ఓటీటీ వాచ్: పొన్ మ్యాన్ బంగారం లాంటి సినిమా!

ఇలాంటి క‌థ‌ల‌తో కూడా సినిమాలు తీయొచ్చా.. అనిపించ‌డంలో మ‌ల‌యాళీల‌కు మించిన వాళ్లు లేరు!

ఇలాంటి క‌థ‌ల‌తో కూడా సినిమాలు తీయొచ్చా.. అనిపించ‌డంలో మ‌ల‌యాళీల‌కు మించిన వాళ్లు లేరు! ఈ మ‌ధ్య‌నో ఎవ‌రో ఒక తెలుగు ర‌చ‌యితో, డైరెక్ట‌రో మాట్లాడుతూ.. ఒక త‌ల్లి, ఒక తండ్రి, ఒక పిల్లాడు.. తిరునాళ్ల‌కు వెళ్లి రావ‌డం గురించి కూడా మ‌ల‌యాళీలు సినిమాలు తీయ‌గ‌ల‌ర‌న్నాడు. అది వ్యంగ్యం అయితే కావొచ్చు కానీ, పొన్ మ్యాన్ లాంటి సినిమాను చూశాకా.. క‌థ‌ల‌ను ఎంచుకోవ‌డంతో, అస‌లు ఇలాంటి వాటితో సినిమాలు తీయొచ్చా అనిపించేలా సినిమా తీయ‌డంలో మ‌ల‌యాళీలు ఇంకోసారి రుజువు చేసుకున్నారు. జియో హాట్ స్టార్ లో ఈ వారంలో అందుబాటులోకి వ‌చ్చిన సినిమా ఇది.

ఒక దిగువ మ‌ధ్య‌త‌ర‌గ‌తి కుటుంబం. బాధ్య‌త ఎర‌గ‌క రాజ‌కీయ పార్టీ అనుచ‌రుడిగా కొన‌సాగే కొడుకు, అక్క‌డా గొడ‌వ‌ల‌కు కార‌ణం అవుతున్నాడ‌ని స‌స్పెండ్ చేస్తారు. కూతురు పెళ్లి కోసం అని ఆర్భాటంగా 25 తులాల బంగారం ఇస్తాననే త‌ల్లి. వ‌రుడుపై ఎలాంటి ఇష్టం లేక‌పోయినా.. పెళ్లికి స‌రేన‌నే కూతురు. తీరా పెళ్లి ముహూర్తం ద‌గ్గ‌ర‌ప‌డ్డాకా.. బంగారం కోసం త‌చ్చాడుకోవ‌డం మొద‌ల‌వుతుంది. స‌రిగ్గా ఇలాంటి కుటుంబాల‌ను ప‌ట్టుకుని.. చ‌దివింపుల ద్వారా స‌మ‌కూరేంత డ‌బ్బుకు త‌గిన‌ట్టుగా బంగారం ఇచ్చి, బిల్లుల్లేని బంగారాన్ని అమ్ముకునే ఒక దుఖాణంలో ప‌ని చేసే హీరో!

ఆ కుటుంబానికీ అత‌డు బంగారాన్ని అందిస్తాడు. ఆ బంగారానికి త‌గినంత డ‌బ్బు చ‌దివింపుల్లో వ‌స్తుంద‌ని కుటుంబం లెక్క‌లేసుకుని ఉంటుంది. ఆ డ‌బ్బును తీసుకుని బ‌య‌ల్దేర‌దామ‌ని హీరో అనుకుంటాడు. అయితే చ‌దివింపులు ఆ స్థాయిలో రావు! దానికి కార‌ణం కొడుకు అంత‌కు ముందు చేసుకున్న గొడ‌వ‌ల‌తో.. చ‌దివించేవారంతా పెళ్లికి రారు! పార్టీ కూడా అత‌డికి ఎలాంటి సాయం చేయ‌దు! ఈ లెక్క‌ల తారుమారుతో.. స‌గం బంగారానికి చ‌దివింపుల సొమ్ము స‌రిపోతుంది. మిగ‌తా 12 తులాల‌కూ డ‌బ్బులు ఇవ్వ‌లేక‌పోతుంది కుటుంబం. మ‌రి ఆ డ‌బ్బును ఆ బంగారం దుఖాణంలో ప‌నిచేసే స‌గ‌టు ఉద్యోగిలాంటి ఆ హీరో ఎలా రాబ‌ట్టుకున్నాడ‌నేది మిగ‌తా క‌థ‌!

ఇదంతా ఆరంభం మాత్ర‌మే! ఆ పాయింట్ మీద‌.. ఆద్యంతం అత్యంత ఆస‌క్తిదాయ‌కంగా ఈ సినిమా న‌డిచే తీరును ఎంత అభినందించినా త‌క్కువే! దిగువ మ‌ధ్య‌త‌ర‌గ‌తి కుటుంబ నేప‌థ్యంలో సాగే ఈ క‌థ‌నం.. వారి ఆలోచ‌నా తీరు, వారి ప‌రిస్థితులు ప్ర‌తిబింబించే తీరులో సాగుతుంది. అలాగ‌ని.. ఇదేం బీద‌ల బ‌తుకుల క‌థ‌లు చెప్పి అయ్యో అనిపించే సినిమా ఏమీ కాదు! మ‌నుషుల్లో ఉండే స్వార్థాలు, కోరిక‌లు, ప్ర‌ణాళిక‌లు, మోసాలు వీటన్నింటి మ‌ధ్య‌నా..ఎలాంటి ప‌రిస్థితులు ఎదురైనా చ‌లించ‌క జీవితంలో పోరాడాల‌నే త‌త్వం ఉన్న హీరో స్ఫూర్తే ఈ సినిమాలో బాగా ఆక‌ట్టుకునేది!

హీరోయిజం అంటే.. ఎగిసి తంతే ప‌ది మంది అటూ ఇటూ ప‌డ‌టం కాదు.. త‌న కుటుంబ నేప‌థ్యం దృష్టిలో ఉంచుకుని ప‌రిస్థితుల‌పై పోరాడే త‌త్వం అనే రీతిన హీరో క్యారెక్ట‌రైజేష‌న్, అత‌డికి రాసిన డైలాగులు అర్థ‌వంతంగా ఉన్నాయి. రాజ‌కీయాల‌ను న‌మ్ముకుని సోంబేరీలా తిరిగే కొడుకు పాత్ర‌, స్థాయికి మించిన ఆర్బాటానికి పోయి పాతిక తులాల బంగారం ఇస్తానంటూ హామీలిచ్చే త‌ల్లి పాత్ర‌, ప‌రిస్థితులు అడ్డం తిర‌గ‌డంతో మోసాల‌కు తెగ‌బ‌డే మిగ‌తా పాత్ర‌లూ.. ప్ర‌తీదీ స‌మాజంలో, వార్త‌ల్లో క‌నిపించే పాత్ర‌లే! ఏదీ క‌ల్ప‌న కాదు!

26 Replies to “ఓటీటీ వాచ్: పొన్ మ్యాన్ బంగారం లాంటి సినిమా!”

  1. హీరొయిజం అంటె తండ్రి అదికారం అడ్దుపెట్తుకొని అమంతం ప్రజల సొమ్ము అమాంతం మింగెయటం కాదు.

    వాడికి మళ్ళా అబిమానా సంఘాలు, కీర్తించటనికి Paytm కు.-.క్క.-. లు అంటవా?

    1. Yeraaa…entlo ni pellanno ammano denguthunnappudu kooda YCP vallani taluchukune denguthavaa?? Madarchod…ni brathuku oka siggu yeggu undadhaa raa somberi LK…!!!

        1. Arey howley ga I am talking about movies which is related to movies and it’s a fact that most of the tollywood movies are useless. Caste based fans like you won’t understand it 😛

        2. Nee lanti kula picholaki caste based movies Istam ayithe andariki istam undalani ledu ra howley. Movies should be judged based on the content not the heroes or region or caste.

        3. Mana hero Lu endi ra howley .Grow up and Stop worshipping people based on their caste.They aren’t my heroes. They are just actors. Unlike you I don’t own heroes/movies based on their caste or region.

  2. ప్రతి ఆర్టికల్ కింద ఒక రాజకీయ నాయకుణ్ణి ద్వేషిస్తూ తమ అద్వాన్న బ్రతుకులు ఈడుస్తూ ఉన్న బాలరాజు లూ ఎమిరా మీ వల్ల దేశానికి ఉపయోగం.

  3. some useless People like Mr rational blindly hate one guy based on their caste and they keep writing about that guy even though it’s not related to the article/topic.

Comments are closed.