ఇది చదివాక ‘మేరా భారత్ మహాన్’ అనాల్సిందే

బంగ్లాదేశ్ లో రాజకీయ పరిణామం ప్రపంచాన్ని షేక్ చేస్తోంది. ఆ దేశ ప్రధాని షేక్ హసీనా దేశం విడిచి శరణార్ధిగా ఢిల్లీకి వచ్చింది. శ్రీలంకలో అప్పటి అధ్యక్షుడు గోటబయ రాజపక్స అధికార నివాసంపై నిరసనవాదులు…

బంగ్లాదేశ్ లో రాజకీయ పరిణామం ప్రపంచాన్ని షేక్ చేస్తోంది. ఆ దేశ ప్రధాని షేక్ హసీనా దేశం విడిచి శరణార్ధిగా ఢిల్లీకి వచ్చింది. శ్రీలంకలో అప్పటి అధ్యక్షుడు గోటబయ రాజపక్స అధికార నివాసంపై నిరసనవాదులు దాడి చేసి అతనిని పారద్రోలినట్టు, ఢాకాలోని ఆటంకవాదులు షేక్ హసీనాని పరిగెత్తించి ఆమె అధికార నివాసాన్ని దండెత్తి ఆక్రమించుకున్నారు. ఆ వీడియోలు ప్రపంచమంతా చూస్తున్నారు.

ఆ మధ్యన సాయుధ తాలిబాన్లకు భయపడి ఆఫ్ఘనిస్తాన్ అధ్యక్షుడు కర్జాయ్ పారిపోయాక ఆయన అధికార నివాసాన్ని తాలిబాన్లు ఎలా ఆక్రమించుకున్నారో కూడా వీడియోలున్నాయి. సాయుధ శక్తుల నియంతృత్వ వాతావరణంలో అలా జరగడం పెద్ద ఆశ్చర్యం కాదు. కానీ ప్రజాస్వామ్య వ్యవస్థలైన శ్రీలంక, బంగ్లాదేశుల్లో జరగడమే ఆశ్చర్యం.

బంగ్లాదేశ్ పరిస్థితి అత్యంత దారుణంగా ఉంది. సామాజికంగా, రాజకీయంగా, రక్షణపరంగా, ఆర్ధికంగా అన్ని రకాలుగా కుదేలయ్యింది.

శ్రీలంకలో 2022లో గోటబయ రాజపక్స కూడా జనం తిరుగుబాటుకి భయపడి పారిపోయి సింగపూర్ మీదుగా థాయిలాండ్ వెళ్లి తలదాచుకున్నాడు. ఆ తర్వాత చాలా కాలం చతికిలపడి భారత్ సాయంతో కాస్త ఊపిరి పీల్చుకుని, ప్రస్తుత అధ్యకుడు రణీల్ విక్రమసింగే నాయకత్వంలో ఇప్పుడిప్పుడే కుదుటపడుతోంది శ్రీలంక.

బంగ్లాదేశులో తిరుగుబాటుకి, శ్రీలంకలో తిరుగుబాటుకి కారణాల్లో కొంత సారూప్యత ఉంది. గవర్నెన్స్ లోపం, ద్రవ్యోల్బణం, ఫలితంగా నిరుద్యోగం, అనిశ్చితి వగైరాలు. స్థూలంగా “ఈ ప్రభుత్వం మాకొద్దు బాబోయ్” అనేంత తిరుగుబాటు యువతలో రావడం. అదొక ఉన్మాదంగా మారి దాడులకి తెగబడడం.

ఇదిలా ఉంటే పాకిస్తాన్ సంగతి ఆల్రెడీ చూస్తున్నాం. 2019 ఎన్నికల ప్రచారంలో నరేంద్ర మోదీ ఒక ప్రసంగంలో ఇలా అన్నారు- “చూస్తుండండి. త్వరలో పాకిస్తాన్ బిక్షపాత్ర పట్టుకుని ప్రపంచమంతా తిరిగి అడుక్కుంటుంది. దానికి పునాది వేసాం”.

అక్షరాల మోదీ చెప్పినట్టే జరిగింది. పాక్ లోని గడ్డు పరిస్థితిని తట్టుకోవడానికి ప్రధాని షెహబాజ్ షరీఫ్ తిరగని ముస్లిం దేశం లేదు. ఐ.ఎం.ఎఫ్ ని ప్రాధేయపడితే అనేకమైన షరతులు పెట్టింది. ఆ షరతులకి లోబడి అప్పు తీసుకోవడంకన్నా, దేశాన్ని ఐ.ఎం.ఎఫ్ కి రాసియిచ్చేయడం నయం అనుకుని ఆ సాహసం చేయలేదు. ఎందుకంటే ఆ కండిషన్స్ ఆ రేంజులో ఉన్నాయి. మొత్తం దేశం లెక్కాపత్రాల లిస్టు తమకివ్వాలని, మిలిటరీకి పెట్టే ఖర్చు ఆపేయాలని, దేనికి ఎంత ఖర్చు చేయాలో తాము నిర్ణయిస్తామని..వీటికి ఒప్పుకుంటే అప్పిస్తామని చెప్పింది ఐ.ఎం.ఎఫ్.

దీని అర్థం ఏంటి? ప్రధానిగా షరీఫ్ ఉంటాడంతే. పరిపాలన మొత్తం ఐ.ఎం.ఎఫ్ చేస్తుంది..అంతేగా!

ఇక ఎటూ పాలుపోక అక్కడా ఇక్కడా నాలుగు డాలర్లు అప్పు పుట్టినా సరిపోక, స్థానిక బ్యాంకుల నుంచి కనీవినీ ఎరుగని అధికవడ్డీలకి అప్పు తీసుకుంది పాకిస్తాన్ ప్రభుత్వం. అసలు సంగతి పక్కన పెట్టి, వడ్డీలు కట్టడానికైనా మళ్లీ అడుక్కోవాల్సిన పరిస్థితి కనిపిస్తోంది. జనంపై పన్నుల మోత మోగిస్తోంది. అయినా పని జరుగుందన్న నమ్మకం లేదు. పాకిస్తాన్ దయనీయ స్థితి ఇది.

ఇక మరొక దేశం మాల్దీవులు. దీనిని దేశం అని అంటారు కానీ, మన ఇండియన్స్ కంటికి అదొక చిన్న పేటతో సమానం. ఎందుకంటే అక్కడి జనాభా దాదాపు 5 లక్షలు. అంటే ఒక కూకట్ పల్లి జనాభా అనుకోవచ్చు. చైనా మాయలో పడి “గో బ్యాక్ ఇండియా” అని నినదించిన అధ్యక్షుడు ముయిజూ భారతీయుల ఆగ్రహానికి గురయ్యాడు. మాల్దీవులకి భారతీయ టూరిజం తగ్గిపోయింది. భారత్ తో విభేదిస్తే ఎదుర్కోవాల్సిన పర్యవసానాలు కూడా కాస్త అర్ధమయ్యేలా చెప్పింది భారతీయ విదేశాంగ మంత్రిత్వం. భారత్ ని పూర్తిగా విస్మరించి చైనాతో చేతులు కలిపితే కష్టమని అర్ధమయింది ముయిజూకి. దాంతో సర్దుకుని మళ్లీ భారత్ ముందు చేతులు కట్టుకుని నిలబడ్డాడు. అందుకే ప్రధాని మోదీ ప్రమాణస్వీకారానికి ఆహ్వానం అందుకుని వెళ్లాడు కూడా.

ఈ దేశాల్ని పక్కన పెడితే భారత్ కి మిగిలిన రెండు పొరుగు దేశాలు నేపాల్, భూటాన్. వీటిల్లో భూటాన్ ఎప్పటికీ భారత్ నీడలో ఉండే దేశం. చైనా అంటే పడదు కూడా. నేపాల్ మాత్రం ఆ మధ్యన కొన్నాళ్లు చైనా వలలో పడి భారత్ కి వ్యతిరేకంగా వెళ్లబోయింది. కానీ మాల్దీవుల మాదిరిగానే మళ్లీ సర్దుకుంది.

ఈ ఇరుగుపొరుగు దేశాల సంగతి పక్కన పెట్టి కాస్త దూరంగా చూస్తే రష్యా పరిస్థితి ఎలా ఉందో మనకి తెలుసు. ఎప్పటికి ఆగుతుందో తెలియని ఉక్రైన్ యుద్ధంతో ఆర్ధికంగా బీటలు వారింది. సహజంగా అక్కడి స్టాక్ మార్కెట్ దెబ్బతింది.

ఇజ్రాయెల్, ఇరాన్ దేశాల గొడవ చూస్తూనే ఉన్నాం. అక్కడ ఏ క్షణాన్నైనా అధికారికంగా యుద్ధ ప్రకటనలు జరుగుతాయేమోనని ముందే స్టాక్స్ కుప్పకూలాయి. ఇదిలా ఉంటే ఇజ్రయేల్ కి అమెరికా మద్దతు ప్రకటించి యుద్ధంలో సాయం చేస్తుందేమో అనే ఊహాగానాలు బయలుదేరాయి. ఆ దెబ్బకే అమెరికన్ షేర్ మార్కెట్ అమాంతం కింద పడింది. టెస్లా నుంచి, ఎన్విడియా వరకు ఎన్నో దిగ్గజ కంపెనీలు నేడు భారీ నష్టాలు చవిచూసాయి. పైగా అక్కడ నిరుద్యోగం, డ్రగ్స్, గన్ కల్చర్, ఎన్నికల వాతావరణం కలగలిపి పరిస్థితి ఆశాజనకంగా లేదు.

ఇక యూకే సంగతి చెప్పక్కర్లేదు. అక్కడ కూడా ఆందోళనలు జరుగుతున్నాయి. ప్రధాని స్టార్మర్ ఆర్మీని రంగంలోకి దింపి హింసాత్మక సంఘటనల్ని నిలువరించే ప్రయత్నాలు చేస్తున్నాడు. ఎందుకంటే పోలీసుల వల్ల కావట్లేదు. ఇంతకీ అక్కడ గొడవేంటి? కొన్నాళ్లు ఖలిస్తాన్ ఉద్యమకారులు గొడవ చేసినా అది మరీ చేయిదాటేంతగా వెళ్లలేదు. కానీ ఇప్పుడు మాత్రం ముస్లిం శరణార్ధులకి వ్యతిరేకంగా ఉద్యమం ఊపందుకుంది.

ఒక హంతకుడు ముగ్గురు చిన్నపిల్లల్ని డ్యాన్స్ స్కూల్ వద్ద చంపేసాడు. ముందుగా అతను ఇంగ్లాండులో తలదాచుకుంటున్న ముస్లిం శరణార్ధి అని పుకారు వచ్చింది. దాంతో ప్రజలు కోపోదృక్తులైపోయి ఒక మసీదుని తగలపెట్టేసారు. తర్వాత అతను ముస్లిం కాదని తేలింది. దాంతో గొడవ రెండు వర్గాల మధ్య పోరుగా మారింది. ఈ కోపాన్ని మైగ్రెంట్స్ మీదకి షిఫ్ట్ చేసి స్థానికులు వాళ్ల మీద దాడులు చేస్తున్నారు. వాళ్లు ప్రతిదాడి చేస్తున్నారు. శరణార్ధుల పేరుతో వచ్చిన వలసదారులు తమ దేశానికి ప్రమాదమని ప్రజలు ఫిక్సైపోయారు. అందుకే ఈ తిరుగుబాటు. పోలీసులు తమ ఫోర్స్ వాడే కొద్దీ గొడవ ఇంకా పెరుగుతోంది. ఈ గలాటా వల్ల యూకే షేర్ మార్కెట్ కూడా గుల్లౌతోంది.

ఇక ఎప్పుడూ ప్రశాంతంగా ఉండే జపానులో కూడా షేర్ మార్కెట్ షేకయ్యింది. ఇన్నాళ్లూ అక్కడ బ్యాంకుల్లో దాచుకున్న డబ్బుకి ఎటువంటి వడ్డీ ఇవ్వబడలేదు. అంటే ఇంట్లో బీరువాలో డబ్బు దాచుకున్నా బ్యాంకులో దాచుకున్నా ఒకటే. అందుకే ప్రజలు బ్యాంకుల్లో డబ్బు పెట్టకుండా పెట్టుబడులు పెట్టడం అలవాటు చేసుకున్నారు. దానివల్ల బ్యాంకులు దివాళా తీసే పరిస్థితి వచ్చింది. అందుకే పావలా వడ్డీ ఇస్తామని ప్రకటించాయి బ్యాంకులు. దెబ్బకి జనం తాము పెట్టుబడుల్లో పెట్టిన డబ్బుని వెనక్కి తెచ్చి బ్యాంకుల్లో పెడుతున్నారు. ఫలితంగా అక్కడ కంపెనీలు భారీ నష్టాలు చవిచూస్తున్నాయి.

ఇలా ఒకటి కాదు..చిన్న దేశం, పెద్ద దేశం అని తేడా లేకుండా అన్ని దేశాలూ ఏదో ఒక చికాకులో ఉన్నాయి. ముఖ్యంగా ఆర్ధిక పరిస్థితి దెబ్బతింటే దేశాల పరిస్థితి ఇబ్బందికరంగా మారుతుంది. ఆ పరిస్థితి రాకూడదంటే అన్ని విషయాల్నీ చక్కటి బ్యాలెన్స్ తో నడపాలి. అది ఇండియాలో జరుగుతోంది.

ఇక్కడ బ్యాంకులు పటిష్టంగా ఉన్నాయి. షేర్ మార్కెట్ ఒక రోజు పడినా లేచినా, ఓవరాల్ గా బుల్ మార్కెట్ లోనే ఉంటోంది. దానికి ప్రధాన కారణం డిజిటల్ భారత్. ప్రజల్లో చాలామంది కరెన్సీ వాడడం మరిచిపోయారు. అందరూ ఫోన్ పే, గూగుల్ పే అంటున్నారు. దానివల్ల డబ్బు బ్యాంకుల మధ్యనే ప్రవహిస్తోంది. పైన చెప్పుకున్న ఏ దేశాల్లోనూ ఇండియాలో విస్తృతంగా ఉన్నంత డిజిటల్ పేమెంట్ వ్యవస్థ లేదు. కనుక అక్కడ ఆర్ధిక పరిస్థితులకి అది కూడా ఒక కారణంగా చెప్పుకోవచ్చు.

స్థానికంగా చెదురుమొదురు సంఘటనలే తప్ప పోలీసుల చేతులు దాటిపోయేంత హింసాత్మక సంఘటనలు ఇండియాలో చాలా కాలంగా జరగట్లేదు. డ్రగ్స్ మహమ్మారిని కట్టడి చేయడానికి అన్ని ప్రబుత్వాలు ఉక్కుపాదం మోపుతున్నాయి. అంతే తప్ప అమెరికాలోలాగ విచ్చలవిడిగా అమ్మకాలని ప్రోత్సహించడంలేదు. గన్ కల్చర్ ముందు నుంచీ లేదిక్కడ. కనుక ప్రజల్లోని భావోద్వేగాలు, కోపాలు వంటివి ఏవైనా ఉన్నా అవి పరిస్థితులు చేయి దాటిపోయే స్థితికి రాకుండా ఉంటున్నాయి ఇండియాలో.

దూరపు కొండలు నునుపు అనుకుంటూ ఎవరికి వారు తాము అసంతృప్తిలో ఉండడం మామూలే. కానీ లోకంలో చుట్టూ ఉన్న దేశాల్ని చూస్తుంటే ఇండియా ఎంత ప్రశాంతంగా ఉందో అనిపిస్తుంది. ఇలాంటప్పుడైనా అందరూ మనసులోనే “మేరా భారత్ మహాన్” అనుకోవాలి. ఎందుకంటే భారత్ కంటే ప్రశాంతంగా, గొప్పగా ఇప్పుడు చెప్పుకున్న దేశాలేవీ లేవన్నది ప్రస్తుత వాస్తవం.

పద్మజ అవిర్నేని

52 Replies to “ఇది చదివాక ‘మేరా భారత్ మహాన్’ అనాల్సిందే”

  1. 2021 Farmer agitation maloom. 2004 Farmer agitation maloom. 2009 telangana agitation maloom. mandal commission agitations maloom.

    Mana desam kooda same to same. Issue should get ripened before public bursts out. Modi is taking Indian public for granted, if the same rule as before continues then he and Amit shah will have to run away like Hasina madam.

    1. Ree meeru mararu. There is no heaven and hell they were created by elite to control dumb ppl like u and motivate for their own wars. Try to live and allow others to live happily.

  2. That is because of people of our country. They value stability over many things. They know that they can change government at the end of 5 years. They show their anger disappointment with their vote.

    In essence India is stable because of Indians and not because of political leaders

  3. కానీ నాకైతే బంగ్లాదేశ్ నీ చూసీ మన యువత కూడా రిజర్వేషన్లు రద్దు చేయాలని పోరాడితే బాగుంటుంది అనిపించింది. మెరిట్ ఉన్న యూత్ అంతా ఈ caste బేస్డ్ రిజర్వేషన్ వల్ల వేరే దేశాలకి వెళ్లిపోతున్నారు. కొన్నేళ్ళ తర్వాత ఇక్కడ అంతా స్క్రాప్ నే మిగులుతుంది. నిజంగా రిజర్వేషన్ పెట్టాలంటే అన్నీ కులాలలో పెదవాళ్లకు పెట్టాలి.

    1. ప్రభుత్వ ఉద్యోగాలకి ఎవరూ మొగ్గు చూపడం లేదు, కావాలంటే మీ సర్కిల్ లో చెక్ చేసి చూసుకోండి. ప్రైవేట్ విద్యా సంస్థ లలో డొనేషన్ ఇచ్చి చదువుతున్నారు, కోరుకున్న చోట్ల, అందువల్ల ఏ ఉద్యమం అవసరం లేదు.

      1. I I T లాంటి ఇన్స్టిట్యూట్ లో మెరిట్ ఉన్న వాళ్ళకి మరీ మంచి ర్యాంక్ వస్తేనే సీటు వస్తోంది, కానీ రిజర్వుడు కేటగిరీ వాళ్ళకి జస్ట్ క్వాలిఫై ఐతే చకు, నాకు తెలిసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. మెడిసిన్ కూడా అంతే.

        1. Ante reserved category students just iit-jee or neet raasi qualify ayithe chalu seat vacchesthundhi antaru… Okka sari nijalu thelusodaniki try cheyyandi… Notikocchindhalla vagoddhu…

      2. ee vishayam lo meeetho ekibavinchalenu, reservation canditates tho poti perigipoyindhi time waste ani, private ki try chesukutunnaru. ofcourse chinna jobs kanna peddavi kavali kaani private ithe earnimg early ga kanipisthundhi, gov. job try cheyyadam kante. Plus konni incidents kuda bayapedathayi Kakinda Gov. hospital professior ni job teeyinchesinattu. anduke antha try cheyyamdam ledhu.

      3. There are very few govt jobs. Not sure why only north indians try for govt jobs for years they are loosing their productivity years(20 to 40).We should encourage private industries and should privatize all govt ones like banks steel plants that will create more jobs

      1. ఎస్, ఆ కాలం అప్లికేషన్ ఫాం నుంచి తీసేయాలి. ఎకనామికలీ బాక్వార్డ్ కి రిజర్వేషన్ ఇస్తే ఏమీ ప్రాబ్లం?

        1. Application form lo nundi thiyadam kaadhu… burrallo nundi thiseyyali.

          Kulam perutho yevadaina meeting pedithe dhaniki attend ayina vallandharni arrest cheyyali.

          Kulam gurinchi matladina vallani veli veyyali… Ivanni jarigina roju, asalu nidhi ye kulamo nuvvu marchipoyina roju appudu caste based reservations thiseyyali…

          kula pakshapatham chupinche vallu vunnanni rojulu caste based reservations vundalsindhe…

        2. Economically backward ani yela decide chestharu…?

          ee roju white ration card vunna prathi vaadu pedha vadenaa…?

          Nenu pani chesthunna company lo laksha rupayalu tax katte kondharu white ration card lo ration thisukuntunnaru… So economically backward anedhi yela decide chestharu…?

  4. నేను ఈ మీడియా చదవడం కరెక్టే అని అమావాస్య కి పున్నాని కి ఇలాంటి ఆర్టికల్స్ వచ్చి రుజువు చేస్తాయి.

      1. నేను కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నపుడు నా జాతీయ వాదం మార్చుకోలేదు, నేను కుటుంబ పార్టీల అభిమానిని కాదు, కేంద్ర ప్రభుత్వాలు మారినపుడల్లా విధేయత మార్చుకోవడానికి.

        1. Asalu prabhuthvalaki vidheyuluga vundalsina avasaram yenti…? Guddi ga prabhuthvalanu samardhinchakunda, valla nirnayalanu batti abhiprayam vyaktham cheyalema…?

          1. మీరు reactive personality

            భావజాలం బట్టి మనకి ఒపీనియన్ తయారు అవుతుంది

            BJP ఎప్పుడు హిందువులు మంచి కోరే పార్టీ

            ఖంగ్రెస్ ఎప్పుడు దేశాన్ని విచ్చిన్నం చేసే పార్టీ…

            మీరే చుడండి చరిత్ర

          2. ” కానీ దేశాన్ని ప్రేమించే భావజాలం పెరిగింది”

            yemo kaani, vere mathalni dwesinche bhavajalam perigindhi…

          3. వేరే మతాలు చాలా శాంతి కామకులు కలిగి ఉన్నాయ్ 😂😂😂

            కదా సోదరా

          4. Ante mi pakka inti vaadu 10th fail ayyadu ani miru kuda fail avuthara…?

            BJP valla dheshabhakthi perigindhi miru yela chepthunnaro naaku ardham kavadam ledhu…?

      2. రాజీవ్ గాంధీ ప్రధాని గా ఉన్నపుడు అతనికి తెలియకుండా సైన్యం పాకిస్తాన్ తో యుద్దానికి సిద్దపడింది, యూపీఏ ప్రభుత్వం ఉన్నపుడు సైన్యం ఢిల్లీ వైపు మార్చ్ చేసినట్లు ఇండియన్ ఎక్ష్ప్రెస్స్ లో వచ్చింది.

  5. ఈ మీడియా రచయిత లకి మంచి టాలెంట్, జ్ఞానం ఉన్నట్లు ఇలాంటి ఆర్టికల్స్ తెలియచేస్తాయి, కాని ఎక్కువ సార్లు వక్ర మార్గంలో ఉపయోగిస్తారు.

  6. ఇది చదివాకే కాదు.. ఇంతకు ముందు, ఇప్పుడు, ఎప్పటికీ మేరా భారత్ మహాన్!

    విభిన్న జాతులు, అలవాట్లు, ఆలోచనలు, సంస్కృతులు.. వీటి మధ్య ఎన్ని సంఘర్షణలు ఉన్న, వీటి కంటే ‘రాజ్య క్షేమమే’ మిన్న అని ఆలోచించే తత్వం, మనకు రామాయణ, మహాభారత కాలాల నుండే నేర్పింది. స్వలాభంతో పాటు ‘దేశ క్షేమం’ కోసం కొంచెమైనా ఆలోచన చేసే జనాభా శాతం ఎక్కువ ఉన్నంత కాలం మన భారత దేశానికీ ఏ రకమైన ఇబ్బంది లేదు.

    1. హిందువులు ఉన్నంత కాలమే శాంతి సహనం… ఒక్కసారి మన జనాభా తగ్గిందో ఇక అంతే సంగతి

    1. యేక్కడ ఐతే ముస్లిం లు 10 శాతం దాటారో, అక్కడ మీరే చూడండి..

      హైద్రాబాదు పాతబస్తీ..

      బోధన్ , గుంటూర్ ముస్లిం పేట..

      అక్కడ ఒక మినీ పాకిస్తాన్ తయారు అవుతుంది.

      మిగతా జనాలు ఆ ఏరియా లో ఉండలేదు.

      నెమ్మదిగా ఆ ఏరియా పాకిస్తాన్ మైండ్సెట్ వున్న వాళ్ళ కంట్రోల్ లోకి వెళుతుంది.

      మన దేశం కి వ్యతిరేకం గా తయారు అవుతారు.

      ఇది పచ్చి నిజం.

    2. హిందువుల మెజారిటీ తగ్గి ముస్లిం, క్రైస్తవులు మెజారిటీ పెరిగిన ఏరియా లు మీరే గమనించండి..

      భారత వ్యతిరేక శక్తులు కి అడ్డా గా మారుతుంది.

        1. మీలాగా ఒంటె ల మూత్రలు తాగాల ??

          పసిపిల్లలు అని చూడకుండా కామద్రుష్టి తో చూడాల??

          ప్రపంచం లొ ఉన్న అన్ని సైంటిఫిక్ పరికరాలన్నీ మీ పవిత్ర గ్రంధం ఆదారంగా నే తయారు చేయబడ్డాయి అని గ్రహించాల??

          ఒక్క దేశం చూపించు ముస్లిముల మెజారిటీ ఉండి ప్రశాంతం గా ఉన్నది ఒక్క middle ఈస్ట్ తప్ప అది కూడా మోనార్క్ రాజ్యం కాబట్టి

        2. No one knows Arab god exist or not. Christianity and Islam encouraged and supported slavery. Read history How Christianity destroyed American Indians and enslaved them. Every religion has draw backs but culturally indians/hindus are not blood thrusters like other Arab religions

  7. నిజమే భారత్ ప్రశాంతమైన దేశమే కానీ ఉత్తరాదిన అత్యాచారాలు , దక్షిణాదిన రాజకీయ కాలుష్యం

Comments are closed.