గేట్స్ మనకు డబ్బులిస్తారా? గేట్స్ కు మనం డబ్బులిస్తామా?

గేట్స్ ఫౌండేషన్ సాంకేతికతను అందిస్తే గనుక.. దానిని ఉచితంగా అందిస్తున్నారా?

ప్రపంచ సాంకేతిక రంగాన్ని శాసిస్తున్న మైక్రోసాఫ్ట్ సంస్థకు సారథి హోదా నుంచి సహ వ్యవస్థాపకుడి హోదాకు పడిపోయిన బిల్ గేట్స్ తో 40 నిమిషాలు సమావేశమైనందుకు.. ‘ఆయనతో అద్భుతమైన సమావేశం జరిగింది’ అంటూ చంద్రబాబునాయుడు ఎక్స్ వేదికగా హర్షం వ్యక్తం చేస్తున్నారు గానీ.. ఆయన అభిమానులకు అంత గొప్పగా ఏం అనిపించలేదు.

గేట్స్ ప్రపంచసాంకేతిక రంగాన్ని శాసిస్తున్న రోజుల్లోనే ఆయనతో 10 నిమిషాల అపాయంట్మెంట్ తీసుకుని ఏకంగా 45 నిమిషాలు భేటీ కొనసాగించిన చంద్రబాబు.. ఇప్పుడు 40 నిమిషాలు కలవడంలో గొప్పేం ఉందని అనుకుంటున్నారు. ఈ అద్భుతమైన భేటీలో.. ఏపీ ప్రజల అభివృద్ధి, సంక్షేమం కోసం ప్రభుత్వంతో గేట్స్ ఫౌండేషన్ సహకారంపై కీలక చర్చలు జరిపాం. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాల వినియోగంపై చర్చించాం.. అని చంద్రబాబు సంతోషంగా ప్రకటించారు.

రాష్ట్రంలో ఆరోగ్య సంరక్షణ, విద్య, పరిపాలన, వ్యవసాయం, ఉపాధి రంగాల్లో అవగాహన పత్రంపై సంతకాలు జరుగుతాయని ఈ భేటీ గురించి ముందుగా ప్రకటించారు. గేట్స్ ఫౌండేషన్ తో ఆరోగ్య డేటా వ్యవస్థలు, టెలి మెడిసిన్, తక్కువ ఖర్చుతో వైద్య పరీక్షలు, వైద్య ఉపకరణాలు, డిజిటల్ విద్య, జాతీయ విద్య, విద్యారంగంలో వైజ్ఞానిక పరికరాలు, ప్రజాసేవలు, వ్యవసాయంలో ఉపగ్రహ డేటా ద్వారా పారదర్శకంగా సబ్సిడీ పంపిణీ లాంటి రంగాల్లో ఒప్పందాలు కుదురుతాయని కూడా అన్నారు. అయితే ఈ ఒప్పందాల్లోని ఆర్థిక వివరాలు, గణాంకాలు మాత్రం వెల్లడించలేదు.

గేట్స్ తో బాబు భేటీ గురించి, ఆయన ఆనందం చూసిన తర్వాత ప్రజల్లో కొన్ని సందేహాలు కలుగుతున్నాయి. ఏపీ ప్రభుత్వం ఒప్పందం చేసుకుంటున్నది.. గేట్స్ ఫౌండేషన్ తో మాత్రమే. సాధారణంగా బిల్ గేట్స్ ఫౌండేషన్ ప్రపంచ వ్యాప్తంగా ఆరోగ్య రంగంలో వేలాది కోట్ల రూపాయల విరాళాలను సమకూర్చి ఖర్చు పెడుతూ ఉంటుంది. అయితే ఇప్పుడు ఏపీ సర్కారుతో కుదురుతున్న ఒప్పందం ద్వారా.. బిల్ గేట్స్ ఫౌండేషన్.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆరోగ్యరంగాన్ని పరిపుష్టం చేయడానికి ఎన్ని వేల కోట్లు విరాళంగా ఇవ్వబోతున్నది- అనే లెక్క ఎక్కడా కనిపించడం లేదు.

ఇంకా సూటిగా చెప్పాలంటే.. ఈ ఒప్పందాల ద్వారా.. బిల్ గేట్స్ ఫౌండేషన్ ద్వారా ఏపీ ప్రభుత్వానికి ఒక్కరూపాయి నిధులైనా విరాళాలుగా వస్తాయా? లేదా.. ఏపీ ప్రభుత్వమే బిల్ గేట్స్ కు కొన్ని వందల వేల కోట్ల రూపాయలను సాంకేతికత సహకారం కోసం ఫీజులుగా చెల్లించడానికి పూనుకుంటున్నదా? అనేది క్లారిటీ రావడం లేదు. ఫౌండేషన్ లు ప్రభుత్వానికి ఇవ్వడం అనేది సహజంగా జరిగే పద్ధతి. నారాయణమూర్తి ఫౌండేషన్ లాంటివి.. ఇలా తమ నిధులను ప్రభుత్వాలకు ఇచ్చి నిర్దిష్ట రంగాల్లో కార్యక్రమాలను ప్రోత్సహిస్తుంటాయి.

ఇక్కడ గేట్స్ ఫౌండేషన్ తో ఒప్పందాలు అలా ఉండేలా కనిపించడం లేదు. అలాంటి వ్యవహారమే ఉంటే.. చారానా విరాళంగా వచ్చినా సరే.. బారాన ప్రచారం జరిగి ఉండేది. కానీ.. గేట్స్ ఫౌండేషన్ పైన పేర్కొన్న అన్ని రంగాల్లో సాంకేతికతను అందిస్తుంది.. సహకరిస్తుంది.. అనే పదాలతో.. సామాన్య ప్రజలకు అర్థంకాని కబుర్లను చంద్రబాబునాయుడు చెబుతున్నారు.

ఒకవేళ.. ఈ రంగాలకోసం గేట్స్ ఫౌండేషన్ సాంకేతికతను అందిస్తే గనుక.. దానిని ఉచితంగా అందిస్తున్నారా? లేదా, ఆ సేవలకు ప్రభుత్వం నుంచి వందల కోట్ల రూపాయల ఫీజులు తీసుకుంటారా? అనేది ప్రభుత్వం రాష్ట్ర ప్రజలకు స్పష్టత ఇవ్వాలి. గేట్స్ అనే పేరుకు ఒక క్రేజ్ ఉన్నది గనుక.. ఆ క్రేజ్ ముసుగులో ఇష్టమొచ్చిన దందాలు చేసుకోవచ్చునని ప్రభుత్వాలు భావిస్తే అది ప్రజలను మోసం చేయడం అవుతుంది.

20 Replies to “గేట్స్ మనకు డబ్బులిస్తారా? గేట్స్ కు మనం డబ్బులిస్తామా?”

  1. ఇదంతా వేస్ట్ . 100 అప్పు తీసుకురా , 90 బారతి బొడ్డులో తోపు. మిగతా 10 లో అ రెడ్డి , ఈ రెడ్డి , … 8 . మిగతా 2 పంచు.

  2. Scheme is to create wealth by promoting betting, lotteries and online gaming and give that wealth to Gates, Siemens and contractors who will route kickbacks as commissions through shell companies. Ardhamayyinda Raja!!

  3. అస్సలు మేథస్సు లేని వారికి కృత్రిమ మేథస్సు అంటే ఏమి తెలుస్తుంది కానీ…. గేట్స్ ఫౌండేషన్ అంటే మనం పెట్టిన కాగితాల మీద మాత్రమే ఉండే ఎంటిటి కాదు…. మీ వరకు అర్ధం కాకపోవడం లో తప్పు లేదు…. “its a very lengthy question ” …. జెగ్గూ వెళ్తే గేట్స్ ఫౌండేషన్ గేట్ బయటే తోసేసేవారు… ఎంత సేపు ఉచితంగా డబ్బులు పంచేసి పేదోళ్ల ఓట్లు తెచ్చేసుకోవడమే తప్ప ఒక విజన్ అనేది ఉందా చంద్ర బాబు గారి లాగ….

    1. ఇంటర్నెట్ వచ్చినప్పుడు కూడా పక్క దారులు, తప్పుడు దారులు కనపడ్డాయి..

      క్లౌడ్ సిస్టం వచ్చినప్పుడు కూడా పక్క దారులు, తప్పుడు దారులు కనపడ్డాయి..

      ప్రతి సాంకేతికత లో పక్క దారులు, తప్పుడు దారులు ఉంటాయి..

      ..

      కానీ అవి మాత్రమే చూసే కుంచిత బుద్ధి కలిగిన మనుషులు ఒక పక్కనే ఉంటారు..

      ..

      కేవలం చంద్రబాబు మీద కోపం తో ఒక న్యూ జనరేషన్ టెక్నాలజీ నే అసహ్యించుకునే నీచపు బుద్ధి.. మన రాష్ట్రం లో ఒక పార్టీ జనాలకు మాత్రమే ఉంటుంది..

      వాళ్లనే కూపస్థ మండూకాలు అంటారు..

      ..

      2014 లోనే AI లో మెషిన్ లెర్నింగ్ టెక్నాలజీ వాడేవాళ్ళం.. ఆ విషయం కూడా మాకు తెలీదు..

      అమెరికా లో జైళ్లలో కూడా AI వాడుకొంటున్నారు.. ప్రతి బారక్ లో ఎన్ని సెట్స్ ఫుడ్ పార్సెల్ పంపాలి.. ఎవరి డైట్ ఏంటి.. ఎన్ని గంటలకు డెలివర్ చేయాలి.. అంతా రోబాట్స్ సహాయం తో నడుపుతున్నారు..

      ఆ టెక్నాలజీ అంతా సపోర్ట్ చేస్తున్నది కూడా నేను పని చేసే కంపెనీ నే.. మా టీం సభ్యులే..

      ..

      AI అంటే బొమ్మలు.. మార్ఫింగ్ మాత్రమే అనుకొనే గొర్రెల కోసం ఇదంతా చెప్పాల్సి వచ్చింది..

  4. మా జగన్ రెడ్డి “బైజూస్” ని తెచ్చేసాడని అప్పట్లో మనం ఎంత గొప్పగా చెప్పుకొన్నామో.. మర్చిపోయావా వెంకట్ రెడ్డి..?

    మరి బైజూస్ కి మన జగన్ రెడ్డి డబ్బులిచ్చాడా..? లేక జగన్ రెడ్డి కే బైజూస్ డబ్బులిచ్చిందా..?

    బైజూస్ గురించి అంత గొప్పగా డప్పులు కొట్టుకొన్నావు కదా.. 2023 లో బైజూస్ కాదు “కంజూస్” అని ఈడీ కేసులేస్తే.. ఒక్క ముక్క కూడా రాయలేదు..

    ..

    బైజూస్ టాబులిచ్చాడు .. కంటెంట్ ఇచ్చాడు అన్నారు.. రెండేళ్ల తర్వాత ఏమైపోయాయి అవి.. జగన్ రెడ్డి హయాం లోనే కనపడకుండా పోయాయి.. డబ్బు మాత్రం వేల కోట్లు సమర్పించేసుకొన్నారు..

  5. దీనినే జఫ్ఫా గాళ్ళ బోధనల అంటారు

    అరే ఏబ్రాసి జలగ అధికారంలో ఉన్నప్పుడు అదే మైక్రోసాఫ్ట్ బిల్ గేట్స్ అపాయింట్మెంట్ సాధించే సత్తా ఉందా ఎందుకురా నీకు ఏడుపులు

  6. బాబు తో భేటీ అయినందుకు మొన్న రజినీకాంత్ నీ తిట్టావు ఇవాళ బిల్ గేట్స్ నీ కూడా తక్కువ చేస్తున్నావ్..ఇంత విషం నింపుకున్నవెంట్రా..ఏం మందు పెట్టాడు ఆ జగ్స్ నీకు?

Comments are closed.