ప్రపంచవ్యాప్తంగా ఉద్యోగుల తొలగింపు ప్రక్రియ కొనసాగుతూనే ఉంది. గతేడాది నుంచి జోరుగా సాగుతున్న లే-ఆఫ్స్ ఈ ఏడాది కూడా కొనసాగుతోంది. గడిచిన నెలలో కూడా చాలామంది ఉద్యోగాలు కోల్పోయారు. జులై లో దాదాపు 10వేల మంది తమ ఉద్యోగాలు కోల్పోయారు. ఇలా ఉద్యోగుల్ని తొలగించిన కంపెనీల్లో ఈసారి ఇంటెల్, మైక్రోసాఫ్ట్ లాంటి ప్రముఖ కంపెనీలున్నాయి.
ప్రపంచ టెక్ దిగ్గజ కంపెనీ ఇంటెల్ తమ సిబ్బందిని తగ్గించాలని నిర్ణయించుకుంది. ఈ ఏడాది చివరి నాటికి దాదాపు 15వేల మంది ఉద్యోగుల్ని ఇంటికి పంపించబోతోంది. మొత్తం సిబ్బందిలో ఈ వాటా 15 శాతం. అలా 10 బిలియన్ డాలర్ల ఖర్చు తగ్గించుకోవాలని సంస్థ డిసైడ్ అయింది.
ఇక మరో దిగ్గజ సంస్థ మైక్రోసాఫ్ట్ లో తొలగింపు ప్రక్రియ ప్రతి నెలా కొనసాగుతూనే ఉంది. గడిచిన 2 నెలల్లో మరో వెయ్యి మంది ఉద్యోగుల్ని ఇంటికి సాగనంపింది ఈ సంస్థ. ప్రొడక్ట్ మేనేజ్ మెంట్ సెగ్మెంట్ లో జాబ్ కట్స్ ఎక్కువగా జరిగాయి.
మసాచుసెట్స్ కు చెందిన అతిపెద్ద సాఫ్ట్ వేర్ కంపెనీ యూకేజీ కూడా సిబ్బందిని తొలిగించింది. గత నెలలో 2200 మంది ఉద్యోగుల్ని (సిబ్బందిలో 14 శాతం) ఇంటికి పంపించింది. ఇక కాలిఫోర్నియాకు చెందిన ఇన్-ట్యూట్ అనే మరో కంపెనీ తమ సిబ్బందిని 10శాతం మేర తగ్గించుకునే లక్ష్యంతో, 1800 జాబ్స్ ను కట్ చేసింది.
గడిచిన 2 నెలల్లో పూర్తిగా మూతపడిన కంపెనీలు కూడా ఉన్నాయి. రష్యాకు చెందిన కాస్పర్ స్కై, అమెరికాలో తన కార్యకలాపాల్ని క్లోజ్ చేసింది. పూర్తిగా అమెరికాను వీడిన కారణంగా, పదుల సంఖ్యలో ఉద్యోగాలు కోల్పోయారు. ఒకప్పుడు ట్విట్టర్ కు పోటీ ఇస్తుందనుకున్న కూ అనే యాప్ ఏకంగా షట్ డౌన్ అయింది. తమ ఉద్యోగులందర్నీ ఇది తొలిగించింది. ఈ సంఖ్య 200కు పైనే.
అన్-ఎకాడమీ, వే-కూల్, పాకెట్ ఎఫ్ఎం, హంబుల్ గేమ్స్.. ఇలా ఎన్నో కంపెనీలు జులైలో ఉద్యోగులపై వేటు వేశాయి. నిపుణుల అంచనా ప్రకారం, ఈ ఏడాది మొత్తం ప్రముఖ కంపెనీల్లో లే-ఆఫ్స్ కొనసాగబోతున్నాయి.
Call boy jobs available 8341510897
Call boy works 8341510897