రాజ్ తరుణ్ మరో సుశాంత్ సింగ్ అవుతాడా?

బాలీవుడ్ లో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మరణం గురించి అందరికీ తెలిసిందే. తీవ్రమైన డిప్రెషన్ కు లోనై, మానసిక ఒత్తిడితో ఆత్మహత్య చేసుకున్నట్టు తేల్చారు. అయితే ఇప్పటికీ అతడి మరణంపై చాలామందికి అనుమానాలున్నాయి.…

బాలీవుడ్ లో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మరణం గురించి అందరికీ తెలిసిందే. తీవ్రమైన డిప్రెషన్ కు లోనై, మానసిక ఒత్తిడితో ఆత్మహత్య చేసుకున్నట్టు తేల్చారు. అయితే ఇప్పటికీ అతడి మరణంపై చాలామందికి అనుమానాలున్నాయి.

ఈ సంగతి పక్కనపెడితే, టాలీవుడ్ లో ప్రస్తుతం పీకల్లోతు వివాదంలో కూరుకుపోయిన రాజ్ తరుణ్, మరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ అయ్యే ప్రమాదం ఉందంట. స్వయంగా అతడి లాయర్ ఈ ఆందోళన వ్యక్తం చేస్తున్నాడు.

“రాజ్ తరుణ్ ప్రాణాలకు ప్రమాదం ఉంది. ఎందుకంటే, అతడు డ్రగ్స్ కు, డ్రగ్స్ మాఫియాకు వ్యతిరేకంగా పోరాడుతున్నాడు. లావణ్యకు అతడు చాలా ఏళ్ల కిందటే దూరమయ్యాడంటే దానికి కారణం మాదకద్రవ్యాలే. రాజ్ తరుణ్ ను మానసికంగా క్షోభకు గురిచేస్తున్నారు. రాజ్ తరుణ్, మరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉంది.”

ఓ మంచి నటుడ్ని తననుతాను ఆత్యహత్య చేసుకునేలా ప్రేరేపిస్తున్నారని, మానసిక అశాంతికి గురిచేస్తున్నారని అన్నారు రాజ్ తరుణ్ లాయర్ మధు శర్మ.

ఇక ఈ కేసులో మరో పెద్ద ట్విస్ట్ చోటుచేసుకుంది. లావణ్యకు వ్యతిరేకంగా ఓ ఇద్దరు పోలీస్ స్టేషన్ కు వచ్చి కంప్లయింట్ ఇచ్చారు. తమను డ్రగ్స్ కొనుగోలు చేయమంటూ లావణ్య ఒత్తిడి చేస్తోందని ప్రీతి, ఉదయ్ అనే ఇద్దరు వ్యక్తులు నార్సింగి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు.

8 Replies to “రాజ్ తరుణ్ మరో సుశాంత్ సింగ్ అవుతాడా?”

  1. కొన్ని కులాలని మరి కొన్ని కులాలు అణిచివేసే కుట్రా కుతంత్రం అవ్వచ్చు.. ఏది ఏమైనా అమ్మాయిలతో ఆటలు అడే వారి ఆట కట్టించాల్సిందే…

Comments are closed.