తెలంగాణ తెలుగుదేశం పార్టీని కూడా అధికారం లోకి తీసుకువచ్చే దిశగా కసరత్తు ప్రారంభిస్తున్నట్టుగా ఏపీ ముఖ్యమంత్రి, పార్టీకి జాతీయ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు ప్రకటించారు. ఇలాంటి మాటలు.. పార్టీకి మంచి భవిష్యత్తు ఉండాలని కోరుకునే కార్యకర్తలకు తియ్యగా ధ్వనించవచ్చు. తమ నాయకుడు సీరియస్ గా దృష్టి పెడితే.. అధికారంలోకి రావడం కష్టమేమీ కాదనే ఆశ వారికి కలగవచ్చు. కానీ.. చంద్రబాబు తెలంగాణ తెలుగుదేశం పార్టీ పునర్నిర్మాణం గురించి శ్రద్ధ పెట్టడం అనేది సాధ్యమేనా? అనేదే చాలామందిలో ఉన్న సందేహం. చంద్రబాబు ఈ ప్రకటన ఎంత చిత్తశుద్ధితో చేశారనేది నెలగడిస్తే గానీ చెప్పలేం అని కార్యకర్తలే అంటున్నారు.
చంద్రబాబు నాయుడు.. శనివారం నాడు తెలంగాణ తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యాలయం ఎన్టీఆర్ భవన్ కు వచ్చారు. రెండు గంటలకు పైగా సమయం కేటాయించారు. ఈ సందర్భంగా రాష్ట్రంలోని అందరు ముఖ్య నాయకులతోనూ ఒక సమావేశం నిర్వహించారు. కార్యకర్తలను కూడా కలిశారు. తెలంగాణలో కూడా పార్టీని మళ్లీ అధికారంలోకి తీసుకువచ్చే దిశగా పనిచేస్తాం అని వారికి ఒక భరోసా ఇచ్చారు.
పార్టీకి రాష్ట్ర వ్యాప్తంగా ప్రస్తుతం ఉన్న అన్ని కమిటీలను కూడా చంద్రబాబు రద్దు చేసేశారు. ఇప్పుడు కొత్తగా తెలంగాణలో కూడా సభ్యత్వ నమోదు ప్రారంభిస్తున్నాం అని.. ఈ సభ్యత్వ నమోదు మొత్తం పూర్తయిన తర్వాత.. అప్పుడు కొత్తగా కమిటీలను ఏర్పాటుచేసి, ఫైనల్ గా రాష్ట్ర అధ్యక్షుడుని కూడా నియమిస్తాం అని ప్రకటించారు. బీసీ, ఎస్సీలు, యువతరం పార్టీలోకి రావాల్సిన అవసరం ఉన్నదని కూడా ఆయన పిలుపు ఇచ్చారు. అన్నింటికంటె గొప్ప హామీ ఏంటంటే.. ప్రతినెల రెండో శనివారం, ఆదివారం హైదరాబాదుకు వచ్చి తెలంగాణ తెలుగుదేశం పార్టీ పునర్నిర్మాణం, దిశానిర్దేశం మీదనే దృష్టి పెడతానని కూడా చంద్రబాబునాయుడు చెప్పారు.
నిజానికి ఆయన ప్రకటించిన ప్రణాళిక చాలా బాగానే ఉంది. పార్టీ మీద ఆ శ్రద్ధ మంచిదే. కానీ కార్యచరణ విషయంలో అదంతా సాధ్యమేనా? అనేది పలువురి సందేహం. చంద్రబాబు నాయుడు గతంలో ఏపీలో అధికారంలో ఉన్న సందర్భంలో కూడా తెలంగాణ తెలుగుదేశం పార్టీని ఉద్ధరించడం గురించి అనేక రకాల ప్రణాళికలు ప్రకటించారు. తాను అమరావతి నుంచే నెలకోసారి టెలికాన్ఫరెన్స్ ద్వారా కార్యకర్తలతో మాట్లాడుతుంటానని ప్రకటించారు. ఆ తర్వాత అది ఎన్నడూ జరగలేదు.
కాసాని జ్ఞానేశ్వర్ అధ్యక్షుడిగా ఉన్న రోజుల్లో ఖమ్మంలో భారీ బహిరంగ సభ పెడితే.. అప్పుడు కూడా అధికారంలోకి తీసుకువస్తా అని చంద్రబాబు ప్రకటించారు. ఆతర్వాత ఎన్నడూ కార్యకర్తలతో సమావేశాలు కూడా నిర్వహించలేదు. అలా ఇప్పుడు కూడా నెలకోసారి వచ్చి పార్టీ పనిచూస్తానని అంటున్న చంద్రబాబు చిత్తశుద్ధిని నెలగడిస్తే తప్ప చెప్పలేం అని కార్యకర్తలు అంటున్నారు.
Vc estanu 9380537747
గోరంట్ల maadav చె’ల్లివా నువ్వు??.. అయితే u tub e లో l*ive యేసు’ కో
మడత రాతలు రాయడానికి ఇలాంటి వెబ్ పేజీలు చాలా….
Call boy jobs available 8341510897