సినిమా అనేది కేవలం వినోదం మాత్రమే కాదు, అది సమాజానికి స్ఫూర్తినిచ్చే ఓ అద్భుతమైన సాధనం. ఒక మంచి కథా- గాథ, గాఢమైన భావోద్వేగాలు కలగలిపినప్పుడు, అది మన మనస్సుల్లో నిలిచిపోతుంది.
ఇటీవల థియేటర్లలో విడుదలై విమర్శకుల ప్రశంసలు పొందిన ‘గాంధీ తాత చెట్టు’ ఇప్పుడు అమోజాన్ ప్రైమ్‌లో స్ట్రీమ్ అవుతూ చూసిన వాళ్లను ఆకట్టుకుంటోంది. దర్శకుడు సుకుమార్ కుమార్తె నటించిన ఈ చిత్రం మామూలు కమర్షియల్ చిత్రాలకు భిన్నంగా సామాజిక స్పృహను, ఆత్మగౌరవాన్ని అందరికీ పరిచయం చేస్తుంది.
కథ విషయానికొస్తే ” ఈ కథ గాంధీ అనే ఓ ధైర్యవంతమైన అమ్మాయి చుట్టూ తిరుగుతుంది. కార్పొరేట్ సంస్థలు ఊరిని కొని, పెద్ద పెద్ద ఫ్యాక్టరీలు పెట్టేందుకు ప్రయత్నిస్తాయి. ఊరి ప్రజలు డబ్బుకు ఆశపడి తమ పొలాలను అమ్మేస్తారు. కానీ గాంధీ మాత్రం తన ఊరిని ఎలాగైనా కాపాడాలని నిశ్చయించుకుంటుంది. తన తాత పేరు నిలబెట్టాలన్న సంకల్పంతో, ఊరికి కొత్త ఆశను అందించేందుకు గాంధీ చేసిన ప్రయత్నాలు ప్రేక్షకుల హృదయాలను తాకుతాయి. గాంధీ తన తెలివితో ఊరిని తిరిగి నిలబెట్టే విధానం ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటుంది.
ఈ చిత్రంలో సుకుమార్ కూతురు సుకృతి నటనకు మంచి ప్రశంసలు లభించాయి.
కాల్ బాయ్ జాబ్స్ >>> ఏడు, తొమ్మిది, తొమ్మిది,
waste movie. Entertainment undali, message unte email chuskuntadu, cinema bokka
Wt a concept