టాయిలెట్ల ప‌ని మాకొద్దు బాబోయ్‌!

టాయిలెట్ల ఫొటోలు తీసి యాప్‌లో అప్‌లోడ్ చేసే ప‌ని త‌మ‌కు అప్ప‌గించొద్ద‌ని గ్రామ‌, వార్డు స‌చివాల‌య ఉద్యోగులు ప్ర‌భుత్వానికి విజ్ఞ‌ప్తి చేస్తున్నారు.

టాయిలెట్ల ఫొటోలు తీసి యాప్‌లో అప్‌లోడ్ చేసే ప‌ని త‌మ‌కు అప్ప‌గించొద్ద‌ని గ్రామ‌, వార్డు స‌చివాల‌య ఉద్యోగులు ప్ర‌భుత్వానికి విజ్ఞ‌ప్తి చేస్తున్నారు. ఇంత‌కాలం ఆ ప‌నిని ఉపాధ్యాయులే చేసేవాళ్లు. అయితే పిల్ల‌ల‌కు చ‌దువు త‌ప్ప‌, వేరే ధ్యాసే లేని త‌మ‌కు టాయిలెట్ల ఫొటోలు తీసి, వాటిని ప్ర‌భుత్వానికి పంపే బాధ్య‌త పెట్ట‌డం ఏంటంటూ ఉపాధ్యాయుల ప్ర‌శ్నించేవాళ్లు.

ఇలాంటి చ‌ర్య‌లే జ‌గ‌న్ ప్ర‌భుత్వంపై ఉపాధ్యాయులు ఆగ్ర‌హం పెంచుకోడానికి కార‌ణ‌మ‌య్యాయి. ఎన్నిక‌ల్లో వైసీపీకి వ్య‌తిరేకంగా ఉపాధ్యాయులు గంప‌గుత్త‌గా ఓట్లు వేశారు. వైసీపీ ప్ర‌భుత్వాన్ని ప‌డ‌గొట్ట‌డంలో ఉపాధ్యాయులు, ఇత‌ర ఉద్యోగులు కీల‌క పాత్ర పోషించారు. ఈ నేప‌థ్యంలో కూట‌మి ప్ర‌భుత్వం కొలువుదీరిన త‌ర్వాత ఉద్యోగుల ప‌రిస్థితి ఏంటో ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు. అధికార పార్టీ నాయ‌కులు బండ‌బూతులు తిట్ట‌డాన్ని ప్ర‌తి ఒక్క‌రూ చూశారు, విన్నారు.

అయితే ఉపాధ్యాయుల అభిమానాన్ని చూర‌గొన‌డానికి చంద్ర‌బాబు స‌ర్కార్ తెలివిగా ఆలోచించింది. ఆర్థిక‌ప‌ర‌మైన అంశాల జోలికి వెళ్ల‌కుండా, మొద‌ట‌గా టాయిలెట్ల ఫొటోలు తీసే బాధ్య‌త‌ను త‌ప్పించింది. ఆ బాధ్య‌త‌ను గ్రామ‌, వార్డు స‌చివాల‌యాల‌కు ప్ర‌భుత్వం అప్ప‌గించ‌డం గ‌మ‌నార్హం. సచివాలయాల్లోని ఎడ్యుకేషన్‌ వెల్ఫేర్‌ అసిస్టెంట్‌, వార్డు ఎడ్యుకేషన్‌ కార్యదర్శి ప్రతి సోమ, గురువారాల్లో పాఠశాలలకు వెళ్లి మరుగుదొడ్ల ఫొటోలు తీసి అప్‌లోడ్‌ చేయాలి.

ఈ ఆదేశాల‌పై స‌చివాల‌య ఉద్యోగులు మండిప‌డుతున్నారు. తాము ఉన్న‌త విద్య‌న‌భ్య‌సించామ‌ని, పారిశుధ్య ప‌నుల్ని ఎందుకు చేస్తామ‌ని వారు నిల‌దీస్తున్నారు. ఈ విష‌య‌మై విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్‌కు విన్న‌వించ‌డానికి స‌చివాల‌య ఉద్యోగులు రెడీ అవుతున్నారు. ఉపాధ్యాయుల ఆగ్ర‌హానికి గురి కావ‌ద్ద‌నే ఉద్దేశంతో, త‌మ‌ను నీచంగా చూడ‌డం ఏంట‌ని వారు ప్ర‌శ్నిస్తున్నారు.

18 Replies to “టాయిలెట్ల ప‌ని మాకొద్దు బాబోయ్‌!”

    1. Everyone should take this as top priority. We cant use public toilets and our roads are also like drainage due to this attitude. Indians dont even flush the toilets after use. Nothing wrong even if they are told its the responsibility of staff and people who are using it to keep it clean.

  1. ఉద్యోగాలు మానుకోండి. టీచర్స్ మీ కంటే ఎక్కువ చదవలేదా. అయినా ఎందుకు అంత నునత భావం మీకు.

  2. క్వాలిఫై మార్క్ రానివారికి తగ్గించి ఉద్యోగాలు ప్రభుత్వం ఇవ్వడం అతి పెద్ద తప్పు

    1. అలా వచ్చిన వాళ్ళు గట్టిగా 1% కి మించి ఉండరు……ఆ వన్ పెర్చెంట్ని చూపించి మిగిలిన వారికి ఆ డ్యూటీ వేయడం కరెక్టు కాదు

  3. వాలంటీర్స్ కి ఇదే మంచి అవకాశం.. వాళ్ళతోనే కడిగించి ఫొటోలు తీయిస్తే బాగుంటది..

  4. Idhi kaavalani CBN garu sachivalaya vyavasthanu nirveeryam cheyyalani chusthunnaru,Adhi ayana cheyyakunda valanthata vale resign chese laaga vusikolputhunnaru,appudu ilanti panulu cheyyisthunnaru Ani avaru inka join avvaru,appudu Sachivalayalu CANCEL CHESTHARU.

Comments are closed.