ఫ్రెండ్ షిప్ డేపై ఆర్జీవీ వెర్షన్ ఇది

దేశం మొత్తం స్నేహితుల దినోత్సవాన్ని ఘనంగా జరుపుకుంటోంది. రకరకాల మెసేజీలు, ఎమోజీలతో సోషల్ మీడియా హోరెత్తిపోతోంది. లోకం అంతా ఒకవైపు ఉంటే దానికి విరుద్ధంగా వెళ్లే రామ్ గోపాల్ వర్మ, ఫ్రెండ్ షిప్ డేపై…

దేశం మొత్తం స్నేహితుల దినోత్సవాన్ని ఘనంగా జరుపుకుంటోంది. రకరకాల మెసేజీలు, ఎమోజీలతో సోషల్ మీడియా హోరెత్తిపోతోంది. లోకం అంతా ఒకవైపు ఉంటే దానికి విరుద్ధంగా వెళ్లే రామ్ గోపాల్ వర్మ, ఫ్రెండ్ షిప్ డేపై తనదైన కామెంట్స్ చేశాడు.

దేశమంతా హ్యాపీ ఫ్రెండ్ షిప్ డే హ్యాష్ ట్యాగ్ నడుస్తుంటే, ఆర్జీవీ మాత్రం హ్యాపీ ఎనిమీస్ డే అనే హ్యాష్ ట్యాగ్ క్రియేట్ చేశాడు. దాని చుట్టూ తనకు తోచిన విధంగా రకరకాలుగా రాసుకుంటూ వచ్చాడు.

శత్రువుల కంటే మనకున్న స్నేహితుల్లోనే ఎక్కువమంది విషపూరితంగా ఉంటారని కామెంట్ చేసిన వర్మ.. శత్రువుల్ని ఓ కంట కనిబెట్టొచ్చని, వెన్నుపోటు పొడిచే స్నేహితుల్ని మాత్రం కనిబెట్టడం ఎవ్వరితరం కాదంటున్నాడు.

‘వీడు నాకు ఎలా ఫ్రెండ్ అయ్యాడబ్బా’ అని ఆశ్చర్యపోయేలా చాలామంది విషపూరిత పాత స్నేహితులు తనకు ఉండేవారని చెప్పుకొచ్చిన వర్మ… మన రహస్యాల్ని బయటపెట్టేది అలాంటి స్నేహితులే అని వెల్లడించాడు.

మనకు స్నేహితులమని చెప్పుకునే చాలామంది వ్యక్తులు మనలోని పాజిటివ్ దృక్పథాన్ని నాశనం చేస్తారని, మన ఎమోషన్స్ తో ఆడుకుంటారని, ప్రతి విషయంలో మనల్ని నిరుత్సాహపరుస్తారని అన్నాడు. ఈ కామెంట్స్ అన్నీ చూస్తుంటే, వర్మ తన జీవితంలో గట్టిగానే దెబ్బలు తిన్నట్టున్నాడు.

10 Replies to “ఫ్రెండ్ షిప్ డేపై ఆర్జీవీ వెర్షన్ ఇది”

  1. వర్మ , జగన్ రెడ్డి మంచి ఫ్రెండ్స్ , ఫ్రెండ్ తో సినిమాలు తీయించుకుని కూలి ఇవ్వలేదు దాన్నే పాపం వెళ్లగక్కుతున్నారు

Comments are closed.