రాజీనామాలు స‌రే…ఆమోదం ఎప్పుడు?

రాజీనామాల్ని ఆమోదింప‌జేసుకుంటే, త‌ర్వాత అనుకున్న ప్ర‌కారం వాళ్ల ప‌నేదో చేసుకోవాల‌నే తాప‌త్ర‌యంలో ఉన్నారు.

వైసీపీకి, ఎమ్మెల్సీ ప‌ద‌వుల‌కు ఇప్ప‌టి వ‌ర‌కు ఐదుగురు రాజీనామా చేశారు. పార్టీ ప్రాథ‌మిక స‌భ్య‌త్వాల‌కు చేసిన రాజీనామాల‌ను ఆమోదించారు. కానీ ఎమ్మెల్సీ ప‌ద‌వుల‌కు చేసిన రాజీనామాల‌ను మాత్రం శాస‌న‌మండ‌లి చైర్మ‌న్ మోషెన్‌రాజు ఆమోదించ‌లేదు. దీంతో రాజీనామా చేసిన ఎమ్మెల్సీలు క‌ర్రి ప‌ద్మ‌శ్రీ‌, పోతుల సునీత, బ‌ల్లి కల్యాణ్ చ‌క్ర‌వ‌ర్తి, జ‌య‌మంగ‌ళ వెంక‌ట‌ర‌మ‌ణ‌, తాజాగా మ‌ర్రి రాజ‌శేఖ‌ర్ య‌ధావిధిగా స‌మావేశాల‌కు హాజ‌ర‌వుతున్నారు.

శాస‌న‌మండ‌లి వేదిక‌గా త‌మ రాజీనామాల్ని ఆమోదించాల‌ని వైసీపీ స‌భ్యులు కోర‌డం గ‌మ‌నార్హం. అస‌లు త‌మ రాజీనామాలు ఎందుకు ఆమోదించ‌డం లేదో వాళ్ల‌కు అర్థంకాని ప‌రిస్థితి. మ‌రోవైపు శాస‌న‌మండ‌లి చైర్మ‌న్‌పై అవిశ్వాస తీర్మానం పెట్టాల‌నే ఆలోచ‌న‌లో టీడీపీ నేత‌లున్నారు. ఇందుకోస‌మే రాజీనామాల ఆమోదాన్ని జాప్యం చేస్తున్నార‌నే అనుమానం కూడా లేక‌పోలేదు.

మ‌రోవైపు రాజీనామా చేసిన ఎమ్మెల్సీలు, అధికార పార్టీతో ఎలాంటి ఒప్పందం చేసుకున్నారో తెలియ‌దు. కానీ రాజీనామాల ఆమోదం కోసం ప‌ట్టుబ‌డుతున్నారు. రాజీనామాల్ని ఆమోదింప‌జేసుకుంటే, త‌ర్వాత అనుకున్న ప్ర‌కారం వాళ్ల ప‌నేదో చేసుకోవాల‌నే తాప‌త్ర‌యంలో ఉన్నారు. కానీ మండలి చైర్మ‌న్ వాళ్ల ప్ర‌య‌త్నాల‌కు గండికొడుతున్నారు.

రాజీనామాలు చేసి నెల‌లు గ‌డుస్తున్నా, ఆమోదం పొంద‌క‌పోవ‌డం చ‌ర్చ‌నీయాంశ‌మ‌వుతోంది. వైసీపీ స‌భ్యుడైన మోషెన్‌రాజు ఏదో వ్యూహంతోనే వ్య‌వ‌హ‌రిస్తున్నార‌నే అభిప్రాయం వ్య‌క్త‌మ‌వుతోంది. ఒక‌వేళ చైర్మ‌న్‌పై అవిశ్వాస తీర్మానం ప్ర‌వేశ పెడితే, ఐదుగురి రాజీనామాలు ఆమోదం పొందే అవ‌కాశం వుంటుందేమో!

3 Replies to “రాజీనామాలు స‌రే…ఆమోదం ఎప్పుడు?”

  1. కూటమి MLA/MLC లు స్పోర్ట్స్ ఆడుకుంటూ ఎంజాయ్ చేస్తుంటే బెంగళూరు లైలా జగ్లక్ గాడి మీదకి చెప్పు విసిరింది టాక్ నిజమేనా GA ?

Comments are closed.