ఎట్ట‌కేల‌కు విచార‌ణ‌కు బిగ్‌బాస్ సెల‌బ్రిటీ

హెచ్చ‌రిక‌తో , ఇక‌పై ప్ర‌చారం చేయ‌మ‌నే హామీతో విడిచి పెడ‌తారా?

బెట్టింగ్ యాప్స్‌పై ప్ర‌మోష‌న్ చేశారనే కార‌ణంతో కేసు ఎదుర్కొంటున్న ప్ర‌ముఖ యాంక‌ర్‌, బిగ్‌బాస్ సెల‌బ్రిటీ విష్ణుప్రియ ఎట్ట‌కేల‌కు విచార‌ణ‌కు హాజ‌ర‌య్యారు. న్యాయ‌వాదితో క‌లిసి ఆమె విచార‌ణ‌కు వెళ్ల‌డం గ‌మ‌నార్హం. బెట్టింగ్ యాప్స్‌పై ప్ర‌చారం చేశార‌నే కార‌ణంతో ప‌లువురు సోష‌ల్ మీడియా ప్ర‌భావ‌శీల వ్య‌క్తుల‌పై పంజాగుట్ట పీఎస్‌లో కేసు న‌మోదైన సంగ‌తి తెలిసిందే. మ‌రికొంద‌రు ప్ర‌ముఖుల‌పై కూడా కేసు న‌మోదు చేసే అవ‌కాశం వుంది.

ఈ నేప‌థ్యంలో ఇప్ప‌టికే ప‌లువురు సోష‌ల్ మీడియా ప్ర‌ముఖులు విచార‌ణ‌కు హాజ‌ర‌య్యారు. అయితే విష్ణుప్రియ మాత్రం గైర్హాజ‌రు కావ‌డం చ‌ర్చ‌నీయాంశ‌మైంది. అయితే ఆమె కూడా న్యాయ‌వాదిని వెంట‌బెట్టుకుని పంజాగుట్ట పీఎస్‌కు వెళ్ల‌డం చ‌ర్చ‌నీయాంశ‌మైంది.

బెట్టింగ్‌యాప్స్‌పై సోష‌ల్ మీడియాలో ఇన్‌ప్లూయ‌న్స‌ర్లు ప్ర‌చారం చేయ‌డం వ‌ల్ల యువ‌త ఆర్థికంగా తీవ్రంగా న‌ష్ట‌పోతున్నార‌ని పోలీసులు గుర్తించారు. అలాగే మ‌రికొంద‌రు బ‌ల‌వ‌న్మ‌ర‌ణానికి కూడా పాల్ప‌డ్డాన్ని పోలీసులు గుర్తించారు.

బెట్టింగ్ యాప్స్‌పై సోష‌ల్ మీడియాలో ప్ర‌చారం చేయ‌డంపై ఐపీఎస్ అధికారి స‌జ్జ‌నార్ సీరియ‌స్‌గా తీసుకున్నారు. మొట్ట‌మొద‌ట లోక‌ల్ బాయ్ నాని అనే విశాఖ యువ‌కుడిపై కేసు పెట్ట‌డంతో పాటు జైలుకు పంపి గ‌ట్టి హెచ్చ‌రిక పంపారు. ఆ త‌ర్వాత ఏ ఒక్క‌ర్నీ విడిచిపెట్ట‌లేదు. వ‌రుస‌గా కేసులు పెడుతూ, విచార‌ణ‌కు పిలుస్తున్నారు. అయితే అరెస్ట్ వ‌ర‌కూ వెళ్తారా? లేక హెచ్చ‌రిక‌తో , ఇక‌పై ప్ర‌చారం చేయ‌మ‌నే హామీతో విడిచి పెడ‌తారా? అనేది తేలాల్సి వుంది. ఏది ఏమైనా యువ‌త ప్రాణాలు తీస్తున్న బెట్టింగ్ యాప్స్‌పై ప్ర‌చారాన్ని అడ్డుకునే ప్ర‌య‌త్నం ప్ర‌శంస‌లు అందుకుంటోంది.

8 Replies to “ఎట్ట‌కేల‌కు విచార‌ణ‌కు బిగ్‌బాస్ సెల‌బ్రిటీ”

    1. Many apps are not available in playstore. These influencers provide the link to apk also. Another point is these apps are not banned by central and many other states

  1. Y.-.C.-.P పార్టీ అదికార ప్రతినిధి శ్యామలని ఎప్పుడు పిలుస్తున్నారు! నువ్వ్ అప్పుడు కూడా రాయవులె!

Comments are closed.