20 మంది ఎమ్మెల్యేల‌పై చ‌ర్య‌ల‌కు బాబు ఆలోచన‌!

వీళ్లంద‌రిపై కేసులు పెట్ట‌డానికి ప్రభుత్వంభుత్వం స‌మాయ‌త్తం అవుతోంద‌ని తెలిసింది.

కూట‌మి అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత అరాచ‌కాలు త‌గ్గ‌డం దేవుడెరుగు, అధికారాన్ని అడ్డం పెట్టుకుని మ‌రింత రెచ్చిపోతున్నార‌నే అభిప్రాయం బ‌ల‌ప‌డింది. రాష్ట్ర వ్యాప్తంగా కూట‌మి ప్ర‌జాప్ర‌తినిధులు క్షేత్ర‌స్థాయిలో విచ్చ‌ల‌విడిగా దోపిడీలు, దౌర్జ‌న్యాల‌కు తెగ‌బ‌డుతున్నార‌నే నిఘా వ‌ర్గాల నివేదిక‌లు సీఎం చంద్ర‌బాబుకు చేరాయి. ఈ నేప‌థ్యంలో ఇప్ప‌టికే చాలా మంది ప్ర‌జాప్ర‌తినిధుల్ని సీఎం చంద్ర‌బాబు పిలిచి హెచ్చ‌రించిన‌ప్ప‌టికీ, ఎలాంటి మార్పు రాలేదు.

దీంతో శ్రుతిమించిన 20 మంది ఎమ్మెల్యేల‌పై కేసులు న‌మోదు చేసి, త‌ప్పు చేస్తే మ‌న‌, ప‌రాయి అనే తేడా లేకుండా చ‌ర్య‌లు తీసుకుంటార‌నే సంకేతాల్ని పంపాల‌ని చంద్ర‌బాబు భావిస్తున్న‌ట్టు ప్ర‌భుత్వ వ‌ర్గాలు చెబుతున్నాయి. ఇందులో భాగంగా కొంద‌రు ఎమ్మెల్యేల‌ను గుర్తించిన‌ట్టు కూడా చెబుతున్నారు.

తిరుప‌తి జిల్లాలో ఇద్ద‌రు , నంద్యాల జిల్లాలో ఒకరు, వైఎస్సార్ జిల్లాలో ఇద్ద‌రు, ఉభ‌య గోదావ‌రి జిల్లాలో ఐదుగురు, అలాగే ఉత్త‌రాంధ్ర‌, గుంటూరు జిల్లాలో మ‌రికొంద‌రు ప్ర‌జాప్ర‌తినిధుల్ని సీఎం చంద్ర‌బాబు గుర్తించిన‌ట్టు టీడీపీ వ‌ర్గాలే చెబుతున్నాయి. వీళ్లంద‌రిపై కేసులు పెట్ట‌డానికి ప్రభుత్వంభుత్వం స‌మాయ‌త్తం అవుతోంద‌ని తెలిసింది. త‌ద్వారా త‌న ప్ర‌భుత్వంపై పాజిటివ్ సంకేతాల్ని పంప‌డానికి సీఎం చంద్ర‌బాబు వ్యూహాత్మ‌కంగా ముందుకెళుతున్నార‌ని తెలిసింది.

ఇప్ప‌టికే అడ్డగోలు ప్ర‌జాప్ర‌తినిధుల నియోజ‌క‌వ‌ర్గాల్లో వాళ్లు చెప్పిన‌ట్టు వ్య‌వ‌హ‌రించొద్ద‌ని పోలీసు, ఇత‌ర అధికారుల‌కు స్ప‌ష్ట‌మైన ఆదేశాలు కూడా ఇచ్చార‌ని స‌మాచారం. దీంతో ప్ర‌భుత్వంపై సొంత పార్టీ నేత‌లే తీవ్ర విమ‌ర్శ‌లు, అలాగే పోరాటాల పేరుతో హెచ్చ‌రిక‌ల్ని చేస్తున్నారు. రానున్న రోజుల్లో ప్ర‌భుత్వం సొంత పార్టీ ప్ర‌జాప్ర‌తినిధుల‌పై కేసుల‌తో సంచ‌ల‌నం సృష్టించ‌డానికి సిద్ధ‌మ‌వుతోంద‌న్న‌ది వాస్త‌వం.

8 Replies to “20 మంది ఎమ్మెల్యేల‌పై చ‌ర్య‌ల‌కు బాబు ఆలోచన‌!”

  1. కూటమి ప్రభుత్వం 4 గురు సలహాదారులని నియమించింది…వాళ్ళ కి గత ప్రభుత్వం లో సలహాదారులకి ఎక్కడైనా పొంతన ఉందా ????పచ్చి గ పోలీస్ ఎంక్వయిరీ లో పోసాని సాక్షి పేరు చెప్పిన గానీ లేదు అని బుకాయింపు చేస్తుంది…పబ్లిక్ గ పోలింగ్ బూత్ తో ఎమ్మెల్యే చేసిన దుర్మార్గాన్ని కూడా కప్పెట్టి సాధారణ ప్రజల మీద విషం జల్లింది…ఇది మన అన్న మీడియా తీరు

  2. Chandrababu చెయలి అనుకుంటున్న ప్రతిదీ నీకు ఫొనె చెసి చెపుతాడా?

    ఎదొ సొల్లు రాసి, చెడుగా ప్రచారం చెయలి అన్న బిలుగు మీడియా యావ తాపితె అక్క ఎమి లెదు

    .

    విచ్చల విడిగా దొపిడీలు, దౌర్జన్యాలు అంట! అలా జరిగింది మన జగన్ అన్న పాలనలొనె! వెలకొట్ల విలువ చెసె కాకినాడ పొర్ట్/SEZ ఎలా విచ్చలవిడిగా A1, A2 దొచుకున్నరొ కాస్త చెప్పు!

  3. ఈ గ్రే*ట్ ఆంద్ర న్యూ*స్ చదివి ప్యాల*స్ పులకేశి గాడు తన తల నీ తీసుకెళ్ళి పం*ది ము*డ్డి లో దాచు*కుంటారు ఏ*మో సి*గ్గు తో.

Comments are closed.