేన…

రాజ‌మండ్రి మాజీ ఎంపీ మార్గాని భ‌ర‌త్ స్థానిక టీడీపీ ఎమ్మెల్యేపై సంచ‌ల‌న ఆరోప‌ణ చేశారు. నాలుగు రోజుల్లో రూ.10 కోట్ల ఇసుక మింగేశార‌ని ఆయ‌న ఆరోపించ‌డం చ‌ర్చ‌నీయాంశ‌మైంది. ఉచిత ఇసుక పేరుతో టీడీపీ, జ‌న‌సేన నాయ‌కులు దోపిడీకి పాల్ప‌డుతున్నార‌నే ఆరోప‌ణ‌లు గుప్పుమంటున్నాయి. ఒక‌వైపు ఉచితంగా ఇసుక పంపిణీ చేయ‌కుండా, మ‌రోవైపు ప్ర‌భుత్వ ఆదాయానికి గండికొడుతున్నార‌ని రాష్ట్ర వ్యాప్తంగా విమ‌ర్శ‌లు వెల్లువెత్తుతున్న నేప‌థ్యంలో మార్గాని భ‌ర‌త్ ఆరోప‌ణ‌లు ప్రాధాన్యం సంత‌రించుకున్నాయి.

ఇవాళ ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ ఇసుక కొండ‌లు ఏమైపోయాయ‌ని ఆయ‌న నిల‌దీశారు. ఇసుక గుట్ట‌ల్ని స్థానిక ఎమ్మెల్యే మింగేశార‌ని ఆయ‌న ఆగ్ర‌హించారు. దోపిడీ విలువ రూ.10 కోట్లుగా ఆయ‌న చెప్పుకొచ్చారు. ఉచిత ఇసుక ఎవ‌రికిచ్చార‌ని ఆయ‌న ప్ర‌శ్నించారు. రాజ‌మండ్రి వ్యాప్తంగా సెటిల్‌మెంట్ బ్యాచ్ న‌డుస్తోంద‌ని ఆయ‌న అన్నారు. టీడీపీ ఎమ్మెల్యేలే ద‌గ్గ‌రుండి పేకాట క్ల‌బ్బులు న‌డుపుతున్నార‌ని ఆయ‌న ఆరోపించారు.

గతంలో ప్ర‌కృతి వైప‌రీత్యాలు సంభ‌వించిన‌ప్పుడు వాలంటీర్లు చురుగ్గా సేవ‌లు అందించేవార‌న్నారు. వాలంటీర్ల‌కు రూ.10 వేలు చొప్పున స్టైఫండ్ ఇస్తాన‌ని చంద్ర‌బాబు చెప్పార‌ని మార్గాని భ‌ర‌త్ గుర్తు చేశారు. కానీ అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత ఏకంగా వాలంటీర్ వ్య‌వ‌స్థ‌నే నిర్మూలించార‌ని ఆయ‌న ఆరోపించారు. రాష్ట్ర వ్యాప్తంగా 4 ల‌క్ష‌ల మంది వాలంటీర్ల‌ను తీసేశార‌ని భ‌ర‌త్ అన్నారు. నిరుద్యోగుల‌కు రూ.3 వేలు ఇస్తామ‌ని చెప్పి, ఇప్పుడు వాలంటీర్ల‌కు ఉపాధి లేకుండా చేశార‌న్నారు. క‌నీసం ఉపాధి క‌ల్సించ‌డం కోస‌మైనా వాలంటీర్ల‌ను కొన‌సాగించాల‌ని ఆయ‌న విజ్ఞ‌ప్తి చేశారు.

అసెంబ్లీలో చంద్ర‌బాబు ప్ర‌సంగిస్తూ సూప‌ర్‌సిక్స్ హామీల అమ‌లు చేయాలంటే భ‌య‌మేస్తోంద‌ని అన్నార‌ని భ‌రత్ తెలిపారు. దీని అర్థం ఏమిట‌ని ఆయ‌న ప్ర‌శ్నించారు. సూప‌ర్ సిక్స్ హామీల‌ను ఎత్తివేస్తామ‌నే క‌దా మీ భ‌యానికి అర్థం అని ఆయ‌న అన్నారు. ఇంకా న‌య‌డం నేను ప‌థ‌కాలు ఇవ్వ‌లేన‌ని, ప్ర‌జ‌లు అర్థం చేసుకోవాల‌ని చంద్ర‌బాబు నేరుగా చెప్ప‌లేద‌న్నారు.

20 Replies to “నాలుగు రోజుల్లో రూ.10 కోట్ల ఇసుక మింగేసిన ఎమ్మెల్యే”

  1. రాజమహేంద్రవరాము ని కాకినాడ ని ట్విన్ సిటీస్ చేస్తాము అన్నాడు అయ్యగారు .. ఇంటర్వ్యూ చేస్తున్న జోర్నలిస్టులు నవ్వలేక ఏడిచారు ..

    1. Amaravathi pedda capital ayyelopu Rajahmundry and Kakinada paisa kharchu lekunda twin cities avuthayi …

      endukante kanuchupu meralo bhramamaravathi amaravathi ane capital avvaledu…Capital anedi avaro develop chesthe ayyedi kadu… Chennai, Bangalore, cochin, bombay lantivi pedda capitals kavadaniki sathabdalu pattindi…dabbulu kharchupetti capital 5 years lo raavalante AP prajalu adukku thinalsi vasthundi…

      Oka prakka, Vizag , kakinada, sricity ,ananthapur la lo invest cheyadaniki industrialists interest chuputhunnaru..so avi natural ga develop avuthayi.. Vatini vadilesi only amaravathi lo industries pettalante Industrialists raavadam kashtam…..asalu Guntur and Vijayawada lo Industrialization ippativaraku lene ledu….First Industry culture develop kaavali..adi slow ga vasthundi..overnight rammante raadu.

      Kakinada, vizag and Sricity port cities…Ananthapur is very near to Banagalore…

      Kiya enduku amaravathi lo pettaledu ? reason Industrialization lekapovadame…Adi raadu ani kaadu … definete ga vasthundi.. kaabadithe dabbulu kharchu chesthe raadu…natural ga slow ga vasthundi…

  2. మీ 5 ఎళ్ళొ లొ అసలు ఇసుక దొరక్కె జనం అల్లాడిపొయారు. 10 కొట్ల రూపాయల ఇసుక నువ్వు అక్కడ కళీగా పెట్టవా? ఎందుకురా ఈ సొల్లు మాటలు?

    1. నాతొ KGF తీయడి అన్నప్పుడె, నీ డబ్బా మాటలు ఎలా ఉంటాయొ జనానికి అర్ధం అయ్యింది

  3. కోటిన్నర ప్రజల డబ్బు ఖర్చు చేసి ఎలకలు పట్టుకున్న ఎలక వీరుడు..

      1. అమరావతి లో 6 లక్షల కోట్లు అవినీతి అన్నారు.. ఇంతవరకు పైసా కూడా తేల్చలేదు..

        మీరు ఇలా ప్రచారాలు చేశారు కాబట్టే.. 11 లో మునిగిపోయారు..

        ఇంకా సిగ్గు తెచ్చుకోకపోతే ఎలా..?

        ఈవీఎంలు హ్యాక్ చేశారు అంటారు.. అదేదో కనుక్కోండి.. ఈరోజు రేపు అనుకుంటూ.. రెండు నెలలు గడిచిపోయాయి..

        ఇక నీ జగన్ రెడ్డి శవం దొరికితే గాని బయటకు రాలేని పరిస్థితి..

Comments are closed.