నెల రోజులకే ఓటీటీలోకి..!

సినిమా హిట్టయితే 2 నెలల వరకు ఓటీటీలోకి రాదు. అదే ఫ్లాప్ అయితే నెల రోజులకే స్ట్రీమింగ్ కు వచ్చేస్తుంది. అంతకంటే ముందే ఓటీటీలో ప్రత్యక్షమైన సినిమాలు కోకొల్లలున్నాయి. ఇప్పుడీ లిస్ట్ లోకి భారతీయుడు-2…

సినిమా హిట్టయితే 2 నెలల వరకు ఓటీటీలోకి రాదు. అదే ఫ్లాప్ అయితే నెల రోజులకే స్ట్రీమింగ్ కు వచ్చేస్తుంది. అంతకంటే ముందే ఓటీటీలో ప్రత్యక్షమైన సినిమాలు కోకొల్లలున్నాయి. ఇప్పుడీ లిస్ట్ లోకి భారతీయుడు-2 కూడా చేరింది.

కమల్ హాసన్, శంకర్ కాంబినేషన్ లో తెరకెక్కిన ఈ భారీ బడ్జెట్ సినిమా నెల తిరక్కముందే ఓటీటీలోకి వస్తోంది. 9వ తేదీన ఈ సినిమా నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కు రాబోతోంది. ఈ మేరకు అధికారిక ప్రకటన వచ్చింది.

అన్ని సౌత్ భాషల్లో ఈ సినిమాను ఒకేసారి అందుబాటులోకి తీసుకురాబోతున్నారు. హిందీ వెర్షన్ కు సంబంధించి మాత్రం ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు.

భారతీయుడు-2 సినిమా అన్ని భాషల్లో ఫ్లాప్ అవ్వడంతో, ఈ సినిమా ఓటీటీ హక్కుల పేమెంట్ కు సంబందించి నెట్ ఫ్లిక్స్, లైకా ప్రొడక్షన్స్ కు మధ్య చిన్నపాటి వాగ్వాదం నడిచిందనే ప్రచారం జరిగింది. సినిమా ఫ్లాప్ అవ్వడంతో చెప్పినంత మొత్తాన్ని ఇవ్వలేమని నెట్ ఫ్లిక్స్ కొర్రీ పెట్టినట్టు వార్తలొచ్చాయి. అయితే ఇందులో నిజం లేదు.

ఒకసారి అగ్రిమెంట్ అయిన తర్వాత కార్పొరేట్ సంస్థలు దానికి కట్టుబడి ఉంటాయి. సినిమా హిట్టయినా, ఫ్లాప్ అయినా అగ్రిమెంట్ ప్రకారం పేమెంట్స్ జరిగిపోతాయి. అయితే భారతీయుడు-2 విషయంలో హిందీకి సంబంధించి అగ్రిమెంట్ పూర్తికాకపోవడం, అదే టైమ్ లో సినిమా ఫ్లాప్ అవ్వడం ఒకేసారి జరిగాయి. దీంతో ప్రస్తుతానికి దాన్ని పెండింగ్ లో పెట్టి సౌత్ భాషల వెర్షన్లను స్ట్రీమింగ్ కు తీసుకొస్తున్నారు.

9 Replies to “నెల రోజులకే ఓటీటీలోకి..!”

  1. తమిళ నిర్మాతలు OTT లో రిలీజ్ చేసే సమయం పెంచారు అని రాసినట్లు ఉన్నారు.

Comments are closed.