సెంటిమెంట్ ను ‘సితార’ దాటాలి

ప్రతి సారీ హిట్ టార్గెట్ ను ష్యూర్ షాట్ గా కొడతాం అనుకున్న సినిమాలు కూడా ఈ పోటీలో చిక్కుకుని అనుకున్న రేంజ్ కు చేరకపోడం అన్నది సితార నాగవంశీ బ్యాడ్ లక్.

సినిమాల విడుదల అంటే పోటీ అన్నది కామన్. సోలో డేట్ అన్ని సినిమాలకు దొరకడం అంటే చాలా మ్యాజిక్ జరగాలి. ముఖ్యంగా మంచి డేట్ సోలోగా దొరకడం అంటే కష్టమే. అయితే అన్ని పోటీలు వేరు, సితార సంస్థ నిర్మించే సినిమాలకు పడే పోటీ వేరు. ప్రతి సారీ హిట్ టార్గెట్ ను ష్యూర్ షాట్ గా కొడతాం అనుకున్న సినిమాలు కూడా ఈ పోటీలో చిక్కుకుని అనుకున్న రేంజ్ కు చేరకపోడం అన్నది సితార నాగవంశీ బ్యాడ్ లక్. ప్రతిసారీ ఏదో ఒక సినిమా అడ్డం పడుతూనే వుంటోంది.

గుంటూరు కారం సినిమా టైమ్ లో హనుమాన్ తో పోటీ పడింది. ఫలితం తెలిసిందే. గుంటూరు కారం సినిమాకు సూపర్ హిట్ కలెక్షన్లు వచ్చినా, కొంత ఇబ్బంది తప్పలేదు. లక్కీ భాస్కర్ సినిమాకు అమరన్ సినిమాతో ఇబ్బంది తప్పలేదు. వెళ్లాల్సిన రేంజ్ కు లక్కీ భాస్కర్ వెళ్లలేకపోయింది.

డాకూ మహరాజ్ టైమ్ లో సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో ఢీ అంటే ఢీ అయింది. దాంతో అక్కడ తలనొప్పి తప్పలేదు. లియో సినిమా టైమ్ లో భగవంత్ కేసరి అడ్డం పడింది. ఇప్పుడు మ్యాడ్ 2 సినిమాకు రాబిన్ హుడ్ సినిమాతో పోటీ పడుతోంది.

ఇప్పుడు ఈ గండం నుంచి గట్టెక్కాల్సి వుంది. నిజానికి రాబిన్ హుడ్ జానర్ వేరు. మ్యాడ్ 2 జానర్ వేరు. అయితే ఇక్కడ మరో రెండు సినిమాలు వున్నాయి. మలయాళ సినిమా ఎల్ 2 ఎంపరాన్ కాస్త గట్టి పోటీ ఇచ్చేలా కనిపిస్తోంది. విక్రమ్ సినిమా ధీర వీర శూర కూడా విడుదలైన తరువాత తెలుస్తుంది ఎలా వుంటుందో? మన జనాలు సినిమా బాగుంది అని తెలిస్తే చాలు అది ఏ భాష సినిమా అయినా నెత్తిన పెట్టేసుకుంటారు.

4 Replies to “సెంటిమెంట్ ను ‘సితార’ దాటాలి”

Comments are closed.