గ్రహాల మూమెంట్స్ కోసం వినాయక్ వెయిటింగ్

ఇంకొక్క నెల రోజులు ఆగితే వినాయక్ జీవితంలో గ్రహాల మూమెంట్స్ స్టార్ట్ అవుతుందంట.

ఈమధ్య అనారోగ్యంతో బాధపడ్డారు సీనియర్ దర్శకుడు వీవీ వినాయక్. పూర్తిగా కోలుకున్న తర్వాత ఆయన విశ్వంభర సెట్స్ లో కనిపించారు. అప్పట్నుంచి వినాయక్ కొత్త సినిమాపై ఊహాగానాలు సాగుతూనే ఉన్నాయి.

కానీ వినాయక్ మాత్రం తన కొత్త ప్రాజెక్టు ప్రకటించలేదు. నిజానికి ఆయనకు కొన్ని ఆఫర్లున్నాయి. కొంతమంది హీరోలు సినిమా చేద్దామని స్వయంగా అడిగారు కూడా. కానీ వినాయక్ మాత్రం తన దగ్గరకొచ్చిన ఆఫర్లన్నింటినీ హోల్డ్ లో పెట్టారు.

దీనికి కారణం ఆయన జాతకం అంట. ప్రస్తుతం ఆయన జాతకంలో గ్రహస్థితులు సరిగ్గా లేవంట. ఇప్పటికే పలువురు జ్యోతిష్యుల్ని సంప్రదించగా.. ప్రస్తుతానికి ఓపిక పట్టండి అంటూ అందరూ కామన్ గా చెప్పారట.

ఇంకొక్క నెల రోజులు ఆగితే వినాయక్ జీవితంలో గ్రహాల మూమెంట్స్ స్టార్ట్ అవుతుందంట. అందుకే అందర్నీ సెప్టెంబర్ వరకు ఆగాలని ఆయన కోరుతున్నారట. సో.. వచ్చే నెల ఆయన తన కొత్త ప్రాజెక్టు ప్రకటించే అవకాశం ఉంది.

బెల్లంకొండ సాయిశ్రీనివాస్ తో కలిసి హిందీలో ఛత్రపతి సినిమా రీమేక్ చేశారు వినాయక్. బాలీవుడ్ లో అది ఎపిక్ డిజాస్టర్ గా నిలిచింది. దీంతో బాలీవుడ్ లో మరోసారి అడుగుపెట్టకూడదని, మరీ ముఖ్యంగా రీమేక్స్ టచ్ చేయకూడదని వినాయక్ నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది.

14 Replies to “గ్రహాల మూమెంట్స్ కోసం వినాయక్ వెయిటింగ్”

    1. పాపం మీ అన్న చంద్రన్న గ్రహస్థితుల గురించి తెగ బెంగ పడుతున్నావు. As usual గా మన అలవాటు ప్రకారం ఇంకోసారి దుర్గమ్మ గుడిలో క్షుద్ర పూజలు చేయిస్తే సరి.

      1. ఆలయలాను బ్రస్తున్పట్టి చి గుడి సెట్ లు వేయించు కున్నది ఎవారో కూడా తెల్సు

      2. 164/175 తెచ్చుకుని అధికారం లో ఉన్నడోకి గ్రహస్తిలు బాగోలేదు అంటున్నావు .. నీ మానసివ స్థితి మీద జాలేస్తోంది ..

      3. ఇoటి దగ్గరే దేవాలయం సెట్టు వేయించుకొనే తెలివి తేటలు అందరికీ ఉండవు కదా

      1. అందుకే అసెంబ్లీ కి వెళ్ళటం లేదు కదా, బెంగుళూరు పాలస్ లో కూర్చొని ఇంటి ముందు రోడ్డు మీద వెళ్ళే వాళ్ళను బయపెడుతున్నాడు

    2. జ గ న్ ఉ చ్చ అం తా బాగా న చ్చిందా నీ కు…సంబంధం లేని సినిమా న్యూస్ లో కూడా జగన్ పై కామెంట్స్ పెడుతున్నావు….

  1. అందరూ గ్రహాల వాళ్ళ కలిగే కష్టాలు, విఘ్నాలు తొలగించమని వినాయకుడిని వేడుకుంటారు

    ఈ వినాయకుడేంటి గ్రహాలను వేడుకుంటున్నాడు???

  2. ఈయన గారు బాలీవుడే కాదు టాలీవుడ్ లో కూడా మళ్ళీ అడుగుపెట్టొద్దని నిర్ణయించుకుంటే మంచిది

Comments are closed.