మెగాస్టార్ కు సమంత..నయన్ పోటీ

సాధారణంగా పెద్ద సినిమాలు విడుదలకు వున్నపుడు చిన్న సినిమాలు వెనక్కు తగ్గుతాయి. డబ్బింగ్ సినిమాల సంగతి చెప్పనక్కరలేదు. కానీ ఓ సినిమా మాత్రం ఏకంగా మెగాస్టార్ సినిమా మీదకే వస్తోంది.  Advertisement కొరటాల డైరక్షన్…చిరు..చరణ్..పూజా…

సాధారణంగా పెద్ద సినిమాలు విడుదలకు వున్నపుడు చిన్న సినిమాలు వెనక్కు తగ్గుతాయి. డబ్బింగ్ సినిమాల సంగతి చెప్పనక్కరలేదు. కానీ ఓ సినిమా మాత్రం ఏకంగా మెగాస్టార్ సినిమా మీదకే వస్తోంది. 

కొరటాల డైరక్షన్…చిరు..చరణ్..పూజా హెగ్డే కాంబినేషన్. అయినా ఏం జంకకుండా, థియేటర్లు దొరుకుతాయా దొరకవా అన్న డౌట్ లేకుండా ఏకంగా ఈ నెల 28న డేట్ కొట్టేసారు. ఆ సినిమానే కే. ఆర్. కే. ఈ మధ్య తమిళ డబ్బింగ్ సినిమాలకు అక్కడి టైటిల్స్ నే వుంచేస్తున్నారు. కే. ఆర్. కే అంటే కన్మణి. రాంబో. ఖటీజా. మరి తెలుగులో ఏమైనా అబ్రివేషన్ మారుస్తారేమో చూడాలి.

ఈ సినిమా డబ్బింగ్ సినిమా అయితే కావచ్చు కానీ స్టార్ కాస్ట్ కు లోటు లేదు. విజయ్ సేతుపతి..నయనతార…సమంత ఇదీ కాంబినేషన్. అనిరుధ్ మ్యూజిక్, విఘ్నేష్ సెల్వన్ డైరక్షన్. ఈ సినిమా నుంచి ఇప్పటికే బయటకు వచ్చిన సమంత స్టిల్స్ అన్నీ ఓ రేంజ్ లో వున్నాయి. మరి సినిమాలో సమంత ఎలాంటి మెరుపులు మెరిపించబోతోందో చూడాలి.

ఆచార్య సినిమా కచ్చితంగా మాగ్జిమమ్ థియేటర్లలో వుంటుంది. ఆ వేళకు ఆర్ఆర్ఆర్, కేజిఎఫ్ 2 ల జోరు రెగ్యులర్ అయిపోతుంది. నామినల్ గా ఒక థియేటర్ తో సర్దుకుంటాయి. మిగిలినవి అన్నీ కేరాఫ్ ఆచార్య అంటారు. మరి కే ఆర్ కే ధీమా ఏమిటో విడుదల టైమ్ లో తెలుస్తుంది. 

ఈ సినిమా తెలుగు హక్కులను గాయత్రీ ఫిలింస్ సంస్థ రెండుకోట్ల డెభై లక్షలకు కొనుగోలు చేయడం విశేషం.