తమ్మినేని మీద పోటీకి బాబు?

తమ్మినేని సీతారాం రాష్ట్ర శాసన సభ స్పీకర్. ఆయన సుదీర్ఘమైన రాజకీయ జీవితంలో ఎన్నో పదవులు అనుభవించారు.  వైసీపీ హయాంలో 2019 ఎన్నికలలో  ఆముదాలవలస నుంచి గెలిచి సత్తా చాటారు. Advertisement ఇపుడు తమ్మినేని…

తమ్మినేని సీతారాం రాష్ట్ర శాసన సభ స్పీకర్. ఆయన సుదీర్ఘమైన రాజకీయ జీవితంలో ఎన్నో పదవులు అనుభవించారు.  వైసీపీ హయాంలో 2019 ఎన్నికలలో  ఆముదాలవలస నుంచి గెలిచి సత్తా చాటారు.

ఇపుడు తమ్మినేని తన సొంత ఇలాకా అయిన తొగరాం పంచాయతీ సర్పంచ్ గా డైరెక్ట్ గా సతీమణి వాణిశ్రీని పోటీకి దింపారు. నిజానికి ఇక్కడ ఏకగ్రీవం చేయాలని తమ్మినేని చేసిన ప్రయత్నాలకు చంద్రబాబు స్థాయిలోనే అడ్డుకున్నారంటే తొగరాం రాజకీయం రసవత్తరమేన‌ని అర్ధమైపోతోందిగా.

తొగరాం లో పోటీ లేకుండా స్పీకర్ చేసిన ప్రయత్నాలకు ఫోన్ ద్వారా చంద్రబాబు లైన్ లోకి వచ్చి మరీ గండి కొట్టారని టాక్. ఆయన టీడీపీ వారి చేత నామినేషన్ హడావుడిగా వేయించడంతో ఇక్కడ ఎన్నిక అనివార్యం అయింది. 

అంటే తమ్మినేని పోటీ టీడీపీతో కాదు చంద్రబాబుతోనే అని అర్ధమైపోతోందిగా. ఇదిలా ఉంటే తమ్మినేని సతీమణి మీద టీడీపీ పోటీకి పెట్టింది కూడా ఆయన వదిన అయిన భారతమ్మను. 

మొత్తానికి అటు బంధుత్వం, ఇటు రాజకీయం కలగలిపిన తొగరాం పంచాయతీ రెండవ విడత ఎన్నికలలో  ఆసక్తిని రేపే పోలింగే అవుతుంది అంటున్నారు. మరి తమ్మినేని సతీమణి ఇక్కడ గెలిస్తే ఓటమి చంద్రబాబుదే అవుతుందా. చూడాలి.

నెక్స్ట్ సినిమా లీక్‌ చేసిన చిరంజీవి.. 

ఆ కలాల వెనుక కులాల ఎజెండా