పెళ్లాల కోసం ధర్నాకు దిగిన భర్తలు

భర్త కోసం ఇంటి ముందు ధర్నా చేసిన భార్య ఉదంతాలు చాలానే చూశాం. కానీ ఇది దానికి రివర్స్. భార్య కోసం ధర్నా చేస్తున్న భర్త వ్యధ ఇది. పైగా ఇద్దరు తోడల్లుళ్లు ఇలా…

భర్త కోసం ఇంటి ముందు ధర్నా చేసిన భార్య ఉదంతాలు చాలానే చూశాం. కానీ ఇది దానికి రివర్స్. భార్య కోసం ధర్నా చేస్తున్న భర్త వ్యధ ఇది. పైగా ఇద్దరు తోడల్లుళ్లు ఇలా ధర్నాకు దిగడం, మరీ ముఖ్యంగా కలెక్టరేట్ ముందు టెంట్ వేసి కూర్చోవడం అందర్నీ ఆకర్షించింది. ఏలూరులో జరిగింది ఈ ఘటన.

ఏలూరుకు చెందిన బూరుగడ్డ శ్రీనివాస్ రామానుజ అయ్యంగార్ కు ఇద్దరు కుమార్తెలు. పెద్ద కూతుర్ని, పవన్ అనే వ్యక్తికి ఇచ్చి పెళ్లి చేశాడు. అయితే పెళ్లయిన రెండేళ్లకే పెద్ద కుమార్తెను ఇంటికి తీసుకొచ్చేశాడు. అప్పటికే పెద్దమ్మాయికి కూతురు పుట్టింది.

ఇక చిన్న కూతుర్ని శేషసాయికి ఇచ్చి పెళ్లి చేశాడు. ఈ ఏడాది ఫిబ్రవరిలో పెళ్లవ్వగా, పెళ్లయిన నెల రోజులకే ఇంటికి తీసుకొచ్చేశాడు. అప్పట్నుంచి అల్లుళ్లు ఇద్దరూ ఎంత అడుగుతున్నా శ్రీనివాస్ రామానుజ నుంచి స్పందన లేదు.

పైపెచ్చు అల్లుళ్ల పోరు ఎక్కువ అవ్వడంతో రివర్స్ లో వాళ్లపైనే కేసులు పెట్టాడు. స్థానికంగా పలుకుబడి ఉండడంతో, తమపై మామయ్య ఇలా జులుం ప్రదర్శిస్తున్నాడని ఆరోపిస్తున్నారు అల్లుళ్లు.

అక్కడితో ఆగకుండా నేరుగా కలెక్టరేట్ ముందు ధర్నాకు దిగారు. ఫ్లెక్సీ కట్టారు. “ఇద్దరు కూతుళ్లకు పెళ్లిళ్లు అయ్యాక కాపురానికి పంపించకుండా, తిరిగి అల్లుళ్లపై కేసులుపెట్టి ఇబ్బందులు పెడుతున్న శాడిస్ట్ మామ శ్రీనివాస రామానుజపై చర్యలు తీసుకోవాలి” అంటూ ఫ్లెక్సీని ప్రదర్శిస్తూ రిలే నిరాహార దీక్షలకు దిగారు. ప్రస్తుతం ఈ మేటర్ కలెక్టర్ దృష్టికి వెళ్లింది.

9 Replies to “పెళ్లాల కోసం ధర్నాకు దిగిన భర్తలు”

Comments are closed.