మెజారిటీ అమెరికన్లకు మోదీ ఎవరో తెలియదట!

నరేంద్ర మోదీ…మూడుసార్లు భారత ప్రధాని. ఈమధ్యనే అమెరికాలో పర్యటించారు. మోదీ తనకు మంచి స్నేహితుడని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కూడా చెప్పారు. అంతర్జాతీయంగా కూడా అనేక అంశాల్లో మోదీ కీలక పాత్ర పోషిస్తున్నారు. భారతదేశం…

నరేంద్ర మోదీ…మూడుసార్లు భారత ప్రధాని. ఈమధ్యనే అమెరికాలో పర్యటించారు. మోదీ తనకు మంచి స్నేహితుడని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కూడా చెప్పారు. అంతర్జాతీయంగా కూడా అనేక అంశాల్లో మోదీ కీలక పాత్ర పోషిస్తున్నారు. భారతదేశం అనుసరిస్తున్న విదేశాంగ విధానాన్ని ప్రపంచ దేశాలన్నీ మెచ్చుకుంటున్నాయి. ప్రధాని నరేంద్ర మోదీ ఈ దిశంగా ఎంతో కృషి చేస్తున్నారు.

గడచిన దశాబ్ధ కాలంలో ప్రధాని మోదీ పలు దేశాలతో దౌత్యపరమైన సమావేశాలు నిర్వహించారు. ఈ నేపధ్యంలో భారత్‌ ప్రపంచంలోని పలు దేశాల నడుమ ప్రత్యేక గుర్తింపును దక్కించుకుంది. ఆయన అమెరికాలో అనేకసార్లు పర్యటించారు. కీలక ప్రసంగాలు చేశారు. ఆయన సభలకు కూడా భారీగా ఆదరణ లభించింది.

గత ఏడాది ఆయన అమెరికాలో పర్యటించినప్పుడు అమెరికా కాంగ్రెసు ఉభయ సభల సంయుక్త సమావేశంలో ప్రసంగించారు. పార్లమెంట్‌ సభ్యులు ఆయనకు తొలుత చప్పట్లతో స్వాగతం పలికారు. ‘మోదీ మోదీ’నినాదాలతో సభ పలుమార్లు ప్రతిధ్వనించింది. మోదీ ప్రసంగానికి అపూర్వ స్పందన లభించింది.

పార్లమెంట్‌ సభ్యులతోపాటు గ్యాలరీల్లో ఉన్న భారతీయ–అమెరికన్లు హర్షాతిరేకాలు వ్యక్తం చేశారు. మోదీ మాట్లాడుతుండగా 15 సార్లు స్టాండింగ్‌ ఓవేషన్లు, 79 సార్లు చప్పట్లతో హర్షామోదాలు లభించడం గమనార్హం. మోదీతో సెల్ఫీలు దిగడానికి సభ్యులు పోటీపడ్డారు. ఆయన నుంచి ఆటోగ్రాఫ్‌లు సైతం తీసుకున్నారు. భారతీయ అమెరికన్లు ‘భారత్‌ మాతాకీ జై’ అంటూ నినదించారు. ఇలాంటివి అనేక సంఘటనలు ఉన్నాయి.

మోదీ పర్యటనకు, సభలకు అక్కడి మీడియా కూడా బాగా ప్రాధాన్యం ఇస్తుంది. అయితే విచిత్రమేమిటంటే ….ఇంత పాపులర్ నాయకుడైన మోదీ ఎవరో మెజారిటీ అమెరికన్లకు తెలియదట ! మోదీ ఎవరో తమకు తెలియదని 70 మంది అమెరికన్లు చెప్పారట. ఇలా అని యూగవ్ అనే సర్వే తెలియజేసింది.

మరో సర్వేలో మోదీపై అభిప్రాయాలు తెలియజేయాలని అడిగినప్పుడు రెండు శాతం మంది మాత్రమే ఆయన పట్ల బలమైన ఇష్టాన్ని వ్యక్తం చేశారు. పదకొండు శాతం మంది సానుకూలత వ్యక్తం చేశారు. చెంగీజ్ఖాన్, పుతిన్ కంటే తక్కవ ర్యాంకు ఇచ్చారు. మోదీ కంటే మహాత్మా గాంధీకి ఆదరణ ఎక్కువగా ఉంది. ఆయనపట్ల 61 శాతం మంది సానుకూలత వ్యక్తం చేశారు.

గతంలో ఇలాగే నరేంద్ర మోదీ కూడా 1982 వరకు మహాత్మా గాంధీ ఎవరో ప్రజలకు తెలియదని అన్నారు. మహాత్మాగాంధీపై 1982లో సినిమా తీసే వరకు ఆయనెవరో ప్రపంచానికి తెలియదని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్‌ నేతృత్వంలోని గత కేంద్ర ప్రభుత్వాలు గాంధీ గురించి తగిన విధంగా ప్రచారం చేయలేదని విమర్శలు చేశారు.

గత 75 ఏండ్ల కాలంలో ‘గాంధీజీ చాలా గొప్ప వ్యక్తి. కానీ ఆయన గురించి ఎవరికీ తెలియదని చెబుతున్నందుకు నన్ను క్షమించండి. 1982లో ఆయనపై సినిమా తీసే వరకు గాంధీ గురించి ప్రపంచానికి తెలియదు అన్నారు.

10 Replies to “మెజారిటీ అమెరికన్లకు మోదీ ఎవరో తెలియదట!”

  1. చెంగీజ్ఖాన్ వీరుడు అని బీజేపీ , ఆరెస్సెస్ , వీహెచ్పీ , ఏబీవీపీ ఎన్నో సార్లు కీర్తించింది , ఆదర్శంన్గా తీసుకుంది కూడాను

  2. ఈ సార్ మీద కూడ సినిమా తీసారు కదా, అయినా ప్రపంచానికి తెలియదా?

  3. గాంధీ అనే gaandu పుట్టకపోతే దేశం విడిపోకుండా నేతాజీ నేతృత్వంలో 1936 లోనే స్వాతంత్ర్యం వచ్చేది…

Comments are closed.