ప్రతి హీరోయిన్ కు ఓ ప్లాన్ ఉంటుంది. కొంతమంది తాము అనుకున్నది అనుకున్నట్టు అమలు చేయగలుగుతారు. మరికొందరు మాత్రం ప్లానింగ్ దశలోనే ఆగిపోతారు. చేతిలో సక్సెస్ ఉన్నప్పుడు మాత్రమే ప్లానింగ్ వర్కవుట్ అవుతుంది. మృణాల్ ఠాకూర్ కూడా అలాంటి ఓ ప్లాన్ సిద్ధం చేసింది.
తెలుగులో ఆమెకు మంచి పాపులారిటీ ఉంది కానీ చూపంతా బాలీవుడ్ వైపే ఉంది. ఆమె ఫిల్మోగ్రఫీ గమనిస్తే, హిందీ సినిమాకు ఆమె ఇచ్చే ప్రాధాన్యం అర్థమౌతోంది. ఈ క్రమంలో సౌత్ లో ఓ సినిమా చేస్తే అది తప్పనిసరిగా హిందీలో కూడా రిలీజ్ అయ్యేలా ఉంటేనే చేయాలని నిర్ణయించుకుంది మృణాల్.
తెలుగులో ఆమె అడివి శేష్ సరసన డెకాయిట్ సినిమాలో నటిస్తోంది. ఈ సినిమాను ఒకేసారి తెలుగు-హిందీ భాషల్లో తెరకెక్కిస్తున్నారు. తెలుగు లేదా ఇతర సౌత్ భాషల నుంచి ఇలాంటి ద్విభాషా చిత్రాలు వస్తేనే చేయాలని అనుకుంటోంది మృణాల్. అందుకే ఇప్పటివరకు ఆమె తమిళ సినిమా అంగీకరించలేకపోయింది.
తెలుగులో హిట్టయిన హీరోయిన్ కు ఆటోమేటిగ్గా కోలీవుడ్ నుంచి కూడా ఆఫర్లు వస్తుంటాయి. మృణాల్ కు కూడా అలానే వచ్చాయి. కాకపోతే కేవలం తమిళ్ కే ఫిక్స్ అయిపోవడం ఆమెకు ఇష్టం లేదు. తమిళ్ లో చేసిన సినిమా సమాంతరంగా హిందీలో కూడా రిలీజ్ అయితే చేయడానికి రెడీ. అలాంటి ప్రాజెక్టులు ఆమెకు వద్దకు రావడం లేదు.
32 ఏళ్ల మృణాల్ ప్రస్తుతం సౌత్ లో తక్కువగా, బాలీవుడ్ లో ఎక్కువగా సినిమాలు చేస్తోంది. సౌత్ సినిమాల విషయంలో ఆమె తొందరపడడం లేదు, ఆచితూచి కథలు ఎంచుకుంటోంది.
Flap
కాల్ బాయ్ జాబ్స్ >>> ఏడు, తొమ్మిది, తొమ్మిది,