ప్రతి నెల పదుల సంఖ్యలో సినిమాలొస్తున్నాయి. అందులో కొన్ని సినిమాలకు సూపర్ హిట్ అంటూ పోస్టర్లు కూడా వేసుకుంటున్నారు. మరికొన్ని సినిమాలకు బ్రేక్ ఈవెన్ అయినట్టు కూడా చెప్పుకుంటున్నారు. అలాంటిదేం లేదని లెక్కలతో సహా బయటపెడితే మాత్రం కొందరికి కోపాలొచ్చేస్తున్నాయి.
ఇలాంటి వాళ్లంతా ఈరోజు దిల్ రాజు ఇచ్చిన స్టేట్ మెంట్ ను కాస్త శ్రద్ధగా వినాలి. ఏప్రిల్ నెలలో సరైన సినిమా లేదని స్వయంగా దిల్ రాజు ఒప్పుకున్న పరిస్థితి.
“ఏప్రిల్ అంతా ఒకటే టెన్షన్. సినిమాలు వస్తున్నాయి కానీ జనాలు థియేటర్లకు రావట్లేదు. సమ్మర్ అంతా అయిపోతోందని అనుకున్నాను. ఏప్రిల్ లో సినిమాల్లేక ఏపీ-నైజాంలో కొన్ని స్క్రీన్స్ కూడా క్లోజ్ చేశారు.”
ఏప్రిల్ లో టాలీవుడ్ పరిస్థితి ఇది. స్వయంగా దిల్ రాజు లాంటి పెద్ద మనిషి ఇచ్చిన స్టేట్ మెంట్ ఇది. తమ సినిమా ఆడలేదని ఎందుకు కొంతమంది అంగీకరించలేకపోతున్నారు. ఓవైపు ఇండస్ట్రీ కుదేలు అవుతుంటే, వీళ్లకి ఎందుకింత ఇగో.
పోనీ ప్రారంభంలో ప్రచారం కోసం, ప్రేక్షకుల్ని ఆకర్షించడం కోసం పోస్టర్లు వేశారనుకుందాం. ఆ తర్వాతైనా భ్రమల నుంచి బయటకురావాలి కదా. వాస్తవాన్ని అంగీకరించాలి కదా. ఇకనైనా కొంతమంది నిర్మాతలు, హీరోలు వాస్తవంలోకి వస్తే మంచిది.
mari anni cinemaalu sankranti lanti pandagalake release cheste, migita nelallo eegalu tolukovali
యాత్ర 11 తీసి ఓ PAW ( presence ALL OVER THE WORLD) మూవీ చేయొచ్చుగా
నీ ఏడుప అంతా నాగావంశీ(mad square) మీద అని అర్ధం అయింది. .. ఆ మూవీ మార్చి లో వచ్చింది ఏప్రిల్ లో కాదు…..
peda nirmathalanu yevaru kapadatharu?
ye peda-vadu cinimalu nirminchodda?
YSR cinema pathakam vunte bagundedi !!!!