రాష్ట్రంలో మెగా డీఎస్సీ నిర్వహిస్తాననే హామీతోనే చంద్రబాబు నాయుడు నిరుద్యోగ టీచర్ల మనసులను గెలుచుకున్నారు. ఆ ఫైలు మీదనే తొలి సంతకం పెడతానంటూ.. అధికారంలోకి వచ్చారు. ఆ మాట నిలబెట్టుకున్నారు. తొలి సంతకం మెగా డీఎస్సీ మీద పెట్టారు. అందుకు ఆయనను అభినందించాలి.
అయితే.. తాజాగా కలెక్టర్ల సదస్సులో విద్యారంగానికి సంబంధించి చంద్రబాబు మాట్లాడుతూ చెబుతున్న మాటలు.. చాలా మందిలో భయాలు పుట్టిస్తున్నాయి. అనుమానాలు కలిగిస్తున్నాయి.
రాష్ట్రంలో పాఠశాలల్లో ఎక్కడా ఉపాధ్యాయుల కొరత లేకుండా చూడాలని, అవసరమైతే విద్యావాలంటీర్లను ఏర్పాటు చేసుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అంటున్నారు. వాలంటీర్లను నియమించుకోవాలనే సూచన చూడడానికి మంచిదిగానే కనిపిస్తుంది. కానీ టీచర్ల నియామకాల సంగతేమిటి? అనే భయాలు పుడుతున్నాయి. వాలంటీర్లను నియమించుకోవాలనే మాటను చంద్రబాబు తాత్కాలిక ప్రాతిపదిక కోసం చెబుతున్నారా? లేదా, వారితోనే కొన్నేళ్లు నెట్టేయాలని అనుకుంటున్నారా? అనే అనుమానాలు కలుగుతున్నాయి.
అలాగే.. 16వేల పోస్టులకు పైగా ఖాళీలు భర్తీ చేయడానికి బాబు సర్కారు నోటిఫికేషన్ ఇచ్చింది. డిసెంబరు నాటికి నియామక పత్రాలు కూడా ఇచ్చేస్తామని ప్రభుత్వం పేర్కొంది. ఇప్పుడు బాబు వాలంటీర్ల ప్రస్తావన తెస్తుండడం గమనిస్తే.. నియామకాలు ఇంకా ఆలస్యం అవుతాయా? అనేది ఒక భయం. అలాగే, రాష్ట్రంలో ఉన్న ఖాళీలన్నీ భర్తీ చేయకుండా.. పరిమితంగా మాత్రమే నోటిఫై చేశారా? అనేది కూడా అనుమానం!
అలాగే.. పిల్లలు రాష్ట్రంలో ఏదో ఒక స్కూలుకు వెళ్లేలా చూడాలని, అది అలవాటైన తర్వాత.. ప్రభుత్వ బడులకు తీసుకురావడం ఎలాగో ఆలోచించవచ్చునని చంద్రబాబు నాయుడు అంటున్న మాటలు కూడా ఇంకో రకం అనుమానం కలిగిస్తున్నాయి. చంద్రబాబు ప్రభుత్వంలో ప్రభుత్వ పాఠశాలలకు ఆదరణ పెరిగేలా వినూత్న చర్యలు ఉండవచ్చునని ఆశించే వారికి ఈ మాట చేదుగా ధ్వనిస్తోంది.
ఉన్న టీచర్లే శుద్ద దండగ మళ్ళీ ఇంకొక 16 వేలమందిని కొత్తఅల్లుళ్లను మేపినట్టు మేపడం ఎందుకు దండగ
gelavaali anukunnaru gelicharu anthe
2019 గురించా
కాదు, 2024 గురించే
కొత్త టీచర్స్ అప్పోయింట్ అయ్యే లోపు గాని, లేక అప్పోయింట్ అయ్యాక గాని ఇంకా కొరత ఉంటె స్టూడెంట్స్ కు చదువు ఆగకుండా వాలంటీర్స్ పెట్టాలని సీబీయెన్ సలహా. భయపడితే స్టూడెంట్స్ భయపడాలి గాని. జిఏ భయపడకు, భయపెట్టకు.
ఎందుకు కొత్త టీచర్స్? వాలెంటీర్స్ తో పని జరిపితే బెటర్. 16000 పోస్ట్లు మల్లి వాళ్ళను మేపటం డబ్బు వృథా.
Call boy works 8341510897
Call boy jobs available 8341510897
Vc available 9380537747