ప్ర‌సిద్ధ పుణ్యక్షేత్రంలో…అంద‌గ‌త్తె అడిగిన‌న్ని ద‌ర్శ‌నాలు!

అంద‌గ‌త్తె అడిగిందే మ‌హాభాగ్యంగా, ద‌ర్శ‌నాలు ఎన్నైనా క‌ల్పిస్తున్న‌ట్టు ఆ ప్ర‌సిద్ధ పుణ్య‌క్షేత్ర సంస్థ ఉద్యోగులు గుస‌గుస‌లాడుకుంటున్నారు.

ప్ర‌పంచంలోనే ప్ర‌సిద్ధ పుణ్యక్షేత్రం. ఆ స్వామిని ఏడాదిలో ఒక్క‌సారైనా ద‌ర్శ‌నం చేసుకోవాల‌ని హిందువులు భావిస్తారు. ద‌ర్శ‌నాల్లో చాలా ర‌కాలున్నాయి. వివిధ స్థాయిల్లో సిఫార్సులు లేఖ‌ల్ని అనుమ‌తిస్తుంటారు. అయితే అంద‌రికంటే ఎక్కువ సిఫార్సులు నామినేటెడ్ ప‌ద‌వి ద‌క్కించుకున్న ఆ వ్య‌క్తి చేతిలో వుంటాయి. ఆయ‌న గారిని కూట‌మిలో పెద్ద‌న్న పాత్ర పోషిస్తున్న పార్టీకి చెందిన మ‌హిళా అధికార ప్ర‌తినిధి ప్ర‌స‌న్నం చేసుకున్న‌ట్టు ఆ పార్టీ నాయ‌కులు చెబుతున్నారు.

దీంతో స‌ద‌రు అంద‌గ‌త్తె అడిగిందే మ‌హాభాగ్యంగా, ద‌ర్శ‌నాలు ఎన్నైనా క‌ల్పిస్తున్న‌ట్టు ఆ ప్ర‌సిద్ధ పుణ్య‌క్షేత్ర సంస్థ ఉద్యోగులు గుస‌గుస‌లాడుకుంటున్నారు. మ‌రోవైపు కూట‌మిలో పెద్ద‌న్న పాత్ర పోషించే పార్టీ నాయ‌కులు కూడా గుర్రుగా ఉన్నారు. క‌నీసం ఒక్క‌సారైనా త‌మ‌కు మంచి ద‌ర్శ‌నం చేసుకునే భాగ్యం క‌ల్పించ‌డం లేద‌ని, ఆ అందగ‌త్తె అడిగితే మాత్రం ఆయ‌న గారు ఎందుకిస్తున్నారో అర్థం కావ‌డం లేద‌ని విమ‌ర్శిస్తున్నారు.

మ‌రీ ముఖ్యంగా స్వామి వారి పాదాల చెంత ఉన్న అధికార పార్టీ నాయ‌కుల గోడు వ‌ర్ణ‌నాతీతం. ఎక్క‌డో ఉభ‌య‌గోదావ‌రి జిల్లాల్లో ఉన్న ఆమె సిఫార్సుల‌కు లెక్క‌లేన‌న్ని ద‌ర్శ‌నాలు ఇస్తున్నార‌ని, త‌మ‌కు మాత్రం నెల‌కో, రెండు నెల‌లో ఒక సిఫార్సు లేఖ అడిగినా క‌నిక‌రించ‌డం లేద‌ని మండిప‌డుతున్నారు.

తెలంగాణకు చెందిన మ‌రో మ‌హిళా నాయ‌కురాలు ఏకంగా స్వామి వారి పాదాల చెంత ఉన్న న‌గ‌రంలో తిష్ట‌వేసి, ఆర్థికంగా సొమ్ము చేసుకుంటున్నార‌ని అధికార పార్టీ నేత‌లే ఆరోపిస్తున్నారు. స్వామి వారి అంటే కనీస భ‌య‌భ‌క్తులు లేక‌పోవ‌డం వ‌ల్లే విప‌రీత పోక‌డ‌ల‌కు వెళ్తున్నార‌నే విమ‌ర్శ‌లు వెల్లువెత్తుతున్నాయి.

16 Replies to “ప్ర‌సిద్ధ పుణ్యక్షేత్రంలో…అంద‌గ‌త్తె అడిగిన‌న్ని ద‌ర్శ‌నాలు!”

  1. ఏదేమైనా నగరి “పిర్రల బర్రె చేసిన దర్శన యాపారం” తో కొన్ని వందల కోట్లు సంపాదించడం నభూతో నాభవిష్యత్.. నెవెర్ before & never ఆఫ్టర్..

    ‘పిర్రల పంది ఎక్కడ?? ఆ వాళ్లంతా ఊపుడు కి నేను fan అంతే..

  2. ఈ వార్త వల్ల ఏం లాభం? కనీసం క్షేత్రం పేరు రాసినా ఒక చూడదగ్గ ప్రదేశం పేరు తెలిసేది. వెన్నెముక లేకుండా వార్త లు రాస్తారు. ముందు ప్యాంటు తడిపేసుకుని అప్పుడు పెన్ను తీస్తారు. పిరికి పందులు

Comments are closed.