న‌న్నెవ‌రూ భ‌య‌పెట్ట‌లేరుః ర‌జినీ

ప్ర‌స్తుత విజిలెన్స్ ఎస్పీ శ్రావ‌ణ్ ప్ర‌స్తుత ఎమ్మెల్సీ దువ్వార‌పు రామారావు కొడుకు

త‌న సెల్‌ఫోన్ కాల్‌డేటాను పోలీసుల ద్వారా తీసిన నీచుడు న‌ర‌సారావుపేట ఎంపీ లావు శ్రీ‌కృష్ణ‌దేవ‌రాయ‌లుది అని మాజీ మంత్రి విడ‌ద‌ల ర‌జినీ ఘాటు విమ‌ర్శ‌లు చేశారు. నాడు పోలీసులు ఇదే విష‌యాన్ని త‌మ నివేదిక‌లో పొందుప‌రిచార‌ని ఆమె అన్నారు. త‌నపై ఏసీబీ ఎఫ్ఐఆర్ కేసు న‌మోదు చేసిన నేప‌థ్యంలో ఆమె మీడియా ముందుకొచ్చారు.

వైసీపీ హ‌యాంలో అధికార పార్టీ మ‌హిళా ఎమ్మెల్యే అయిన త‌న‌కు సంబంధించి కాల్‌డేటాను తీసిన కృష్ణ‌దేవ‌రాయ‌ల్ని అప్ప‌టి సీఎం, త‌మ నాయ‌కుడు వైఎస్ జ‌గ‌న్ పిలిచి ఇదేంట‌ని మంద‌లించార‌న్నారు. దీంతో లావు కృష్ణ‌దేవ‌రాయ‌లు త‌ల‌దించుకున్నార‌ని ఆమె అన్నారు. ఆ విష‌యాన్ని మ‌న‌సులో పెట్టుకుని, త‌న‌పై వేధింపుల‌కు పాల్ప‌డుతున్నాడ‌ని ఎంపీపై ఆమె ఆరోపించారు. ఇలా ఒక ఆడ‌పిల్ల ప్రైవేసీకి సంబంధించి కాల్‌డేటాను తీస్తే, ప్ర‌తి ఒక్క అన్నా, త‌మ్ముడు ఆలోచించాల‌ని ఆమె అభ్య‌ర్థించారు.

త‌న‌పై కృష్ణ‌దేవ‌రాయ‌లుకు కాస్త కోపం ఎక్కువే అన్నారు. కార‌ణం ఎందుకో త‌న‌కు తెలియ‌ద‌న్నారు. త‌న‌తో పాటు త‌న సిబ్బంది ఫోన్‌కాల్స్‌పై పోలీసుల‌కు చెప్పి నిఘా పెట్టించార‌ని ఆమె మండిప‌డ్డారు. కూట‌మి నేత‌ల ఫిర్యాదు మేర‌కే త‌న‌పై ఏసీబీ కేసు న‌మోదు చేశార‌ని ఆమె ఆరోపించారు. రాష్ట్రంలో రెడ్‌బుక్ అరాచ‌కాలు తారాస్థాయికి చేరాయ‌ని ఆమె ఆరోపించారు.

ప‌ది నెల‌లుగా ఒకే ఫిర్యాదును ప‌దేప‌దే అంద‌రికీ ఇప్పించార‌న్నారు. ప్ర‌స్తుత విజిలెన్స్ ఎస్పీ శ్రావ‌ణ్ ప్ర‌స్తుత ఎమ్మెల్సీ దువ్వార‌పు రామారావు కొడుకు అని ఆమె చెప్పారు. ఆ ఎస్పీ ఇచ్చే నివేదిక ఎలా వుంటుందో ఒక్క‌సారి ఆలోచించాల‌ని ఆమె అభ్య‌ర్థించారు. ఆ ఎస్పీ రిపోర్ట్‌… టీడీపీ ఇచ్చే రిపోర్ట్‌గా ఆమె అభివ‌ర్ణించారు. నా క‌ళ్ల‌లో భ‌యం చూడాల‌ని అనుకుంటున్నార‌న్నారు. కానీ అలాంటి వాళ్ల‌ను చూస్తే నాకు భ‌య‌మ‌నిపించ‌దు అని ర‌జినీ తేల్చి చెప్ప‌డం గ‌మ‌నార్హం. కృష్ణ‌దేవ‌రాయ‌లూ…నీ వూరికి నా వూరు ఎంత దూర‌మో, నా వూరికి నీ వూరు అంతే దూరం అని గుర్తు పెట్టుకోవాల‌ని ఆమె గ‌ట్టి హెచ్చ‌రిక చేశారు.

21 Replies to “న‌న్నెవ‌రూ భ‌య‌పెట్ట‌లేరుః ర‌జినీ”

  1. భయపడను అంటూనే నువ్వే వార్నింగులు ఇస్తున్నావ్ ఎందుకు చిలుకా??

    2029 కి నీ సీటు ఉంటుందా? ఉంటే గెలుస్తావా?? గెలిస్తే పార్టీ అధికారం లోకి వస్తుందా?? వస్తే నీకు మంత్రి పదవి వస్తుందా??

  2. మీ ప్రభుత్వంలో , మీ ఎంపీ, మంత్రి అయిన మీ కాల్ డేటా ని అదీ పోలిసుల చేతనే తీయించాడు అంటే అప్పటి మీ ప్రభుత్వం ఎలా నడిచిందో నువ్వే చెప్పుకున్నావు .

Comments are closed.