మండే ఎండలో, ఎడారిలో వీరోచితంగా ఫైట్స్ చేస్తున్నాడు మహేష్. ఎడారిలో ఛేజింగ్ జరుగుతోంది. మరోవైపు పై నుంచి హెలికాప్టర్లు దూసుకుపోతున్నాయి.
సర్కారువారి పాట సినిమాకు సంబంధించిన మేటర్ ఇది. దుబాయ్ లో షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాకు సంబంధించి ఇలా రకరకాల వీడియోలు, ఫొటోలు సోషల్ మీడియాలో ప్రత్యక్షమౌతున్నాయి.
ఓ పెద్ద హీరోకు సంబంధించి షూటింగ్ విజువల్స్ ఇలా లీక్ అవ్వడం ఇప్పుడు సర్వసాధారణం. కానీ దుబాయ్ ఎడారి నుంచి కూడా మహేష్ బాబు సినిమా విజువల్స్ ఇలా లీక్ అవ్వడం అనుమానాలు రేకెత్తిస్తోంది.
మరీ ముఖ్యంగా యూనిట్ కూడా ఈ లీకులపై చూసీచూడనట్టు వ్యవహరించడం, ఈ డౌట్స్ ను మరింత బలపరుస్తోంది. సాధారణంగా ఏదైనా లీక్ అయిన వెంటనే ఫ్యాన్స్ అలెర్ట్ అవుతారు.
సదరు ఫొటోలు లేదా వీడియోస్ ను వైరల్ చేయొద్దంటూ రిక్వెస్ట్ పోస్టులు పెడుతుంటారు. అటు యూనిట్ తరఫున డిజిటల్ టీమ్ కూడా రంగంలోకి దిగి వెంటనే వాటిని డిలీట్ చేసే కార్యక్రమం చేపడుతుంది. కానీ సర్కారువారి పాట విషయంలో మాత్రం రివర్స్ లో జరుగుతోంది.
దుబాయ్ షెడ్యూల్ కు సంబంధించి మహేష్ కనిపిస్తున్న వీడియోలు, ఫొటోల్ని స్వయంగా ఫ్యాన్స్ షేర్ చేస్తున్నారు. కొంతమంది అదే పనిగా వీటిని వైరల్ చేస్తున్నారు.
యూనిట్ మాత్రం ఈ వ్యవహారం తెలిసి చడీచప్పుడు చేయడం లేదు. చూస్తుంటే.. మూవీ ప్రమోషన్ లో భాగంగా వీటిని ఎవరో కావాలనే లీక్ చేస్తున్నారనిపిస్తోంది.