అది అంబేద్కర్‌పై దాడి కాదు.. అనైతిక దుర్మార్గం!

తెలుగుదేశం పార్టీకి చెందిన అల్లరి మూకలు విజయవాడలోని అంబేద్కర్ విగ్రహం ప్రాంగణం మీద దాడిచేసి అక్కడి శిలాఫలకం మీద జగన్మోహన్ రెడ్డి పేరును ధ్వంసం చేశాయి. తొలగించాయి. అంబేద్కర్ విగ్రహం మీద తెలుగుదేశం వారు…

తెలుగుదేశం పార్టీకి చెందిన అల్లరి మూకలు విజయవాడలోని అంబేద్కర్ విగ్రహం ప్రాంగణం మీద దాడిచేసి అక్కడి శిలాఫలకం మీద జగన్మోహన్ రెడ్డి పేరును ధ్వంసం చేశాయి. తొలగించాయి. అంబేద్కర్ విగ్రహం మీద తెలుగుదేశం వారు దాడి చేశారని, విధ్వంసానికి తెగబడ్డారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, నాయకులు ఆరోపిస్తున్నారు. దళిత సంఘాల నుంచి కూడా తీవ్రమైన వ్యతిరేకత, నిరసన వ్యక్తం అవుతోంది. ఈ వ్యవహారం ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారుతోంది.

నిజానికి తెలుగుదేశం అల్లరిమూకలు పాల్పడిన దాడి, అంబేద్కర్ విగ్రహం మీద జరిగిన దాడిగా అనుకోవడానికి వీల్లేదు. కానీ రాజకీయాల్లో అత్యంత అనైతికమైన విధ్వంసాత్మక దాడిగా మాత్రం దానిని చూడాలి. దుర్మార్గంగా పరిగణించాలి. జగన్ పేరును తొలగించారు గనుక.. జరిగిన దుర్మార్గానికి కొంత అతిశయం జోడించి.. అతిగా నిందలు వేయడానికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రయత్నించడం చాలా సహజం. వారి నిందలను పట్టించుకోవాల్సిన అవసరం లేదు. కాకపోతే ఈ దుర్మార్గంలో కొన్ని అంశాలు మాత్రం అంత తేలిగ్గా మరచిపోవాల్సినవి కాదు.

అల్లరిమూకలు పోలీసులు ఉండగానే.. అంబేద్కర్ స్మృతివనం వద్దకు వచ్చి అక్కడ ఉన్న వారినందరినీ తరిమేసి, సిబ్బంది ఫోన్లను కూడా లాక్కుని.. శిలాఫలకం మీద జగన్మోహన్ రెడ్డి పేరును ధ్వంసం చేయడం అనేది గమనించాలి. అంటే ఇలాంటి ఒక దుర్మార్గానికి పోలీసులు కూడా సహకరించారు. ఒక పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు.. పాత ప్రభుత్వం చేసిన అన్ని పనుల శిలాఫలకాలను తొలగించుకుంటూ పోతే.. ఈ రాష్ట్రం ఎప్పటికీ రావణ కాష్టంలాగానే రగులుతూ ఉంటుంది.

విజయవాడ నడిబొడ్డున ఉన్న ఈ అంబేద్కర్ స్మృతి వనానికి సంబంధించినంత వరకు దానిమీద చంద్రబాబు నాయుడు ముద్ర ఏమీ లేదు. అది పూర్తిగా జగన్ఆ లోచన, జగన్ కార్యాచరణ మాత్రమే. ఆయన ప్రభుత్వం హయాంలోనే ప్రారంభించి పూర్తిచేశారు, ఆవిష్కరించారు. అక్కడి శిలాఫలకం మీద జగన్ పేరు ఉండడం అన్ని రకాలుగా సబబు. తెలుగుదేశం వారు ఓర్వలేకపోతున్నారా? లేదా, రాష్ట్రంలో ఎక్కడ జగన్ పేరు మిగిలి ఉన్నా కూడా తమకు భవిష్యత్తు ఉండదని భయపడుతున్నారా? అనేది అర్థం కావడం లేదు.

వైసీపీ అభివర్ణిస్తున్నట్టు అంబేద్కర్ మీద దాడి కాకపోవచ్చు గానీ.. జగన్ పేరును తొలగించడం అనేది అనైతికమైన రాజకీయ దుర్మార్గం. ఇలాంటి పనులు చాలా దుర్మార్గమైన విషసంస్కృతికి దారితీస్తాయి. ముందు ముందు ఏ పార్టీ గెలిచినా.. ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడడం ఒక అలవాటు అవుతుంది. పనిచేసిన వారి పేర్లను తొలగించడం తగని పని అని పాలకులు తెలుసుకోవాలి.

14 Replies to “అది అంబేద్కర్‌పై దాడి కాదు.. అనైతిక దుర్మార్గం!”

    1. మీ కామెడీ కాకపోతే.. ఇప్పుడు ఒక్కసారి.. 3 రాజధానులు మీ పార్టీ అజెండా అని చెప్పి చూడండి..

  1. ఆంధ్ర ప్రదేశ్ ప్రజల పన్నుల తో కట్టినది దాని మీద బాబాయ్ ని నరికి చంపిన దుర్మార్గుడి పేరు ఎలా వాడుతారు అందుకే ప్రజలు తొలగించారు అభినందించాల్సిన విషయం

  2. కేవలం దళితులను ఊచకోత కోసిన, దళిత వ్యతిరేకి

    లంగా 11 గాడి శిలాఫలకం నాశనం చేశారు.. అంతేకానీ అంబేద్కర్ విగ్రహం కాదు.

  3. కేవలం దళితులను ఊచ’కోత కోసిన, దళిత వ్యతిరేకి

    ల0గా 11 గాడి శిలాఫలకం నాశనం చేశారు.. అంతేకానీ అంబేద్కర్ విగ్రహం కాదు.

  4. మరి ఎన్టీఆర్ యూనివర్సిటీ పేరు ఎలా మార్చారు…వేసిన చోటనే మల్ల శంకుస్థాపనలు ఎలా చేసారు…తప్పదు మీరు నేర్పిన విద్యయే…మీకు తిరగపడింది ….ఎంతలేండి ఒక ఐదేళ్లు కళ్ళు మూసుకుంటే అయిపోతుంది

  5. పైన కూడా ఎర్రరంగు వేసుకున్న గురువింద గింజ సుద్దులు చెపుతోందండోయ్…… నీకు సిగ్గు శరం మానం అభిమానం ఏమిలేవా GA…? వాళ్ళు చేసింది అనైతికమే…….. కానీ శతబ్దాలు గడవలేదు GA…… YCP పోయి రెండు నెలలే అయింది……. గత 5 సంవత్సరాలలొ జరిగింది ఏమిటి…… నీ…..

  6. బీసీ, ఎస్టీ మంత్రులు నీ తన ఇంట్లో కి కూడా అడుగు పెట్ట నివ్వని కుల మదం తో వున్న వాడి పేరు, అంబేద్కర్ విగ్రహం మీద వుండటం అంబేద్కర్ కే అవమానం.

Comments are closed.