తన గాయంపై తానే జోకులేసుకున్న హీరో

సోలో స్కిట్స్ కు పెట్టింది పేరు నవీన్ పొలిశెట్టి. కరోనా టైమ్ లో, జాతిరత్నాలు, మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి సినిమాల రిలీజ్ టైమ్స్ లో నవీన్ పొలిశెట్టి చేసిన వీడియోలు వైరల్ అయ్యాయి.…

సోలో స్కిట్స్ కు పెట్టింది పేరు నవీన్ పొలిశెట్టి. కరోనా టైమ్ లో, జాతిరత్నాలు, మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి సినిమాల రిలీజ్ టైమ్స్ లో నవీన్ పొలిశెట్టి చేసిన వీడియోలు వైరల్ అయ్యాయి. ఇప్పుడీ హీరో తన చేతి గాయంపై తానే జోకులేసుకుంటూ ఓ వీడియో రిలీజ్ చేశాడు.

నవీన్ పొలిశెట్టి తీవ్రంగా గాయపడిన సంగతి తెలిసిందే. అతడి కుడిచేతికి ఫ్రాక్చర్ అయింది, డాక్టర్లు కట్టు కట్టారు. ప్రస్తుతం సింగిల్ హ్యాండ్ తో లైఫ్ లీడ్ చేస్తున్న ఈ హీరో.. తన ఒంటి చేయి కష్టాలను ఫన్నీగా అందులో చూపించాడు.

జీవితంలో కష్టాలతో పోరాడటానికి హాస్యం ఎంతో ధైర్యాన్నిస్తుందని రాసుకొచ్చిన పొలిశెట్టి.. తను పూర్తిస్థాయిలో కోలుకున్న వెంటనే కొత్త సినిమాలతో పలకరిస్తానని ప్రకటించాడు.

తనకు గాయమైన విషయాన్ని తాజాగా బయటపెట్టాడు నవీన్… ఈ గ్యాప్ లో డెవలప్ మెంట్ లో ఉన్న తన అప్ కమింగ్ సినిమాల స్క్రిప్ట్స్ అన్నీ మరింత మెరుగ్గా వచ్చాయని ప్రకటించాడు. పూర్తిగా కోలుకొని ఆ సినిమాల షూటింగ్స్ మొదలుపెడతానని తెలిపాడు.

3 Replies to “తన గాయంపై తానే జోకులేసుకున్న హీరో”

Comments are closed.