బొత్స స్థానికేతరుడు…సీఎం రమేష్ సంగతేంటో?

విశాఖ ఎమ్మెల్సీ ఎన్నికల్లో స్థానికేతరుడిని తెచ్చి పోటీ చేయిస్తున్నారు అని టీడీపీ కూటమి నేతలు కొందరు విమర్శలు చేస్తున్నారు. దానిని వైసీపీ ధీటుగా తిప్పికొడుతోంది. Advertisement మాజీ మంత్రి కురసాల కన్నబాబు దీని మీద…

విశాఖ ఎమ్మెల్సీ ఎన్నికల్లో స్థానికేతరుడిని తెచ్చి పోటీ చేయిస్తున్నారు అని టీడీపీ కూటమి నేతలు కొందరు విమర్శలు చేస్తున్నారు. దానిని వైసీపీ ధీటుగా తిప్పికొడుతోంది.

మాజీ మంత్రి కురసాల కన్నబాబు దీని మీద మీడియాతో మాట్లాడుతూ ఉత్తరాంధ్ర కు చెందిన బీసీ నేత, సీనియర్ నాయకుడు అందరికీ అందుబాటులో ఉన్న వారుగా పేరు తెచ్చుకున్న బొత్స సత్యనారాయణ విశాఖకు స్థానికేతరుడు ఎలా అవుతారని ప్రశ్నించారు.

బొత్సను స్థానికేతరులు అంటున్న కూటమి ముందు తన వెనక ఉన్న వారు ఎవరో చూసుకోవాలని ఆయన కామెంట్స్ చేశారు. అనకాపల్లి ఎంపీగా కూటమి తరఫున గెలిచిన సీఎం రమేష్ ఎక్కడ నుంచి వచ్చారని ప్రశ్నించారు. ఈసారి ఎన్నికల్లో కూటమి ఎన్ని వ్యూహాలు పన్నినా గెలిచేది వైసీపీకి చెందిన బొత్స మాత్రమేనని అన్నారు.

బొత్స విజయాన్ని ఎవరూ ఆపలేరని ఆయన జోస్యం చెప్పారు. వైసీపీకి స్థానిక సంస్థల ప్రజాప్రతినిధుల బలం అధికంగా ఉందని కూటమి బలం లేకుండా పోటీకి వస్తే ఓటమి తప్పదని అన్నారు. బొత్స విజయంతో వైసీపీ మళ్ళీ తన జోరుని కొనసాగిస్తుందని ఆయన అంటున్నారు.

స్థానికేతరులు అని కూటమి నుంచి వస్తున్న విమర్శలను వైసీపీ ఈ విధంగా తిప్పికొడుతోంది. టీడీపీ కూటమి నుంచి ఎంపీలుగా ఎమ్మెల్యేలుగా నెగ్గిన వారిలో అత్యధికులు ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వారేనని ఎద్దేవా చేస్తోంది.

తమ వైపున ఇంత మచ్చ పెట్టుకుని ఉత్తరాంధ్రావాసి అయిన బొత్సను నాన్ లోకల్ అని ఎలా అంటారని నిగ్గదీస్తోంది.

10 Replies to “బొత్స స్థానికేతరుడు…సీఎం రమేష్ సంగతేంటో?”

  1. ప్రజాబలం ఉంది .. వై నాట్ 175 అన్నారు.. ప్రతిపక్ష హోదా కూడా పోయింది..

    నీళ్లిచ్చాము.. వై నాట్ కుప్పం అన్నారు.. పార్టీ ఆఫీస్ మూసుకుపోయింది..

    రాజధాని ఇచ్చాము.. వై నాట్ విశాఖ అన్నారు.. క్లీన్ స్వీప్ అయిపొయింది..

    ఇళ్లిచ్చాము.. వై నాట్ మంగళగిరి అన్నారు .. మెజారిటీ రికార్డు బద్దలు కొట్టాడు లోకేష్

    డిప్యూటీ సీఎం ఎర వేశారు.. వై నాట్ పిఠాపురం అన్నారు.. పార్టీ కి దిక్కులేకుండా పోయింది..

    ఇప్పుడు ఒకే ఒక ఎమ్మెల్సీ సీటు కోసం.. కాళ్ళు తొక్కేసుకొంటున్నారు..

    అందరినీ బెంగుళూరు కి షిఫ్ట్ చేసి.. గంప కింద కోళ్ల లాగా దాచిపెట్టుకొంటున్నారు..

    బొత్స విజయాన్ని ఎవరూ ఆపలేరు అంటున్నారు.. అక్కడ 100 మంది మాత్రమే కనపడుతున్నారు.. మిగతా జనాలు ఏరి? ఎక్కడా..? కనపడరేమి..?

    1. మా ఓట్లు వేరే. ఎన్నికల్లో నించోపెట్టొ, ఒంగోపెట్టొ, పడుకోపెట్టొ వేసేస్తారులెండి

  2. what goes around, comes around!! అప్పుడు మీరు అన్నారు, ఇప్పుడు వాళ్ళు అంటున్నారు !!

  3. కనీసం భాష(మాండలికం)ను పరిగణ లోకి తీసుకున్నా..సత్తి బాబు కంటే స్థానికుడు మరొకరు కనిపించరు.ఉత్తరాంధ్రకు సిసలైన ప్రతినిధి సత్తిబాబు.

  4. ఈ కూరసాల కన్నబాబు – పవన్ కళ్యాణ్ గారి గురించి అతిగా వాగేడు – చివరికి ఓడిపోయారు. ఇంకా బుద్ధి రాలేదు – లోకల్ నాన్-లోకల్ గురించి ఇతని దగ్గర నేర్చుకోవాలి – ముందుగా మీ నియోజకవర్గంలో తిరిగి గెలుస్తారో లేదో చూడండి – విశాఖపట్నం రాజకీయాలు తర్వాత – నెక్స్ట్ లిస్ట్‌లో ఇతనే ఉంటారు – కొంచెం జనసేన శ్రేణులు కొంచెం గట్టిగా కేంద్రీకరించాలి – ఎన్నికల తర్వాత తెలివిగా daakkunadu – చాలా అతిగా వాగడంలో ప్రథముడు.

  5. ఎవరిని ఎన్నుకుంటే ప్రజా సమస్యలపై తమ గళం గట్టిగా విప్పుతారో… ఎవరిని ఎన్నుకుంటే అభివృద్ధి జరుగుతుందో అలాటి వారిని గెలిపిస్తే మంచిది. Irrespective of religion, caste, and locality/region

Comments are closed.