కొన్ని సార్లు తీసుకున్న ఓ చిన్న నిర్ణయం, ఫలితంలో పెద్ద తేడా చూపిస్తుంది. స్త్రీ-2 విషయంలో తీసుకున్న అలాంటి ఓ చిన్న నిర్ణయమే చాలా పెద్ద తేడా చూపించింది. బాక్సాఫీస్ సక్సెస్ లో కీలకంగా మారింది. ఆ నిర్ణయం పేరు తమన్న.
స్త్రీ-2 సినిమాలో స్పెషల్ సాంగ్ కోసం లెక్కప్రకారం నోరా ఫతేహీని తీసుకోవాలి. ఎందుకంటే మొదటి పార్ట్ లో ఆమెనే ఐటెంసాంగ్ చేసింది. కానీ సీక్వెల్ కు వచ్చేసరికి నోరా స్థానంలో తమన్నాను తీసుకున్నారు. ఈ నిర్ణయం సినిమాకు బాగా కలిసొచ్చింది.
స్త్రీ-2కు హైప్ తీసుకొచ్చిన అంశాల్లో తమన్నా చేసిన ‘ఆజ్ కి రాత్’ అనే ఐటెంసాంగ్ ఒకటి. సినిమా విడుదలకు ముందు రీల్స్ రూపంలో ఈ సాంగ్ మోత మోగించింది. యూట్యూబ్ లో ఇప్పటికే వంద మిలియన్ వ్యూస్ దాటేసింది.
బహుశా.. నోరాను తీసుకుంటే అంత రీచ్ వచ్చి ఉండేది కాదేమో అనేది చాలామంది మాట. అయితే ఈ సాంగ్ కోసం తమన్నాకు ఏకంగా కోటి రూపాయలిచ్చినట్టు తెలుస్తోంది. సినిమాలో ఆమె రన్ టైమ్ అటుఇటుగా 5 నిమిషాలు. దానికే అక్షరాలా కోటి రూపాయలు ఛార్జ్ చేసింది తమన్న.
గతంలో నోరాకు ఐటెంసాంగ్ కు పాతిక లక్షలిస్తే, పార్ట్-2లో సాంగ్ కు తమన్నాకు ఏకంగా కోటి రూపాయలు సమర్పించుకున్నారు. అయితే ఈ నిర్ణయం సినిమాకు బాగా కలిసొచ్చింది.
తీసుకున్న డబ్బుకు తమన్న న్యాయం చేసింది. ఆమె డాన్స్ మూమెంట్స్ సినిమాలో హైలెట్ గా నిలిచాయి. అలా స్త్రీ-2 విజయంలో తమన్న పాత్ర కూడా తనవంతు పాత్ర పోషించింది.
Call boy jobs available 8341510897
జనం పట్టించుకోరు
జనం పాటలను స్కిప్ చేస్తారు ఓటిటిలో
VC available 93837747