టాలీవుడ్ లోకి డబ్బులు వస్తాయా?

హిట్ 3 వల్ల కాస్త ఉపశమనం తప్పిస్తే మరీ అద్భుతాలు జరగవు.

జనవరి నుంచి ఫిబ్రవరి థియేటర్ల వ్యవస్థ హ్యాపీగానే వుంది. మార్చి, ఏప్రిల్ ఏమంత బాగాలేదు. మే స్టార్టింగ్ లోనే డే వన్ ఫుల్స్ తో హిట్ 3 సినిమా వచ్చింది. డే వన్ మంచి ఫలితాలు నమోదు చేసింది. అలా నమోదు చేస్తుందని దాదాపు నాలుగు వారాల ముందు నుంచే థియేటర్ల యజమానులు నమ్ముతూ వచ్చారు. అదే జరిగింది. తొలి రోజు విపరీతంగా షో లు పెట్టినా కూడా అర్బన్ ఏరియాల్లో దాదాపు ఫుల్స్ వచ్చాయి. రూరల్ ఏరియాల్లో కూడా దాదాపుగా మంచి కలెక్షన్స్ నమోదు అయ్యాయి.

ఇండస్ట్రీ పెద్ద దిల్ రాజు ఉబ్బి తబ్బిబ్బయిపోయారు. సినిమా ఇండస్ట్రీని బతికించిన సినిమా అన్న రేంజ్ లో కితాబు ఇచ్చారు. థియేటర్ లకు జనాలు రాకపోతే ఎంత పెద్ద సమస్య అన్నది ఈ మాటలతోనే అర్థం అవుతోంది. అసలు సమస్య ఏమిటంటే డిస్ట్రిబ్యూటర్లు వ్యాపారం చేసేది ఎక్కువగా ఎగ్జిబిటర్ల మీద ఆధారపడే.

సినిమా కొంటున్నట్లు అగ్రిమెంట్ చేసుకునేటపుడు ఓ పది శాతం మొత్తం తమ స్వంత డబ్బు నిర్మాతకు అడ్వాన్స్ గా పంపుతారు. విడుదల టైమ్ లో ఎగ్జిబిటర్ల దగ్గర నుంచి మాగ్జిమమ్ అడ్వాన్స్ లు లాగి, నిర్మాతకు కడతారు. థియేటర్ సరిగ్గా రన్ కావాలంటే మంచి సినిమాలు పడాలి కనుక అడ్వాన్స్ లు ఇస్తారు ఎగ్జిబిటర్లు. ఇదీ ప్రాసెస్.

గత రెండు నెలలుగా ఎగ్జిబిటర్ల డబ్బులు ఇండస్ట్రీలోకి వెళ్తున్నాయి తప్ప, జనాల డబ్బులు థియేటర్ లోకి రావడం లేదు. రెండు నెలల కాలంలో వచ్చిన చాలా సినిమాలు ఎగ్జిబిటర్ల డబ్బులను బయ్యర్ల దగ్గర బ్లాక్ అయిపోయేలా చేసాయి. బయ్యర్లు నష్టపోయారు. లేదా వారి డబ్బులు నిర్మాతల దగ్గర బ్లాక్ అయిపోయాయి.

ఇలాంటి నేపథ్యంలో హిట్ సినిమాతో సమ్మర్ మిడ్ సీజన్ స్టార్ట్ అయింది. హిట్ 3, కింగ్ డమ్ లాంటి పెద్ద సినిమాలు, సింగిల్, శుభం లాంటి చిన్న సినిమాలు రాబోతున్నాయి. ఇంకా మరి కొన్ని చిన్న సినిమాలు రావచ్చు. కానీ థియేటర్లకు ఫీడింగ్ ఇచ్చేంత పెద్ద సినిమాలు లేవు. హరి హర వీరమల్లు సినిమా మే 30 అంటున్నారు. కింగ్ డమ్ మే 30 అంటున్నారు. ఇప్పుడు ఒకటి తప్పుకుంటుంది. కానీ మే మధ్యలోకి ఒక సినిమా వస్తే అది వేరుగా వుంటుంది.

హిట్ 3 ఎంత పెద్ద హిట్ అయినా థియేటర్ల ఆకలిని రెండు వారాలు మించి తీర్చలేదు. మే మిడ్ లో మరో పెద్ద సినిమా వస్తే అది వేరుగా వుంటుంది. కానీ ఇప్పుడు ఏమవుతుంది. హిట్ 3 మీద వచ్చిన డబ్బులు బయ్యర్లకు రావు. ఎందుకంటే అంతకన్నా ముందుగా చాలా సినిమాలకు ఎగ్జిబిటర్లు డబ్బులు ఇచ్చి వుంటారు కనుక. అందువల్ల మే నెల అంతా వచ్చే చిన్న సినిమాలకు కష్టం అవుతుంది. చివర్లో వచ్చే కింగ్ డమ్ కు ఫరవాలేదు.

అందువల్ల హిట్ 3 వల్ల కాస్త ఉపశమనం తప్పిస్తే మరీ అద్భుతాలు జరగవు. అద్భుతాలు జరగాలి అంటే మన పాపులర్ హీరోలు అంతా ఏడాదికి రెండు సినిమాలు చేసి తీరాలి. ఫ్లాపు హీరోల నుంచి ఏడాదికి రెండు వస్తున్నాయి. పాపులర్ హీరోల నుంచి రావడం లేదు. అదే అసలు సమస్య.

6 Replies to “టాలీవుడ్ లోకి డబ్బులు వస్తాయా?”

  1. Many people are saying if big heros do 2 films each in an year, it will solve the problem. That is not true. Each big hero cannot do two big event films in an year with good quality. And, audience will not spend money on 10-12 event films in a year having OTT as a viewing option. Event films take lot of time to make and if they are made fast, quality will be missed. Issue is the lack of content quality in the mid range and small films

  2. Where are buyers and exhibitors??

    allu Aravind gaadu 50% raayichukunnadu..prp ammesi..migataavi chinna chithaka toka party chethloki vellipoyaayi..

    nepotism/casteisam tho Tollywood lo creativity kuda padi poyindi..

  3. విశ్వంబర వచ్చి శతాబ్దం వరల్డ్ రికార్డు షేక్ చేస్తుంది చూడు

Comments are closed.