రాబిన్ హుడ్.. పక్కా కమర్షియల్ కట్

ఇంట్రస్టింగ్ కమర్షియల్ ట్రయిలర్ అనిపించుకుంటుంది రాబిన్ హుడ్ కట్.

నితిన్- శ్రీలీల- వెంకీ కుడుమల కాంబినేషన్ లో మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మించిన సినిమా రాబిన్ హుడ్. విడుదల మరో నాలుగైదు రోజుల్లో వుందనగా, ట్రయిలర్ ను విడుదల చేసారు. ట్రయిలర్ ను ఓ మంచి కమర్షియల్ కట్ గా డిజైన్ చేసినట్లు కనిపిస్తోంది. హీరో క్యారెక్టర్, హీరోయిన్ క్యారెక్టర్, వీళ్ల మధ్యలో కొన్ని ఎంటర్ టైన్ మెంట్ క్యారెక్టర్లు, ఓ విలన్ పాత్ర నీట్ గా ఫిక్స్ చేసారు. ఇటీవల చాలా ట్రయిలర్లలో కథ మొత్తం చెప్పేస్తున్నారు. కానీ రాబిన్ హుడ్ ట్రయిలర్ లో అలా చేయలేదు.

హీరో పాత్ర ఏమిటి అన్నది చెప్పారు. కానీ ఎందుకలా అన్నది దాచారు. విలన్ పాత్ర చూపించారు. హీరోతో కన్ ప్రజంటేషన్ ఎందుకు అన్నది దాచారు. హీరోయిన్ కు అంత సెక్యూరిటీ దేనికి? ట్రయిలర్ చివర్న డేవిడ్ వార్నర్ ఎంటీ ఏమిటి అన్నవి అన్నీ దాచి పెట్టారు. అంటే సినిమాలో అసలు విషయం ఏదో వుంది. దాన్ని బయటపెట్టకుండా ట్రయిలర్ కట్ చేసే ఫీట్ ను సక్సెస్ ఫుల్ గా చేసారు.

ట్రయిలర్ విజువల్స్ గ్రాండ్ గా కలర్ ఫుల్ గా వున్నాయి. ఓ భారీ కమర్షియల్ సినిమాను తెరమీద చూడబోతున్నారు అనే ఫీల్ ను కలిగించడంలో దర్శకుడు వెంకీ కుడుముల సక్సెస్ అయ్యారు. బ్యాక్ గ్రవుండ్ స్కోర్ మాత్రం రెగ్యులర్ గా వుంది. భారీ పాన్ ఇండియా యాక్షన్ లేదా ఎమోషనల్ థ్రిల్లర్ సినిమాల ఆర్ఆర్ అలవాటై, ఇక్కడ కాస్త సాదాగా వున్నట్లు అనిపించింది.

ట్రయిలర్ లో రెండు మూడు చోట్ల మంచి పంచ్ లు పడ్డాయి. మొత్తం మీద ఇంట్రస్టింగ్ కమర్షియల్ ట్రయిలర్ అనిపించుకుంటుంది రాబిన్ హుడ్ కట్.

5 Replies to “రాబిన్ హుడ్.. పక్కా కమర్షియల్ కట్”

Comments are closed.