ప్ర‌భుత్వ వ్య‌తిరేక‌త‌ను వైసీపీ సొమ్ము చేసుకుంటోందా?

ప్ర‌జ‌ల్లో వ్య‌తిరేక‌త‌ను వైసీపీ రాజ‌కీయంగా సొమ్ము చేసుకునే ప‌రిస్థితిలో వుందా?

కూట‌మి ప్ర‌భుత్వ పాల‌న ప‌దో నెల న‌డుస్తోంది. సూప‌ర్ సిక్స్ ప‌థ‌కాలు అమ‌లుకు నోచుకోక‌పోవ‌డంతో ప్ర‌జ‌ల్లో అస‌హం, అసంతృప్తి క‌నిపిస్తున్నాయి. మ‌రీ ముఖ్యంగా గ‌త వైసీపీ ప్ర‌భుత్వం సంక్షేమ ప‌థ‌కాల రుచిని బాగా చూప‌డంతో, ఇప్పుడేమీ లేద‌నే చ‌ర్చ జ‌నంలో విస్తృతంగా సాగుతోంది. కూట‌మి నేత‌లు త‌మ‌తో ఓట్లు వేయించుకోడానికి అబ‌ద్ధాలతో వంచించార‌నే కోపం వాళ్ల‌లో క‌నిపిస్తోంది.

విడ‌త‌ల వారీగా సంక్షేమ ప‌థ‌కాలను అమ‌లు చేస్తామ‌ని ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు అంటున్నారు. మే నెల‌లో త‌ల్లికి వంద‌నం, అలాగే అన్న‌దాత సుఖీభ‌వ కింద రైతుల‌కు రూ.20 వేలు చొప్పున కేంద్ర ప్ర‌భుత్వ సాయంతో క‌లిపి మూడు విడ‌త‌ల్లో అంద‌జేస్తామ‌ని చంద్ర‌బాబు ప్ర‌క‌టించారు. అయితే బ‌డ్జెట్‌లో వీటికి కేలాయింపుల్ని గ‌మ‌నిస్తే, ల‌బ్ధిదారుల్లో భారీ కోత‌లు త‌ప్ప‌వ‌ని వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి ఇటీవ‌ల అన్నారు. దీంతో ల‌బ్ధిదారుల్లో ఒక ర‌క‌మైన ఆందోళ‌న‌.

మ‌రోవైపు డీఎస్సీపై అతీగ‌తీ లేదు. కేవ‌లం ప్ర‌క‌ట‌న‌ల‌కే విద్యాశాఖ మంత్రి లోకేశ్ ప‌రిమితం అవుతున్నారు. మ‌హిళ‌ల‌కు ఆర్టీసీ బ‌స్సుల్లో ఉచిత ప్ర‌యాణం, నిరుద్యోగ భృతి, 50 ఏళ్లు నిండిన బీసీల‌కు పింఛ‌న్‌…ఇలా చాలా ప‌థ‌కాల అమ‌లుపై స్ప‌ష్ట‌త లేదు. వీటిపై వైసీపీ మండ‌లిలో ప్ర‌శ్నిస్తే, దాట‌వేత ధోర‌ణిలో ప్ర‌భుత్వ ప్ర‌తినిధులు స‌మాధానాలు ఇవ్వ‌డం చూశాం.

ఈ నేప‌థ్యంలో ప్ర‌జ‌ల్లో వ్య‌తిరేక‌త‌ను వైసీపీ రాజ‌కీయంగా సొమ్ము చేసుకునే ప‌రిస్థితిలో వుందా? అనేది ప్ర‌శ్న‌. ఇంకా వైసీపీపై ప్ర‌జ‌ల్లో సానుకూల‌త పెద్ద‌గా క‌నిపించ‌లేద‌ని చెప్పొచ్చు. ఇంకా ఎన్నిక‌ల‌కు నాలుగేళ్ల స‌మ‌యం ఉండ‌డంతో, ఆ లోపు వైసీపీ అధినేత వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి ఎలా వ్య‌వ‌హ‌రిస్తార‌నే దానిపై ఆ పార్టీకి ప్ర‌జ‌ల్లో ఆద‌ర‌ణ ఆధార‌ప‌డి వుంటుంది. లోపాల్ని స‌రిచేసుకుని అంద‌ర్నీ క‌లుపుకుని వెళితేనే వైసీపీకి మంచి భ‌విష్య‌త్ వుంటుంది.

ప్ర‌భుత్వంపై వ్య‌తిరేక‌త‌ను సొమ్ము చేసుకునే చాక‌చ‌క్యం ఇంకా వైసీపీలో క‌నిపించ‌డం లేదు. అధికారంపై జ‌గ‌న్‌లో ధీమా క‌నిపిస్తోంది. దీనికి కార‌ణం ప్ర‌భుత్వంపై ప్ర‌జా వ్య‌తిరేక‌త‌. ఇదే సంద‌ర్భంలో త‌మ‌వైపు రావాల్సిన మార్పు గురించి కూడా జ‌గ‌న్ ఆలోచించాలి. దాన్ని విస్మ‌రిస్తే, మ‌ళ్లీ క‌థ మొద‌టికే. వైసీపీ శ్రేణుల భ‌య‌మ‌ల్లా అదే. ఇంకా జ‌గ‌న్ త‌న చుట్టూ ప‌నికిరానోళ్ల‌ను పెట్టుకున్నార‌ని వాపోతున్నారు. ఇలాగైతే వైసీపీకి భ‌విష్య‌త్ ఎలా వుంటుంద‌నే ప్ర‌శ్న‌.

ప్ర‌భుత్వ వ్య‌తిరేక‌త‌నే న‌మ్ముకుంటే జ‌గ‌న్ త‌ప్పులో కాలేసిన‌ట్టే. త‌న‌తో పాటు పార్టీపై జ‌నంలోనూ, వైసీపీ శ్రేణుల్లోనూ వ‌చ్చేందుకు ఏం చేయాలో జ‌గ‌న్ ఆలోచించాలి. ఇదే వైసీపీ శ్రేణుల కోరిక కూడా.

15 Replies to “ప్ర‌భుత్వ వ్య‌తిరేక‌త‌ను వైసీపీ సొమ్ము చేసుకుంటోందా?”

  1. శవాలను తప్ప దేన్ని సొమ్ము చేసుకోని, చేసుకోలేని మహానుభావుడు GA మన అన్నయ్య…..😂😂

  2. భవిష్యత్ లో జెగ్గమ్మ ముఖ్యమంత్రి అయ్యే విషయం లో నా అభిప్రాయం ఏంటంటే…

    రాయలసీమ వాళ్ళు అయినా కనికరపడి ఓట్లు వేస్తారేమో కానీ…

    కోస్తా ఉత్తరాంధ్ర వాళ్ళు తిరిగి ఎన్ని పథకాలు ఈ మహిళ జెగ్గక్క ప్రకటించినా ఓట్లు ఎప్పటికీ వెయ్యను గాక వెయ్యరు

    ఇది సత్యం…ఇది తథ్యం

    1. ఓట్లు పడేవే నన్ను చూసి అని విర్రవీగాడు..

      గెలిచిన వారంతా నా వల్లే అన్నాడు..

      ఇప్పుడు ఓడిన వారంతా నీ వల్లే అంటున్న ఓడిపోయిన అభ్యర్థులు

  3. వైసీపీ ప్రభుత్వం ఎక్కువ మందికి తక్కువ డబ్బు పంచేది కానీ కూటమి ప్రభుత్వం లబ్ధిదారులు ను తగ్గించి ఇస్తుంది దానితో కొంత ఆదా అవుతుంది రోడ్స్ ఇతర ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేస్తుంది పోలీస్ లను కూడా చట్ట పరిధి దాటనివ్వకుండా అరాచక పాలనకు తెర వేశారు దానితో తటస్థ ఓటర్ లకు కావాల్సింది చేసారు అది చాలు తిరిగి అధికారం లోనికి రావటానికి అదే మొన్న గ్రాడ్యుయేట్ మ్మెల్సీ ఎన్నికలలో ప్రతిఫలించింది కూటమి మీద వ్యతిరేకత అక్రమం గ పథకాలు పొందే వాళ్లకు ఉంటుంది పథకాలు పోయేయి కాబట్టి అటువంటి ఓట్లే వైసీపీ కి వేసేది వాళ్ళ ఓట్లతో గెలవాలనుకోవడం భ్రమ మాత్రమేఇతను అభివృద్ధి చేసి గెలవాలని కోడు కాలికో వేలికో కట్టుకట్టుకొని లేదా ఎవరిదో శవాన్ని అడ్డుపెట్టుకోనో సింపతి తే ఓట్లు పొందాలనుకొంటాడు లేదా నాగార్జున సాగర్ మీద కు ఎలక్షన్ నాడు పోలీస్ లను పంపి భావోద్వేగాలు పెంచి లబ్ది పొందాలనుకునే రకం రాష్ట్ర ప్రజలు రేపు నిజం చెప్పిన నమ్మకుండా చేసుకొన్నారు

  4. మోహన, మాట తప్పక, మడమ తిప్పకుండా మనం 99.9% హామీలు అమలు చేసాం..ప్రతీ ఇంటికీ, ప్రతీ ఒంటికీ మేలు చేసాం.. ఏమైంది?? పథకాలు తీసుకుని పంగనామాలు పెట్టారు..

    ఐనా ఇదంతా టైంపాస్.. అధికారం డిసైడ్ చేసేది ‘EVM లు

    సో నువ్వు చెప్పినట్టు అతి నిజాయితీగా 5 ఏళ్ళు కళ్ళు మూసుకుని E’VM జపం చేస్తే అధికారం ప్యాలెస్ GATE తన్నుకుంటూ వస్తది..

  5. avunu l 1 1 nava randralu , eppudu kuda vunnai kada mari welfare emi taggindi ??

    kevalam neeli l k laki tax sommu salary ga ravatledu

    netizens talk ro neeli l k lara

  6. సొమ్ము చేసుకోడం కమ్ము చేసుకోవడం రెండూ రాని పూజకు పనికిరాని పువ్వు జ•• !!

  7. అవినీతి కేసు లు వున్నా వ్యక్తుల పేర్లు విగ్రహాలు పెట్టకూడదని అసెంబ్లీ తీర్మానం పాస్ చెయ్యాలి వీళ్ళ పేర్లు విగ్రహాలు పెట్టడం వాళ్ళ స్థానిక ప్రజలు బాధపడుతున్నారు అవినీతి కేసు లలో నిర్దోషులు గ వస్తే పెట్టొచ్చు

  8. నిన్ను కూడా దూరం పెడితే గానీ, వైసీపీ కి కనీసం ప్రతిపక్షంగా నైనా life ఉంటుంది ga..!

Comments are closed.