కంటెంట్ తక్కువ – ఖర్చు ఎక్కువ

లూసిఫర్ కు ఈ సీక్వెల్ కు ఎమోషనల్ గా పోలిక వుంది. తొలిభాగం మాదిరిగా ఎమోషనల్ జర్నీ అయితే కనిపించింది

మలయాళం ఫిలిం మేకర్లు విషయం మీద ఎక్కువ దృష్టి పెడతారు. మేకింగ్ మీద ఎక్కువగా ఆసక్తి చూపించరు. కథకు ఏ లొకేషన్ కావాలో అక్కడే తీస్తారు. అంతే ఖర్చు పెడతారు. అందుకే వాళ్ల సినిమాలు నేలబారుగా వున్నా, జనాలను బాగా ఆకట్టుకుంటాయి. చంద్రముఖి మనకు తెలిసింది ఓ భారీ సినిమాగా. కానీ అది తొలిసారి తెరకెక్కింది మలయాళంలో ఓ చిన్న సినిమాగా. ఓటిటి ద్వారా మన ప్రేక్షకులు అందరికీ పరిచయం అయిన లూసిఫర్ సినిమా కూడా మరీ భారీ సినిమా కాదు. ఓ మిడ్ రేంజ్ సినిమా. తెలుగులో మెగస్టార్ టేకప్ చేసాక భారీ సినిమాగా మారింది. అదే లూసిఫర్ పెద్ద హిట్ అయ్యాక ఇప్పుడు భారీ సినిమాగా మారింది.

లూసిఫర్ సీక్వెల్ ఎల్ 2 ఎంపరాన్ అనే చిత్రమైన పేరుతో తయారైన సినిమా ట్రయిలర్ విడుదలయింది. లూసిఫర్ కు ఈ సీక్వెల్ కు ఎమోషనల్ గా పోలిక వుంది. తొలిభాగం మాదిరిగా ఎమోషనల్ జర్నీ అయితే కనిపించింది కానీ నిర్మాణంలో భారీ తనం దాన్ని డామినేట్ చేసింది. ఒక పాన్ ఇండియా లుక్ ఇవ్వాలి, కలర్ కనిపించాలి అనే ప్రయత్నం గట్టిగా చేసారు. కానీ మలిభాగంలో కంటెంట్ ఏమిటి అన్నది క్లారిటీ ఇవ్వలేదు ట్రయిలర్ లో.

స్టయిలిష్ మేకింగ్ వుంది..భారీతనం వుంది. కానీ ఈసారి కంటెంట్ లో ఆ ఎమోషన్ చాలా వరకు మిస్ అయింది. మోహన్ లాల్ మీద కట్ చేసిన షాట్ మరీ తక్కువ వున్నాయి. పొలిటికల్ కుట్రలు, కుతంత్రాలు ఇవన్నీ ఎక్కువ వున్నాయి. దీని వల్ల ట్రయిలర్ కు ఓటిటి లుక్ వచ్చింది తప్ప థియేటర్ ఫీల్ రాలేదు. అదే సమస్య ట్రయిలర్ తో. ట్రయిలర్ లో సినిమా మొత్తం సినిమాలోంచి రకానికో సీన్ వంతున కట్ చేసి వేసినట్లుంది.

అయితే సినిమా జనాల దృష్టిలో ట్రయిలర్ భారీగా వుంది. బాగుంది అనే టాక్ వుంది. ఎందుకంటే ఇప్పుడు అన్నీ ఈవెంట్ సినిమాలే నడుస్తున్నాయి కనుక. కానీ మలయాళం నుంచి వచ్చే భారీ సినిమాల హిట్ పర్సంటేజ్ చాలా తక్కువ అన్నది గమనించాలి.

5 Replies to “కంటెంట్ తక్కువ – ఖర్చు ఎక్కువ”

Comments are closed.