ఎమ్బీయస్‍: జయకే‘తన’ సభ

టిడిపితో 15 ఏళ్లు కలిసి ఉంటాం అన్నారు పవన్. అది టిడిపిని మెప్పించడానికి అయి వుండవచ్చు కానీ ఓ రకంగా జనసైనికులను నిరాశ పరచడమే.

జనసభ యీ ఏడాది జరుపుకున్న వార్షికోత్సవ సభ విశేషమైనది. పార్టీ పెట్టి పుష్కరమైనా యింతటి ఘనవిజయం దానికి దక్కలేదు. 2019 ఓటమిని తుడిచి పెట్టేసేట్లా 2024లో 100 శాతం స్ట్రయిక్ రేట్‌తో విజయం, పార్టీ అధ్యక్షుడికి ఉప ముఖ్యమంత్రి పదవి, ముఖ్యమంత్రి ఆయనను అడుగడుగునా స్తుతించడం. తొక్కి నార తీస్తానన్న జగన్‌ను అంత పనీ చేయడం.. యిలా కిరీటంలో ఎన్నో తురాయిలు. ఇలాటి సందర్భాల్లో రాజకీయ నాయకులు ఎలా మాట్లాడుతారో చాలా ఏళ్లగా చూస్తున్నాం. ‘మనమంతా కలిసి పోరాడాం, భాగస్వాములు కలిసి వచ్చారు, శత్రువుని చిత్తు చేశాం. మనం యింకా చేయాల్సి ఉందని ప్రజలు గుర్తు చేస్తున్నారు. మన పార్టీ గ్రామగ్రామాన విస్తరించాలి. పార్టీ నిర్మాణం బలోపేతం కావాలి. విజయగర్వంతో ప్రజలకు దూరం కావద్దు. వచ్చే ఐదేళ్లలో కూటమిలో మన పాత్ర మరింత పెద్దగా ఉంటుందని ఆశిద్దాం..’ యీ తీరులో ప్రసంగం సాగాలి.

పవన్ విషయంలో ఐతే ఒక ప్రత్యేకంగా కొన్ని విషయాలు వచ్చి చేరాల్సి ఉంది. ఎందుకంటే ఆయన ప్రజల తరఫున ప్రశ్నించే గొంతుగా రాజకీయాల్లోకి వచ్చాడు. 2014 ఎన్నికలలో కూటమి ప్రభుత్వానికి మద్దతు యిచ్చినా, 2014-19 మధ్య నడిచిన బాబు ప్రభుత్వంలో తనకు నచ్చని అంశాలు కనబడినప్పుడు ఆంధ్ర వచ్చి ఆందోళనలు, దీక్షలు చేశాడు. అమరావతి భూములు, ఉద్దానం బాధితులు, ప్రత్యేక హోదా పట్ల ప్రభుత్వం సరిగ్గా అడగకపోవడం, ప్రత్యేక ప్యాకేజీ సరిగ్గా యివ్వలేదని బాబు అంటున్నప్పుడు ఆ క్లెయిమ్‌లో నిజానిజాలు తేల్చండంటూ జెపి, ఎల్వీ, ఉండవల్లి వగైరా మేధావులను కూర్చోబెట్టి నివేదిక తయారు చేసి యిమ్మనడం… యిలాటివి చేశారు. ఆ సమయంలోనే టిడిపి జనసేనపై, పవన్‌పై తీవ్రంగా విరుచుకు పడడం, ఘర్షణ పడడం కూడా జరిగింది. 2019లో విడివిడిగా పోటీ చేశారు.

ఇక 2019-24 కాలంలో అయితే ప్రతిపక్ష నాయకుడిగా పవన్ అధికార పక్షమైన వైసిపిపై పూర్తి స్థాయిలో విరుచుకు పడ్డారు. ప్రతిపక్ష నాయకుడు బాబు జైల్లో పడినప్పుడు రోడ్డు మీద పడ్డారు కూడా. రోడ్ల మీద గుంతల్ని, రోడ్డు విస్తరణలను, వాలంటీరు వ్యవస్థను, ఒకటేమిటి కనబడిన ప్రతిదానిపై ఆందోళన చేశారు. విడిగా పోటీ చేస్తే ఆత్మహత్యాసదృశమే అని ప్రకటన యిచ్చి, అనేక విషయాల్లో రాజీ పడి టిడిపితో జట్టు కట్టారు. నెగ్గారు. నెగ్గి, ఉప ముఖ్యమంత్రి పదవి తీసుకున్నాక కూడా తన ప్రభుత్వంపై విమర్శలు ఆపలేదు. శాంతిభద్రతల విషయంలో, బియ్యం అక్రమ రవాణా విషయంలో.. యింకా అనేక విషయాలలో తన కాబినెట్ సహచరులను సైతం ఘాటుగా విమర్శిస్తున్నారు. ఒకలా చెప్పాలంటే జగన్ చేయాల్సిన పని తను చేసి, అతని ప్రాధాన్యతను తగ్గిస్తున్నారు. అధికార పక్షంలో ఉంటూనే ప్రతిపక్షంలా వ్యవహరిస్తే ప్రజల మెప్పు పొందడం సులభం. ప్రభుత్వం చేస్తున్న అవకతవకల వలన బాధపడుతున్న మన గోడు వినిపించడానికి ప్రతిపక్ష నాయకుడు ఎలాగూ అసెంబ్లీకి వెళ్లటం లేదు. ఈయన పాపం మన తరఫున గళం విప్పుతున్నాడు అని అనుకుని సామాన్యులు సంతోష పడతారు.

ఏ పదవులూ నా గొంతును నొక్కలేవు అని చెప్పుకోగల తన లేటెస్టు యిమేజికి తగ్గట్టుగా పవన్ ప్రభుత్వ వైఫల్యాల గురించి, అమలు చేయని హామీల గురించి, కుంటుపడిన పథకాల గురించి కూడా సూచనప్రాయంగా ప్రస్తావించి, దాన్ని యథావిథిగా గత ఐదేళ్ల దుష్టపాలనపై నెట్టేసి, అయినా మీ కష్టాలను మీ తరఫున బాబుగారితో చర్చించి, పరిష్కరిస్తాను అంటే జనం హర్షించేవారు. కానీ ఆయన యిహలోకంలో తమ పరిపాలన గురించి కాకుండా పరలోకపు వ్యవహారాలపై ఎక్కువగా మాట్లాడారు. విజయోత్సవంగా జరగాల్సిన సభలో అనవసరపు విషయాలు మాట్లాడి వివాదాస్పదం చేశారు. పవన్ ప్రసంగంపై అనేక మంది, అనేక వేదికలపై విమర్శలు గుప్పిస్తున్నారు. చివరకు 99 టీవీ ఛానెల్‌కి వచ్చిన విశ్లేషకులు కూడా తప్పు పడుతున్నారు.

ఇది నివారించ దగిన విషయం. ఏదో ఆవేశంలో, ఆశువుగా మాట్లాడిన ప్రసంగం అనుకుంటే అదో దారి. పాయింట్లన్నీ రాసుకుని వచ్చి. చదువుతూ చేసిన ప్రసంగం యీ తీరున వుండడం ఆశ్చర్యకరం. గంటన్నర సాగిన ఆయన ప్రసంగంలో ప్రతి అంశంపై నేను రాయటం లేదు. మూడు అంశాలు మాత్రం ఎంచుకుంటున్నాను. ఒకటి తన గురించి చెప్పుకోవడం, రెండు హిందీ విషయంపై మాట్లాడడం. హిందీ రుద్దడం గురించి స్టాలిన్ చేస్తున్న పోరాటం గురించి విడిగా వ్యాసం రాస్తూ దానిలో పవన్ వాదనలు ఖండిస్తాను. దీనిలో ఆయన చేసిన అసమంజసపు వాదనల గురించి రాస్తాను. మూడోది 40 ఏళ్ల టిడిపిని నిలబెట్టాం అనే పొలిటికల్లీ యిన్‌కరక్ట్ స్టేటుమెంటు గురించి!

మొదటిది – తన గురించి తాను అంతగా చెప్పుకోవడం దేనికి? ఈయన రాజకీయాల్లోకి కొత్తగా వచ్చాడా? ఉద్యోగంలో చేరిన పుష్కరానికి రెజ్యూమే యిచ్చినట్లుంది. అనేక మీటింగుల్లో చెప్పినదే మళ్లీ చెప్పారు. తన సినిమాల గురించి, సినిమాల్లో తను పెట్టించిన పాటల గురించి, సినిమాకి వెళ్లి ఆలస్యంగా వస్తే వాళ్ల నాన్నగారు మందలించిన విషయం గురించి, యివన్నీ చెప్పాలా? టీము లీడరు అనేవాడు విజయం సాధించినప్పుడు యిది మన విజయం అంటూ మాట్లాడాలి. వైఫల్యం సంభవించినప్పుడు తప్పు తన మీద వేసుకుని, నాకు అవగాహన లోపించింది, ఇకపై మీ సలహాలు జాగ్రత్తగా వింటాను అని ప్రసంగించాలి. ఇది విజయోత్సవ సభ. మనందరం కలిసి సాధించాం అంటూ మాట్లాడాలి తప్ప నా జీవితగాథ చెప్తాను వినండి అంటే ఎలా?

ఆ గాథ చెప్పడంలో కూడా కారెక్టరు మార్చేస్తున్నారు. ఈయన చే గువియేరా నుంచి సనాతన ధర్మం దాకా ప్రయాణించాడు సరే, ఆ లక్షణం మా వంశంలో ఉందని చెప్పుకోవడానికి తండ్రి కారెక్టరులో కొత్త కోణాన్ని ప్రదర్శించారు. ఇప్పటిదాకా ఆయన్ను కమ్యూనిస్టు అన్నారు, నాస్తికుడు అన్నారు, తల్లి దీపారాధన దీపంతో సిగరెట్టు వెలిగించుకునే వారన్నారు. అదే పెద్ద కన్‌ఫ్యూజన్. కమ్యూనిస్టు లందరూ నాస్తికులు కారు, నాస్తికులందరూ కమ్యూనిస్టులు కారు. నాస్తికులను గౌరవించే ఆస్తికులూ ఉన్నారు, ఆస్తికులను గౌరవించే నాస్తికులూ ఉన్నారు, ఈయన తల్లి ఆస్తికత్వాన్ని గౌరవించని నాస్తికుడు. అంతవరకు అనుకుంటే చాలు. కమ్యూనిస్టు అనేది వేరే విషయం.

అవతలవాళ్ల సెంటిమెంటు పట్టించుకోకుండా ఆయన అలా అరుదుగా చేసినా, తరచుగా చేసినా ఆ విషయం కొడుకు పబ్లిక్‌లో చెప్పడం దేనికి? దానివలన ఆయన యిమేజి దెబ్బ తినదా? ఇప్పుడు చెప్తున్న దాని ప్రకారం పాపం ఆయన అలాటి పనులు చేసినది 20 ఏళ్ల వయసు వరకే! ఈ మధ్య చిరంజీవి ఓ సినిమా ఫంక్షన్‌లో సరదాగా మాట్లాడుతున్నా ననుకుంటూ మా మాతామహుడికి టూ ప్లస్ భార్యలని చెప్పారు. ఎందుకది? ఆ కాలంలో అలాటివి చెల్లాయి. ఈనాటి కళ్లతో చూసి, వాటిపై వ్యాఖ్యానించడం, ఆట పట్టించడం అనవసరం. అవి తెలుసుకుని ప్రజలు బాగు పడేదీ లేదు.

పద్మనాభం గారు తన ఆత్మకథను ‘‘హాసం’’ పత్రికకు రాస్తూ చివరి సంచికల్లో ‘‘నాకు ముగ్గురు భార్యలు, ఇప్పుడు ఆర్థిక కష్టాల్లో మునిగాను. బహుభార్యాత్వం తప్పు.’’ అంటూ రాసి పంపారు. ఎడిట్ చేసేశాను. ఎందుకని అడిగారాయన. ‘ప్రొటగానిస్టుపై పాఠకుడికి మమకారం పోకూడదండి. ముగ్గుర్ని చేసుకుంటే ఆస్తి కరిగిపోక ఏమౌతుంది? అని పాఠకుడు కసిగా అనుకుంటాడు.’ అని చెప్పి కన్విన్స్ చేశాను. ఘంటసార, భీమ్‌సేన్ జోషి సంతానం తమ తండ్రుల ద్వితీయ వివాహం గురించి పుస్తకాలే రాసేశారు కాబట్టి వాటిపై డిస్కషన్స్ నడిచాయి. వాళ్లంతా కళాకారులు. చిరంజీవి, పవన్ రాజకీయాల్లో ఉన్నవారు. సాధ్యమైనంత వరకు తమ పూర్వీకుల యిమేజి డామేజి కాకుండా చూసుకోవాలి. ఎవరైనా తవ్వి తీసి అడిగినా ‘అప్పట్లో వాళ్లూవాళ్లూ సర్దుకున్నారు. ఇప్పుడు మనమెందుకు ఘోష పడడం?’ అంటూ తేలిగ్గా తీసిపారేయాలి.

ఎప్పుడు చూసినా పవన్ ‘జగన్ ఫ్యాక్షన్‌లో పుట్టాడు, నేను విప్లవంలో పుట్టాను’ అని చెప్పుకుంటూ ఉంటే ‘ఈయనది కమ్యూనిస్టు కుటుంబం కాబోలు’ అనుకునేవాణ్ని. ఎందుకంటే స్టూడెంటు రోజుల్లో యీయన వామపక్ష విద్యార్థి సంఘాల్లో తిరిగినట్లు ఎప్పుడూ చెప్పుకోలేదు. ఇక పెద్ద అన్నగారు చిరంజీవి అయితే తను టీన్స్‌లో ఉంటూ సినిమాల్లో ప్రయత్నించే రోజుల్లో ఓ రోజు ఆంజనేయస్వామి కలలోకి వచ్చి ‘చిరంజీవీ’ అని సంబోంధించాడనీ, దానితో తన స్క్రీన్ నేమ్ చిరంజీవిగా మార్చుకున్నానని పలుమార్లు చెప్పారు. అందువలన ఆస్తికుడే. ఇక భావాల రీత్యా కమ్యూనిస్టా అంటే మాదాల రంగారావు మార్కు సినిమాలు తీయలేదు. పార్టీ పెట్టకముందు టిడిపికి కాన్వాస్ చేశారు తప్ప లెఫ్ట్ పార్టీలకు చేయలేదు. పార్టీ పెట్టాక సామాజిక.. అంటూ ఏదో అన్నారు తప్ప సామ్యవాద.. అంటూ ఏమీ ప్రవచించ లేదు.

అందువలన విప్లవంలోంచి పుట్టానని యీయన అంటే తండ్రి అభిప్రాయాల దృష్ట్యా కమ్యూనిస్టు (ప్రభుత్వోద్యోగి కాబట్టి విప్లవకారుడు కానేరడు) అనుకునేవాణ్ని. ఇప్పుడాయన్ను హఠాత్తుగా రామభక్తుణ్ని చేసేశాడీయన. 20 ఏళ్ల వరకు నాస్తిక కమ్యూనిస్టుట. తర్వాత రామభక్తుడై పోయి, యింట్లో రామభజన చేయించేవారట. రామభక్తుడైనా, కమ్యూనిజాన్ని మనసులో దాచుకున్నారేమో ప్రస్తుతానికి తెలియదు. పవన్ నాస్తికత్వాన్ని, కమ్యూనిజాన్ని కలగలిపి మాట్లాడతారు కాబట్టి దానిపై ఎప్పటికి స్పష్టత వస్తుందో తెలియదు. ఆయన 20 ఏళ్లకే రామభక్తుడై పోయారు కాబట్టి, పవన్ పుట్టేనాటికే యింట్లో రామభజన వినబడుతోంది. మరి యీయన విప్లవంలో పుట్టానని ఎలా అంటున్నారో తెలియదు. అంటే అన్నారు, ఆ విప్లవకారుడి యిమేజి, శ్రీశ్రీ పద్యాలు, శేషేంద్ర శర్మ పద్యాలు అలాగే మేన్‌టేన్ చేస్తే బాగుండేది. (కానీ యీయన వరస చూస్తే త్వరలోనే శ్రీశ్రీ విప్లవగీతాలకు పురాణాన్వయం కల్పించి చెప్తారనిపిస్తోంది)

ఎందుకంటే సామాన్య ప్రజల్లో వామపక్ష భావాలంటే మోజు ఉంటుంది. కమ్యూనిజం అంటే భయం, ఉన్నదంతా ఊడ్చి పట్టుకుపోతారేమోనని. అందుకని ఆర్థిక సమానతలు తగ్గిస్తాం అనే సామ్యవాదం అంటే మోజు పడతారు. నెహ్రూ సోషలిజం పేరు చెప్పే ప్రజల్లో ఎక్కువ పలుకుబడి తెచ్చుకున్నాడు. సర్దార్ పటేల్ కాపిటలిజం అంటూ ప్రజలకు చేరువ కాలేకపోయాడు. అందుకే గాంధీ ప్రధానిగా నెహ్రూని చేసి, ఉపప్రధానిగా పటేల్‌ను చేశాడు. ఎన్టీయార్‌ని మించిన కాపిటలిస్టు ఉన్నారా? కోట్లాది ఆస్తులు సంపాదించి, కుటుంబానికి సమకూర్చి, రాజకీయాల్లోకి వచ్చాక నేను ఒకప్పుడు కమ్యూనిస్టు కార్డ్‌హోల్డర్‌ను, నక్సలైట్లు నిజమైన దేశభక్తులు అంటూ కబుర్లు చెప్పి ఓట్లు తెచ్చుకున్నాడు. అధికారంలోకి వచ్చాక పేదలకు సంక్షేమ పథకాలంటూ యిచ్చాడు తప్ప భూసంస్కరణలు, సహకార సంఘాలు ఏమైనా పెట్టాడా? అవలంబించినది కాపిటలిస్టు విధానాలే కదా!

పవన్‌ చిరుగడ్డంతో విప్లవకారుడి యిమేజి మేన్‌టేన్ చేసి ఉంటే, యువతకూ హుషారుగా ఉండేది, పేదలకూ ఉత్తేజకరంగా ఉండేది. కానీ యీయన గడ్డం బాగా పెంచేసి, నుదుటన బొట్టు దిద్దేసి, కాషాయ వస్త్రాలు తొడిగేసి, పూర్తిగా స్వామీజీ వేషం కట్టి యుపి బిజెపి ఎంపీల అవతారం ఎత్తాడు. అచ్చు బిజెపి ఎంపీలాగే మాట్లాడేడు. చే గువియేరాను విప్లవకారుడిగా అభిమానించ లేదంటూ భలే స్టేటుమెంటు యిచ్చారు. చే ను ప్రపంచమంతా విప్లవానికి ప్రతీకగానే చూస్తోంది. ఈయనకు మాత్రం వైద్యవృత్తి వదిలి ప్రజాసేవలోకి వచ్చిన వ్యక్తిగా చూస్తున్నారు. చే వైద్యవృత్తిలో ఎప్పుడున్నాడు? వైద్యం చదివాడు కానీ ప్రాక్టీసు చేయలేదు. మనకు అన్ని విషయాలూ తెలియాలని లేదు. కానీ నచ్చిన వ్యక్తి గురించి క్షుణ్ణంగా తెలుసుకుంటాం కదా. ఈయన తెలుసుకోలేదా? లేదా మాట జారిందా?

ఉపన్యాసం యిచ్చినపుడు మాట తడబడడం, ఒకదాన్ని పలకబోయి మరొకదాన్ని పలకడం, ఒక పేరు చెప్పబోయి మరో పేరు చెప్పడం, చటుక్కున గుర్తు రాక బుఱ్ఱ గోక్కోవడం యివన్నీ సహజమే. అందుకే నేనెప్పుడూ అలాటి పొరపాట్ల గురించి రాయను. కానీ యిది పవన్ రాసుకుని వచ్చి, కాగితం లోంచి చదువుతున్న సందర్భం. ఇది పొరపాటని పవన్ తర్వాత కూడా సరిదిద్దుకోలేదు. అయినా ప్రస్తుతం ఆంధ్ర అప్పుల్లో ఉంది, పథకాలు నిలిచిపోయాయి, సంపద సృష్టించేదాకా కదలవు, ఆ సృష్టి ఎప్పటికి ప్రారంభమౌతుందో తెలియదు. ఈ విషయాలు వదిలిపెట్టి విప్లవం, దాన్ని వదిలిపెట్టి సనాతన ధర్మం గురించి ఉపన్యాసాలు యిస్తే ప్రజలకు ఏం రుచిస్తుంది?

అసలు పవన్ మొదట సనాతన ధర్మాన్ని నిర్వచించి మరీ మాట్లాడాలి. చాలామంది దాన్ని మనుస్మృతికి లింకు పెట్టి, వర్ణవ్యవస్థ, స్త్రీల అణచివేత, దళితుల పట్ల హింస యిలాటి వాటి గురించి మాట్లాడుతున్నారు. అది కాదు, సనాతన ధర్మం అంటే ఎటర్నల్ ట్రూత్, దానిలో యివి ఉండవు అని మీకు తోస్తే, తెలిస్తే దాన్ని స్పష్టంగా చెప్పండి. అది మానేసి, మీరు ఒవైసీ ఎప్పుడో అన్నవి చెప్తున్నారు. దాని తర్వాత బిజెపి కేంద్ర మంత్రులు, ఎంపీలు కూడా ఘోరంగా మాట్లాడారు. పార్టీయే వాటిని నిరసించింది. హిందువులు ఊరుకోవాలా? అంటూ ఆవేశంగా మాట్లాడడం అనవసరం. మత వైషమ్యాలకు నార్త్ ప్రజలు స్పందించినట్లు, సౌత్‌లో స్పందించరు. ఆ కారణాలపై ఓట్లేయరు. ఆంధ్రలో అస్సలు పడవు. మీరు త్వరలో కాన్వాస్ చేయబోతున్న తమిళనాడులో కూడా పడవు, స్పీచులు తిరగ రాయించుకోండి. కర్ణాటకలో మీకు ఛాన్సుంది. అక్కడ కాంట్రాక్టర్లలో కూడా ముస్లిం రిజర్వేషన్ కల్పించాడు అక్కడి ముఖ్యమంత్రి మహాశయుడు. వెళ్లి అది అడ్డుకోండి.

ఆంధ్ర ప్రజలకు కావలసినది ఆర్థికాభివృద్ధి. జీస్టీ వసూళ్లు పడిపోతున్నాయి. టిడిపి ఎమ్మేల్యేలు అవినీతికి, అక్రమాలకు పాల్పడుతున్నారని వారిని సమర్థించే పత్రికలే రాస్తున్నారు. నిజానిజాలు కనుగొని అరికట్టండి. అయినా మీరు యిప్పటిదాకా కాపాడేసిన హిందూ మతమేమిటో మాకు తెలియదు. 2014-19 చంద్రబాబు హయాంలో గుళ్లు పడగొట్టారన్నారు. అప్పుడు మీరేం చేశారు? 2019-24లో అంతర్వేది మాట ఎత్తారు. అది కేంద్రం అజమాయిషీలోని సిబిఐ విచారణలో ఉంది కదా. దాన్ని ముందుకు జరపడానికి చేసిన కృషి ఉంటే చెప్పండి. ఇప్పటిదాకా మీరు భక్తులుగానే ప్రొజెక్టు చేసుకుంటున్నారు. మతరక్షకుడిగా చెప్పుకోవాలంటే ఆ దిశగా ఏం చేశారో చెప్పాలి. పోనీ మత ప్రచారానికి చేసిన దేమిటి? మీ సినిమాల్లో దేశభక్తి పాటలు పెట్టారు కానీ, రామభక్తి పాటలు పెట్టలేదు కదా! ‘‘అత్తారింటికి దారేది?’’లో ‘కాటమరాయుడా’ పాట భక్తిగీతమే అని మీరంటే ఓ దణ్ణం. దానికి మీరు చేసిన అభినయం మాత్రం భక్తిప్రేరేపకంగా లేదు.

ఇక రెండో పాయింటు – తమిళ వాళ్ల హిందీ వాదన గురించి రాస్తాను. అసలీయన బిజెపి తరఫున తమిళనాడులో ప్రచారానికి రాసుకున్న ప్రసంగ భాగాన్ని యిక్కడ చదివేశారు. పిఠాపురం వారికి తమిళ గోల ఎందుకు? తమిళ కవిత్వాలు ఎందుకు? మోళీ వాడిలా అన్ని భాషలెందుకు మాట్లాడడం? అదీ కాగితం చూసి…? అనంతపురం, చిత్తూరు వంటి సరిహద్దు జిల్లాలైతే కన్నడం, తమిళం కాస్తయినా అర్థమౌతాయి. కోస్తా నడుమ ఉన్న గోదావరి జిల్లాలో ఆ ప్రహసనమెందుకు? సుబ్రహ్మణ్య భారతిని కోట్ చేసినప్పుడు ఆయన ‘సింధు నదియిన్..’ పాటను గుర్తు చేసుకోవలసింది. దేశంలో అన్ని భాషల ఔన్నత్యాన్ని, అందరూ కలిసి ఉండవలసిన అగత్యాన్ని చెప్పాడాయన ఆ పాటలో. ఆ పాట అర్థం హిందీ వాళ్లకు చెప్పమనండి. త్రిభాషా సూత్రం హిందీ రాష్ట్రాలలో ఎన్నిటిలో అమల్లో ఉంది? తమిళవాళ్లు హిందీ రుద్దుడు వద్దంటున్నారు తప్ప, హిందీని తమ రాష్ట్రంలో బ్యాన్ చేస్తామనలేదు. ప్రయివేటు స్కూళ్లలో హిందీ చదువుకోనిస్తున్నారు. దక్షిణ భారత హిందీ ప్రచార సభను నడపనిస్తున్నారు. దాని గురించి వివరంగా వేరే చోట రాస్తాను కానీ యీయన ఆ సందర్భంగా చేసిన అవకతవక వ్యాఖ్యల గురించి చెప్పి తీరాలి.

హిందీ పనివాళ్లు కావాలి కానీ వాళ్ల భాష వద్దా అని అడగడమేమిటి? వాళ్లంతట వాళ్లే వచ్చి పడుతున్నారు. పనివాడి దగ్గర పని తీసుకుంటాం, వాడికి డబ్బిస్తాం. మధ్యలో భాష నేర్చుకోవాల్సిన పనేముంది? ఎవడికి అవసరం ఉంటే వాడే నేర్చుకుంటాడు. గతంలో దక్షిణాది వాళ్లు పనుల కోసం హిందీ ప్రాంతాలకు వెళ్లి హిందీ నేర్చుకునేవారు. ఇప్పుడు వాళ్లు యిక్కడకు వస్తున్నారు కానీ స్థానిక భాష నేర్చుకోవటం లేదు. అందుకని తమిళులు వాళ్ల కోసం హిందీ నేర్చుకోవాలా? నేపాల్ గూర్కా వస్తే ఆ భాషా, నార్త్ ఈస్ట్ వాళ్లు వస్తే అసామీస్ గట్రా, చైనా వాళ్లు వస్తే చైనీస్ నేర్చుకోవాలా? లేకపోతే తమిళ సినిమాలు హిందీలోకి డబ్ చేయకూడదా? వాళ్లేమైనా ఊరికే డబ్ చేస్తున్నారా? మీ సినిమా నచ్చితేనే చేస్తారు. ఉన్న ఊళ్లోనే ఉండేవాడు, స్థానిక భాష ఒక్కదాని తోనే జీవితాన్ని లాగించేయవచ్చు.

తమిళవాళ్ల మీద బురద చల్లడానికై నన్ను స్కూల్లో ఎవడో ‘గొల్టి’ అన్నాడన్న ఫిర్యాదొకటి. వేరెవడో తెలుగు కుర్రాడు అరవ కుర్రాణ్ని ‘సాంబార్’ అని ఉండవచ్చు. స్కూల్లో పిల్లలు అనేక నిక్‌నేమ్స్ వాడతారు. అదంతా బాల్యం. అవి పట్టుకుని పబ్లిక్ మీటింగులో, రాజకీయ అంశాలు మాట్లాడుతూ చెప్పవచ్చా? ఇలా ఫిర్యాదు చేసి రేపు ఎన్నికల్లో అక్కడకి వెళ్లి కాన్వాస్ చేస్తాడా? ‘మేం తెలుగు వాళ్లని ఎక్కడైనా అవమానించామా? తెలుగు వాళ్లకు అవకాశాలు లేకుండా చేశామా? ఇక్కడ ఉన్న యిండస్ట్రియలిస్టుల్లో చాలామంది వాళ్లే. వాళ్ల హోటల్స్‌పై, సినిమా హాళ్లపై రాళ్లేశామా అని వారడిగితే? మీ కుటుంబం యిక్కడే ఎదిగింది కదా, అవమానాలు పడ్డారా?’ అని అడిగితే? ఆ మాట కొస్తే సినీనటి, బిజెపి నాయకురాలు కస్తూరి శంకర్‌యే తెలుగువాళ్ల మీద అవాకులు, చెవాకులు వాగి తమిళ వాళ్ల చేత కూడా తిట్లు తింది.

ఇక టిడిపిని నిలబెట్టాం అన్నది టెక్నికల్లీ కరక్టే అయినా పొలిటికల్లీ ఇన్‌కరెక్ట్. ఆ టోన్ బాగా లేదు. ఆ మాట కొస్తే ‘యీయన్ని నిలబెట్టినది మేమే, విడిగా పోటీ చేసి ఉంటే 2019 రిజల్టే వచ్చేది’ అని టిడిపి అనవచ్చు. కూటమి అత్యవసరం అని ఫీలయ్యారు కాబట్టి కాంప్రమైజ్ అయి కలిశారు. అప్పటికే జగన్‌పై వ్యతిరేకత ఉన్నా, వీళ్లు కలవడంతోనే జగన్‌ ఓటమిపై ప్రజలకు నమ్మకం కుదిరి, గాలి యిటు మళ్లింది. గెలుపు ప్రభంజనంగా మారింది. కావాలంటే టిడిపి యీ రోజు జనసేనతో పొత్తు తెంపుకుని కూడా అధికారంలో కొనసాగ గలదు. అయినా ప్రభుత్వంలో పదవులిచ్చి, మర్యాద యిచ్చి గడుపుకుని వస్తున్నారు. విజయపథంలో వెళ్లే కారుకి నాలుగు చక్రాలు అవసరమైనప్పుడు టిడిపి మూడు చక్రాలతోనూ నడవదు. జనసేన ఒక చక్రంతోనూ నడవదు. బిజెపి స్టీరింగు లేకా నడవదు. అన్నీ కలిశాయి కాబట్టే జగన్‌ను నేల కేసి తొక్కేసి భూస్థాపితం చేయగలిగారు. ఈరోజు ఆ ఒక చక్రం ఆ మూడు చక్రాలను నిలబెట్టాను అని బహిరంగంగా చెప్పుకోవడం మర్యాద కాదు.

ఈ చెప్పుకోవడంలో పిఠాపురం ఫ్యాక్టర్ కూడా వచ్చింది. పిఠాపురంలో గెలుపు జనసేనదే, వేరెవ్వరికీ పాత్ర లేదు అంటూ వర్మ పేరుపై పన్ చేస్తూ నాగబాబు మాట్లాడితే, పవన్ దానికి కరక్షన్ ప్రతిపాదించి ఉండాల్సింది. అక్కడ తమది సోలో గెలుపని జనసేన క్లెయిమ్ చేస్తే, మరి టిడిపి గెలిచిన తక్కిన చోట్ల వాళ్లూ అలాగే క్లెయిమ్ చేయవచ్చుగా! అసలు జనసేనకి నూరు శాతం స్ట్రయిక్ రేట్ ఎలా వచ్చింది? వారి అభ్యర్థుల్లో అధికాంశం టిడిపి వారు కాదూ! ఆఖరి నిమిషంలో వచ్చి చేరిన మండలి బుద్ధ ప్రసాద్ ఏ పార్టీ వారు? ఎన్నికల స్ట్రాటజీ, నిధుల పంపిణీ, అభ్యర్థుల ఎంపిక, మీడియా మద్దతు యివన్నీ చంద్రబాబు సమకూర్చినవి కావూ? ఏడాది తిరక్కుండానే యివన్నీ మర్చిపోయి, ‘మేం 40 ఏళ్ల టిడిపిని నిలబెట్టాం’ అంటూ మాట్లాడి వాళ్లని రెచ్చగొట్టడం దేనికి?

2019 ఎన్నికలకు ఏడాదికి ముందే అప్పట్లో టిడిపిపై ఆక్రోశంతో ఉన్న పవన్‌కు జగన్‌కు మధ్య సయోధ్య కుదురుద్దామని కొన్ని ప్రయత్నాలు జరిగాయనే టాక్ బలంగా ఉంది. ‘వద్దు, పొత్తు గెలిస్తే ఆ క్రెడిట్ అంతా ఆయనే తీసుకుంటాడు’ అంటూ జగన్ ఆ ప్రతిపాదనను తిరస్కరించాడట. ఇప్పుడు పవన్ తాజా వ్యాఖ్య చూస్తే ఆనాటి జగన్ అంచనా కరక్టే అనిపిస్తుంది, ఆ కథనం నిజమైతే! పవన్ తాజా వ్యాఖ్యపై టిడిపి సోషల్ మీడియా విరుచుకు పడుతోంది కానీ నాయకులు సహనం వహిస్తున్నారు. లోకేశ్ ఉప ముఖ్యమంత్రి అని దావోస్‌లో ప్రచారం జరిగినప్పుడు టిడిపి ప్రముఖ నాయకులు ఖండించ లేదు కాబట్టే పవన్ యీ రోజు యిలా అన్నారని కొందరి ఊహ.

ఇలా అంటూనే టిడిపితో 15 ఏళ్లు కలిసి ఉంటాం అన్నారు పవన్. అది టిడిపిని మెప్పించడానికి అయి వుండవచ్చు కానీ ఓ రకంగా జనసైనికులను నిరాశ పరచడమే. ఎందుకంటే టిడిపితో కలిసున్నంత కాలం జనసేన మైనర్ పార్ట్‌నరే. బాబు యాక్టివ్‌గా ఉన్నంత కాలం, బండి యిలాగే నడుస్తుందనుకుందాం. 15 ఏళ్ల వ్యవధి అంటే బాబుకి 90 ఏళ్లు. అప్పటి వరకూ ఆయన యాక్టివ్‌గా ఉంటారని అనుకోవడం అత్యాశ. అదృష్టవశాత్తూ యాక్టివ్‌ గానే ఉన్నా యంగ్ మాన్ యిన్ హర్రీ లోకేశ్ అప్పటిదాకా ఓపిక పడతారా అనేది మరో ప్రశ్న. ఈ మధ్యలో ఆయన ఆధ్వర్యంలోకి పార్టీ వెళితే మాత్రం పవన్ మైనర్ పార్ట్‌నర్‌గా ఉంటారనుకోవడం నమ్మబుద్ధిగా లేదు. కానీ అలా ఉంటానని చెప్పడం ద్వారా మనకు ఛాన్సు లేదని జనసేన నాయకులు ఫీలవుతారు. ఇప్పటికే పదవులు దక్కటం లేదనే బాధ ఉంది. ఐదేళ్లంటే ఓర్చుకుంటారు కానీ బొత్తిగా 15 ఏళ్లా? బాబోయ్ అనుకోరూ?

జనసేన టిడిపితో పోల్చదగిన పార్టీగా అవతరించాలంటే అది వైసిపిని పూర్తిగా కబళించి వేయాలి. దాని వెంట ఉన్న సామాజిక వర్గాలు, కులాలు పవన్ వెంట నడవాలి. పేదల గురించి పవన్ తరచుగా మాట్లాడుతూంటారు కాబట్టి అల్పాదాయ వర్గాలు యిటువైపు వచ్చినా ప్రస్తుత సనాతన ధర్మావతారంలో ఉండగా మైనారిటీలు, వారితో పాటు ఎస్సీ, ఎస్టీలు మళ్లడం కష్టం. ఇక బలంగా ఉన్న రెడ్డి వర్గం వస్తుందా అన్నదే చూడాలి. పవన్ యిప్పటిదాకా వారిని కల్టివేట్ చేసుకున్న సందర్భం నాకు గుర్తు లేదు. ఇప్పుడేదైనా స్ట్రాటజీ మారుస్తారేమో! – ఎమ్బీయస్ ప్రసాద్ (మార్చి 2025)బాబు మాట్లాడితే, పవన్ దానికి కరక్షన్ ప్రతిపాదించి ఉండాల్సింది. అక్కడ తమది సోలో గెలుపని జనసేన క్లెయిమ్ చేస్తే, మరి టిడిపి గెలిచిన తక్కిన చోట్ల వాళ్లూ అలాగే క్లెయిమ్ చేయవచ్చుగా! అసలు జనసేనకి నూరు శాతం స్ట్రయిక్ రేట్ ఎలా వచ్చింది? వారి అభ్యర్థుల్లో అధికాంశం టిడిపి వారు కాదూ! ఆఖరి నిమిషంలో వచ్చి చేరిన మండలి బుద్ధ ప్రసాద్ ఏ పార్టీ వారు? ఎన్నికల స్ట్రాటజీ, నిధుల పంపిణీ, అభ్యర్థుల ఎంపిక, మీడియా మద్దతు యివన్నీ చంద్రబాబు సమకూర్చినవి కావూ? ఏడాది తిరక్కుండానే యివన్నీ మర్చిపోయి, ‘మేం 40 ఏళ్ల టిడిపిని నిలబెట్టాం’ అంటూ మాట్లాడి వాళ్లని రెచ్చగొట్టడం దేనికి?

2019 ఎన్నికలకు ఏడాదికి ముందే అప్పట్లో టిడిపిపై ఆక్రోశంతో ఉన్న పవన్‌కు జగన్‌కు మధ్య సయోధ్య కుదురుద్దామని కొన్ని ప్రయత్నాలు జరిగాయనే టాక్ బలంగా ఉంది. ‘వద్దు, పొత్తు గెలిస్తే ఆ క్రెడిట్ అంతా ఆయనే తీసుకుంటాడు’ అంటూ జగన్ ఆ ప్రతిపాదనను తిరస్కరించాడట. ఇప్పుడు పవన్ తాజా వ్యాఖ్య చూస్తే ఆనాటి జగన్ అంచనా కరక్టే అనిపిస్తుంది, ఆ కథనం నిజమైతే! పవన్ తాజా వ్యాఖ్యపై టిడిపి సోషల్ మీడియా విరుచుకు పడుతోంది కానీ నాయకులు సహనం వహిస్తున్నారు. లోకేశ్ ఉప ముఖ్యమంత్రి అని దావోస్‌లో ప్రచారం జరిగినప్పుడు టిడిపి ప్రముఖ నాయకులు ఖండించ లేదు కాబట్టే పవన్ యీ రోజు యిలా అన్నారని కొందరి ఊహ.

ఇలా అంటూనే టిడిపితో 15 ఏళ్లు కలిసి ఉంటాం అన్నారు పవన్. అది టిడిపిని మెప్పించడానికి అయి వుండవచ్చు కానీ ఓ రకంగా జనసైనికులను నిరాశ పరచడమే. ఎందుకంటే టిడిపితో కలిసున్నంత కాలం జనసేన మైనర్ పార్ట్‌నరే. బాబు యాక్టివ్‌గా ఉన్నంత కాలం, బండి యిలాగే నడుస్తుందనుకుందాం. 15 ఏళ్ల వ్యవధి అంటే బాబుకి 90 ఏళ్లు. అప్పటి వరకూ ఆయన యాక్టివ్‌గా ఉంటారని అనుకోవడం అత్యాశ. అదృష్టవశాత్తూ యాక్టివ్‌ గానే ఉన్నా యంగ్ మాన్ యిన్ హర్రీ లోకేశ్ అప్పటిదాకా ఓపిక పడతారా అనేది మరో ప్రశ్న. ఈ మధ్యలో ఆయన ఆధ్వర్యంలోకి పార్టీ వెళితే మాత్రం పవన్ మైనర్ పార్ట్‌నర్‌గా ఉంటారనుకోవడం నమ్మబుద్ధిగా లేదు. కానీ అలా ఉంటానని చెప్పడం ద్వారా మనకు ఛాన్సు లేదని జనసేన నాయకులు ఫీలవుతారు. ఇప్పటికే పదవులు దక్కటం లేదనే బాధ ఉంది. ఐదేళ్లంటే ఓర్చుకుంటారు కానీ బొత్తిగా 15 ఏళ్లా? బాబోయ్ అనుకోరూ?

జనసేన టిడిపితో పోల్చదగిన పార్టీగా అవతరించాలంటే అది వైసిపిని పూర్తిగా కబళించి వేయాలి. దాని వెంట ఉన్న సామాజిక వర్గాలు, కులాలు పవన్ వెంట నడవాలి. పేదల గురించి పవన్ తరచుగా మాట్లాడుతూంటారు కాబట్టి అల్పాదాయ వర్గాలు యిటువైపు వచ్చినా ప్రస్తుత సనాతన ధర్మావతారంలో ఉండగా మైనారిటీలు, వారితో పాటు ఎస్సీ, ఎస్టీలు మళ్లడం కష్టం. ఇక బలంగా ఉన్న రెడ్డి వర్గం వస్తుందా అన్నదే చూడాలి. పవన్ యిప్పటిదాకా వారిని కల్టివేట్ చేసుకున్న సందర్భం నాకు గుర్తు లేదు. ఇప్పుడేదైనా స్ట్రాటజీ మారుస్తారేమో!

– ఎమ్బీయస్ ప్రసాద్

63 Replies to “ఎమ్బీయస్‍: జయకే‘తన’ సభ”

  1. సభ జరిగి ఇది ఆరవ రోజు… అయినా అక్కడే ఉన్నారు…. కూటమి వల్ల జనసేన క్యాడర్ , తెలుగు దేశం క్యాడర్ అసహనం తో ఉన్నారు అని చెప్పవద్దు….డొంక తిరుగుడు లేకుండా బెంగుళూరు పాలస్ లో వాడు, వాడి సైన్యం బాధ పడుతున్నారు అని చెప్పేయండి…. పవన్-లోకేష్ ఈ అన్న తమ్ములిద్దరు జెగ్గుని అధః పాతాళానికి తొక్కేవరకు కలిసే ఉంటారు….. విడిపోవడం చూడాలి అని ఆతృత పడుతున్నట్లున్నారు…. అంటే వాడి రాజకీయ అంతం చూడాలి అని వైకాపా వాళ్ళే ఎక్కువ ఉబలాట పడుతున్నారు….

  2. రైటర్ గారు పవన్ బాబు కలిసి ఉన్నారని బాధ పాలస్ లో ఏడుస్తున్న జగన్ కన్నా మీకే ఎక్కువగా ఉన్నట్టు ఉంది …మీకు కూడా ENO అవసరం undi anukunta..

    1. మీ అపార మేధస్సుతో ..

      హిహిహి…

      చాలా ఎక్కువ ఆశలు పెట్టుకున్నావ్ అన్నాయ్..

  3. ప్రసాదం గారు..

    జగన్ రెడ్డి పాలన లో 50 మంది సలహాదారులు ఉండేవాళ్ళు.. చంద్రబాబు ఈ రోజు నలుగురు సలహాదారులను నియమించుకున్నాడు..

    ఆ రెండూ కంపేర్ చేస్తూ.. మీ అపార మేధస్సుతో ఒక ఆర్టికల్ రాయండి..

    అది నేను చదవాలనుకొంటున్నాను..

    1. మీ అపార మేధస్సుతో .. హిహిహి…

      చాలా ఎక్కువ ఆశలు పెట్టుకున్నావ్ అన్నాయ్..

    2. ఇలాటి వాటికీ ఆయన దగ్గర ఉందే స్టాండర్డ్ ఆన్సర్ “నేనేం రాయాలో నాకు చెప్పొద్దూ”

  4. CORRECTION : Unlike the old NATIONAL EDUCATION POLICY, where Hindi was made mandatory under 3 language formula in Congress regime, the new NEP gives option to study MOTHER TONGUE + ENGLISH + ANY OTHER LANGUAGE. The third language can be any other Indian language. This will benefit linguistic minorities in the States who want to learn their mother tongue also apart from the State’s language. For example, Telugu people in Tamilnadu can study Telugu also, apart from Tamil & English.

      1. Hindi and English are the official languages of India.

        An official language refers to the language used in government (judiciary, administrative, legislative). It does not mean that it is the only language spoken in a country.

      2. I have a straight question. Which south state opted other south language as third language? answer is none….. south are not interested on our fellow south indians and we are questioning north for not showing interest on us…..Hindi constitutes more than 50% of indian population…. south languages Telugu & tamil constitutes 6% approx, kannada 4%, oriya & malayalam 3%…. If tamilians learn Hindi, they can communicate with 50% of other indians who are not tamils…. but if UP student takes tamil he can only have 6% people advantage…. Moreover for the school to implement they need majority of students to opt same language as third language…. North indian schools cannot zero down on any single south language, so it is practically difficult to implement…. But for south indians majority might choose Hindi as it is highest spoken language…..

        1. I have a direct question. Which North state opted other North language as third language? Answer is absolute ZERO ….North are not interested on our fellow north indians and we are questioning south for not showing interest on dirty language hindi…..? Hindi is Introduced by muslims invaders

          Modern standard Hindi evolved from the interaction of early speakers of Khari Boli with Muslim invaders from Afghanistan, Iran, Turkey, Central Asia, and elsewhere. As the new immigrants settled and began to adjust to the Indian social environment, their languages—which were ultimately lost

          Actual north original languages are bhojpuri, Maithili, Santhali and utlimately Sanskrit not muslims invaders introduced hindi , you have to know the history before learning anything

        2. I have a direct question. Which North state opted other North language as third language? Answer is absolute ZERO ….North are not interested on our fellow north indians and we are questioning south for not showing interest on dirt language hindi…..? Hindi is Introduced by muslims invaders

          Modern standard Hindi evolved from the interaction of early speakers of Khari Boli with Muslim invaders from Afghanistan, Iran, Turkey, Central Asia, and elsewhere. As the new immigrants settled and began to adjust to the Indian social environment, their languages—which were ultimately lost

          Actual north original languages are bhojpuri, Maithili, Santhali and utlimately Sanskrit not muslims invaders introduced hindi , you have to know the history before learning anything

  5. కాలం మారుతుంది….అన్ని అవుతాయి…..ఆఖరికి మీరు Bible చూపించి black mail చేసే మీ vote bank కూడా మారుతుంది….just matter of time….అంతే….మన సొంత మతాన్ని చులకన చేసుకోవడం తప్పు అని చెప్పాడు…అన్ని మతాలను గౌరవం గా చూడాలని చెప్పాడు…NEP 2020 form చేయడానికి key suggestions ఇచ్చాడు….ఇప్పుడు హిందీ ని బలవంతంగా రుద్ద దానికి chance లేదని, పిల్లలు నచ్చిన languages చదువుకొవచ్చు అని అర్దం అయ్యేలా చెప్పి, మీ వాళ్ల వుత్త డ్రామా లను expose చేశాడు….జనానికి అన్ని చక్కగా అర్దం అవుతాయి….final గా….pawan kalyan integrity ని question చేయడం, చులకన చేయడం వల్ల మీకు నష్టం తప్ప లాభం లేదు…..అంతే

  6. అన్నీ అవుతాయి…ye vote bank చూసుకుని మీరు ఇలా విచ్చలవిడిగా ప్రవర్తిస్తున్నారో వాళ్ళు కూడా మారుతారు …just matter of time అంతే ….pawan kalyan integrity ను చులకన చేయాలని చూడడం వల్ల మీకు నష్టం తప్ప లాభం లేదు….మన మతాన్ని చులకన చేసుకోవడం ఆపాలని చెప్పినా, ఇతర మతాలను గౌరవం గా చూడాలని చెప్పినా, NEP 2020 వచ్చాక LANGUAGE subjects select చేసుకునే option students కి వుంటుంది అని చెప్పినా….జనానికి అన్ని అర్దం అవుతాయి….ఒక నిర్దిష్ట మైన ఆలోచన, ముందు చూపు వున్న నాయకుడు pawan kalyan గారు….ఇంకా ఆయన, అన్ని languages లో మాట్లాడటం చూసి మీరు బాధ పడవద్దు….అంతే…

  7. అన్ని అవుతాయి…ఆఖరికి మీరు నమ్ముకున్న కుల, మతాల వాళ్ళు కూడా మారుతారు…just matter of time…అంతే…pawan kalyan గారు మన సొంత మతాన్ని చులకన చేసుకోవడం తప్పు అని చెప్పాడు…అన్ని మతాలను గౌరవం గా చూడాలని చెప్పాడు…NEP 2020 form చేయడానికి key suggestions ఇచ్చాడు….ఇప్పుడు హిందీ ని బలవంతంగా రుద్ద దానికి chance లేదని, పిల్లలు నచ్చిన languages చదువుకొవచ్చు అని అర్దం అయ్యేలా చెప్పి, మీ వాళ్ల వుత్త డ్రామా లను expose చేశాడు….జనానికి అన్ని చక్కగా అర్దం అవుతాయి….final గా….pawan kalyan integrity ని question చేయడం, చులకన చేయడం వల్ల మీకు నష్టం తప్ప లాభం లేదు…..అంతే

  8. pawan party sabha..pawan istam…nee com men ts anava saram..

    Gud da musu ku kurcho…prati di nee ke telu su an nattu raa stav…men tal lan ja kodaka…sy. co ga di m e eda ra suko…

  9. Modern standard Hindi evolved from the interaction of early speakers of Khari Boli with Muslim invaders from Afghanistan, Iran, Turkey, Central Asia, and elsewhere. As the new immigrants settled and began to adjust to the Indian social environment, their languages—which were ultimately lost

    Actual north original languages are bhojpuri, Maithili, Santhali and utlimately Sanskrit , Muslims invaders introduced hindi

    1. నిజమే, పర్శియన్ అరబిక్ సంకరసంతానం ఉర్దూ నుండి హిందీ పుట్టింది.

      బియ్యం పండని, మసాలా దినుసుల అడ్రెస్ తెలియని ఎడారి అనాగరికులు మనకు బిర్యానీ నేర్పారు.

      గట్టిగా 400 ఏళ్ళ సాహిత్యం లేని కౄరుల నుండి భారతీయ లలితకళలూ సాహిత్యమూ విలసిల్లింది.

      ఈ రోజుకూ చెప్పుకోదగ్గ శిల్పకళ అడ్రెస్ లేని సంచారజాతుల నుండి తాజ్ మహల్, కుతుబ్ మినార్ లాంటి ఎన్నో అద్భుతనిర్మాణాలు భారత్ పొందింది.

    2. నిజమే, పర్శియన్ అరబిక్ సంకరసంతానం ఉర్దూ నుండి హిందీ పుట్టింది.

      బియ్యం పండని, మసాలా దినుసుల అడ్రెస్ తెలియని ఎడారి అనాగరికులు మనకు బిర్యానీ నేర్పారు.

      1. గట్టిగా 400 ఏళ్ళ సాహిత్యం లేని కౄరుల నుండి భారతీయ లలితకళలూ సాహిత్యమూ విలసిల్లింది.

      2. గట్టిగా 400 ఏళ్ళ సాహిత్యం లేని ఆటవికుల నుండి భారతీయ లలితకళలూ సాహిత్యమూ విలసిల్లింది.

      3. ఈ రోజుకూ చెప్పుకోదగ్గ శిల్పకళ అడ్రెస్ లేని సంచారజాతుల నుండి తాజ్ మహల్, కుతుబ్ మినార్ లాంటి ఎన్నో అద్భుతనిర్మాణాలు భారత్ పొందింది.

      4. ఈ రోజుకూ చెప్పుకోదగ్గ శిల్పకళ అడ్రెస్ లేని సంచారజాతుల నుండి Taj Mahal Qutub Minar లాంటి ఎన్నో అద్భుతనిర్మాణాలు భారత్ పొందింది.

      5. Indian literature and music flourished because of the barbarians of the deserts

        India got Taj Mahal and Qutub Minar like great structures from the uneducated barbarian tribals

  10. All north states are following 3 language policy: Problem with tamilians and anti-pawan soldiers is that they consider that Hindi and regional languages of North as one & the same, which is not true….Most of the North states opted for Sanskrit/urdu as third language…. Delhi has also punjabi as third language, In maharashtra Marathi is first, English is second and Hindi is third….UP also have bhojpuri, English & Hindi .. …. Bihari in Bihar, Guajarati in Gujarat, Konkani in Goa, Urdu in Kashmir, punbjabi in punjab etc…. local languages are first, followed by English & Hindi as 3rd language….it is indeed 3 language policy everywhere

  11. పెజీలు నింపితె కాని ఆర్టికల్ అవ్వదూ అనుకున్నారెమొ! విషయం లెదు, పెరాలు పెరాలు రాసారు!

  12. 2014-19లో బాబు రోడ్డు విస్తరణలలో భాగంగా కొన్ని ప్రార్ధనా మందిరాలని బహిరంగానే తొలగించాడు. Those were administrative decisions. మరి 2019-24 మధ్య జరిగిన రధం తగలపెట్డడం, రాముడి విగ్రహ ధ్వంసం, హనుమంతుడి విగ్రహం ధ్వంసం మరి ఇవి కూడా administrative చర్యలేనా?!

  13. అయ్యా ప్రసాద్ గారు కళ్యాణ్ గారు ఆలోచనలు మేధాశక్తి ఉపన్యాసాలు గత ౨౦ ఏళ్ళు గ అలాగే ఉన్నాయి. కళ్ళు మిటకరిస్తూ అబద్దలు బడాయి మాటలు గొప్పలు చెప్పుతాడు. కేవలం ప్రజలు కులానికి ఎమోషనల్ ఫూల్స్ అవ్వడం వల్లనే ఈయన గారు గెలిచారు. కాశినాయన అన్న సత్రం కూల్చారు అంటే తప్పకుండ శిక్షించపడతారు. హిందుత్వం అంటే కాషాయ బట్టలు వేసుకోవడం కాదు.

  14. రచయత గారు, మీరు ఎక్కడ వుంటారు hyd లోన, ఆంధ్ర లోన? మీకు ఓటు ఎక్కడ వుంది? మీకు ఆంధ్ర లో ఉంటే ఒకే. లేదంటే, నువ్వు మా రాజకీయాల గురించి రాయడం మానెయ్. నువ్వు నీ చెక్క భజన.

  15. ప్రభుత్వం మారి పోయింది కానీ ఈ రచయత పార్టీ ఇంకా మారలేదు .. పోసాని గాడి ఫాన్ అయిఉంటాడు.

  16. జనసేన ఆవిర్భావ సభ తర్వాత పదేళ్లకు జరిగిని విజయకేతన సభ లో పవన్ తన రాజ్య కాంక్ష ను తెలియపర్చాడు. చాలామందికి మీతో సహా ఇదేదో అనవసర ప్రస్తావన అనిపించేలా వుంది. కానీ పవన్ ఉపన్యాసం లో, తన తెలంగాణ నివాసం, గద్దర్ తో సాన్నిహిత్యం, తెలంగాణ నుంచి వచ్చిన జన సైనికులు ఇత్యాది విషయాలు వ్యక్తపరచడం మూలముగా భవిష్యత్తు లో తెలంగాణ ఎన్నికల సమరం లో నిలబడతానని వ్యక్తీకరించడమే.

    అలానే తమిళనాడు బాషా వ్యతిరేకత మీద, మహారాష్ట్ర నుంచి వచ్చిన పవన్ అభిమానులు, అలానే కర్ణాటక, కేరళ నుంచి వచ్చిన తన అభిమానులను ఉద్దేశించి చేసిన ఉపన్యాసం, భవిష్యత్తు లో తాను బీజేపీ తరుపున చేయబోయే విస్తృత రాజకీయాలు తాను పోషించబోయే పెద్ద పాత్ర గురించి.

    సగటు ప్రజలకు ఇవి అర్ధం కాకపోవడం లో పెద్ద విషయం లేదు, కాని జర్నిలిస్ట్స్, మీతో సహా పవన్ పంధా ని పసిగట్టలేకపోవడం ఒక రకంగా నిరుత్సాహమే.

    1. సినిమా వ్యాపారాల కోసం తెలంగాణ అన్నాడు , సగటు ప్రజలకి అర్ధం కాకుండా వాడిచ్చే ఊకదంపుడు ముతక ఉపన్యాసాలు ఎవడికి కావాలి ?

  17. Pavan em cheyyalo em cheyyakudado nuv cheppav sare… mari nuvvem cheyyalo nenu cheppana..

    Pavan shoe polish chey. Vache janmalo ina… koncham buddi . .. gnanam istadu devudu

  18. Mee salahalatho already annaya ni santham nakinchesaru…

    Adagakunda ichhe salahalau…

    Dabbukosam raase articles.

    Prajala sammati leni anaysis

    Visham tho rase rathalu…

    Okka page pogidi…. santham tiduthu… mee alochanalani….abhiprayalani… tarkam leni siddanthalani.. janam meeda ruddatam…

    Journalism kaadu…. paid articles

  19. ఎంత సేపు పవన్ గారు, బాబు గారు ఇంకా లేకపోతే మోడీ గారు ఏమన్నారో అని పేజీల కొద్దీ రాయడమేనా, మన జగనన్నయ్య స్పీచ్ లకి కూడ ఇదే విధంగా ఒక శీర్షిక వ్రాయమని మనవి. అప్పుడు కొన్ని పేరాలు రాయడానికి సరిపడా విషయం కూడా ఉండదేమో!!!

  20. పవన్ విప్లవవీరుడి అవతారం చాలించి సనాతన ధర్మ పరిరక్షకుడి వేషం కట్టడం నాకూ నచ్చలేదు అతని ఉపన్యాసాల్లో కన్సిస్టెన్సీ, పరిపక్వత ఉండవు. కానీ ఆయన ఎంత అవకతవకగా మాట్లాడినా ఇంతగా చీల్చి చెండాడాలా? ఎవరో ఒక నాయకుడి అందానికి అసూయపడి అ.. రె.. స్టు..లు చేయించారన్న వెకిలి మాటలతో పోలిస్తే ఈ ఉపన్యాసం పెద్ద తప్పు కాదు.

Comments are closed.