రంగంలోకి బొత్స.. కూటమికి బ్రేక్ వేయగలరా?

చిట్ట చివరి అస్త్రంగా సీనియర్ నేత శాసనమండలిలో ప్రతిపక్ష నాయకుడు అయిన బొత్స సత్యనారాయణను వైసీపీ రంగంలోకి దించింది.

విశాఖ మేయర్ సీటుని పట్టేయాలని టీడీపీ కూటమి గట్టి పట్టుదలతో ఉంది. దానికి అవసరమైన మెజారిటీని సమకూర్చుకున్న మీదటనే అవిశ్వాస తీర్మానం నోటీసుని ఇచ్చింది అని అంటున్నారు. వైసీపీకి చెందిన మేయర్ ని దించేయాలని ఒక పధకం ప్రకారం గత కొన్నాళ్ళుగా రాజకీయం సాగుతోంది.

ఆదిలో వైసీపీకి చురుకు పుట్టలేదు. తాజాగా మరింత మంది కార్పోరేటర్లు పార్టీ మారిన తరువాత వేడి పుట్టింది. ఉత్తరాంధ్ర వైసీపీ రీజనల్ కో ఆర్డినేటర్ గా ఉన్న మాజీ మంత్రి కన్నబాబుని ప్రయోగించినా పని జరగలేదు. దాంతో చిట్ట చివరి అస్త్రంగా సీనియర్ నేత శాసనమండలిలో ప్రతిపక్ష నాయకుడు అయిన బొత్స సత్యనారాయణను వైసీపీ రంగంలోకి దించింది.

ఒక విధంగా దింపుడు కళ్ళెం ఆశ లాంటిదే ఇది అని అంటున్నారు. తమకు అవిశ్వాస తీర్మానం గెలిచేటంత మెజారిటీ ఉందని కూటమి నేతలు చెబుతున్నారు. అయితే మొత్తం సభ్యులలో మూడింట రెండు వంతుల మంది అవిశ్వాసానికి అనుకూలంగా ఓటు వేస్తేనే మేయర్ కుర్చీ దిగేది. ఆ నంబర్ చూస్తే 75 దగ్గర ఉంది. దాంతోనే వైసీపీలో కొత్త ఆశలు చిగురుస్తున్నాయి.

ఒకటి రెండు ఓట్ల తేడాతో అయినా అవిశ్వాసం వీగిపోతుందని ఆ విధంగా పూర్తి కాలం వైసీపీ మేయర్ ని తాము నిలుపుకుంటామని భావిస్తోంది. దాంతో బొత్స రంగంలోకి దిగిపోయారు. తమ వైపు ఉన్న కార్పోరేటర్లతో కలసి క్యాంప్ రాజకీయాలకు వైసీపీ తెర తీస్తోంది.

వైసీపీకి 30 మంది దాకా కార్పోరేటర్లు ఉన్నారు, వీరందరినీ తీసుకుని ప్రత్యేక క్యాంపునకు తరలించేందుకు వైసీపీ మాస్టర్ ప్లాన్ వేస్తోంది. వైసీపీ కనుక సక్సెస్ అయితే మాత్రం కూటమికి కొంత కలవరం మొదలవుతుంది అని అంటున్నారు. ఒకే ఒక్క ఓటు కూడా మేయర్ సీటుని పడగొట్టగలదు, నిలబెట్టగలదు అన్న లెక్కలు ఉన్న ఈ కీలక సమయంలో రెండు శిబిరాలూ మోహరిస్తున్నాయి. దాంతో విశాఖ రాజకీయ ఉత్కంఠ పెరిగిపోతోంది.

33 Replies to “రంగంలోకి బొత్స.. కూటమికి బ్రేక్ వేయగలరా?”

  1. మొన్నటి వరకు అన్న కి బొత్స మీద డౌట్ అన్నారు కదా….సడన్ గ నమ్మకం వచ్చేసిందా..లేకపోతె అవసరం వస్తే ఎవరినైనా దగ్గర కి తీస్తారా???

  2. పదవి నిలబడితే అన్నయ్య కి క్రెడిట్

    పదవి పోతే బొత్స ఖాతాలోకి

  3. ప్రజలు వైసిపి కి వోట్ వేశారు పాలన చెయ్య మన్నారు కానీ మీరు చేస్తుంది ఎంటి ఈ ఎంత బేరాలు ఆది ఇవి చెట్సున్నారు .టీడీపీ ఇలాంటివి చెయ్యొద్దు ప్రజలు నమ్మి ఓట్లేస్తే ఇప్పుడు ఇంది ఇదంతా

          1. Dear KUKKAA Garu,

            I want you to understand that life is not about spreading hatred or insulting others just for the sake of politics. I recognize you may be going through a difficult time, perhaps even severe depression, and I genuinely hope you find the support you need.

            However, your vulgar words—especially toward mothers—reflect poorly on you. Even the simplest of creatures can show more decency. Do you not feel ashamed of stooping to such a low level? You have a mother as well; respect for motherhood is something every person should uphold.

            I truly pity that you would degrade yourself for the sake of dishonest politicians. Still, I pray that God guides you to a better path and helps you become a kinder person.

            God bless you

      1. Dear KUKKAA GARU

        మీ మాటలు చూస్తే మీరు ఎంత హీన స్థాయికి దిగిపోయారో స్పష్టంగా తెలుస్తోంది. తల్లులను అగౌరవపరిచి ఈ స్థాయిలో వల్గర్ భాష వాడటం మీ స్వభావాన్నే కాదు, మానవత్వాన్నే దిగజారుస్తోంది. మీకూ తల్లి ఉందని ఒక్కసారైనా గుర్తుంచుకోండి. అచ్చం పశువులు కూడా మనుషులకు కన్నా ఎక్కువ దేవాలసాన్ని చూపుతాయి; అలాంటిది మీరు తల్లుల మీద తిట్ల వర్షం కురిపించడం ఎంత దారుణమో మీరు అర్థం చేసుకోాలి.

        మీ అశ్లీల పదజాలంతో మీరు మీ అనుభూతులను అసంతృప్తిగా వెళ్లగక్కుతున్నారేమో, కానీ అందుకు తల్లులను అవమానించడమంటే అత్యంత నీచమైన పని. మీరు ఈ స్థాయికి దిగజారడం చూసి నిజంగా జాలి వేస్తోంది. అత్తకి అత్త మామకోమే తేడా మండి (అనుభవించేదానికి వేరు ప్రవర్తన, అనుభవింపజేసేదానికి వేరు ప్రవర్తన), కానీ తల్లులను ఏ మనిషీ ఇలా అవమానించడానికి ఒప్పుకోవడం మంచి లక్షణం కానే కాదు.

        నేను ఆశిస్తున్నది ఒక్కటే—మీ వైఖరిని మార్చుకునేందుకు మీరు అయినా ప్రయత్నించండి. ఈ అసభ్య తిట్లతో నిత్యం మసలుతూ మరింత దిగజారిపోవడం కన్నా, నిజమైన పరిశీలన చేసుకొని మారుటనే ప్రయత్నించండి. కాదు గానీ, మిగిలిన ప్రపంచానికే కాదు, మీకెంత ముప్పు కలిగిస్తుందో మీరు తలచుకోండి.

        ఆదరించాల్సిన తల్లుల గురించి అగౌరవకరంగా మాట్లాడటం మానుకొని, నిజంగా కొంత మన్నించుకోదగిన మార్గాన్ని ఎంచుకుంటే మంచిది. లేదంటే కాలక్రమంలో మీ పరువు కరిగిపోతుంది. మీరు ఈ తరహా మాటలు వింటే మీ తల్లిదండ్రులకే ఎటువంటి బాధ కలిగుతుందో ఒక్కసారైనా ఆలోచించండి.

        దేవుని ఆశీస్సులతో, మీకిష్టమైన మార్పు త్వరగా రాకపోతే మీ మనసే మిమ్మల్ని తిట్టుకుని తీరుతుంది. మళ్లీ ఎప్పుడూ ఈ స్థాయి భాష వాడకండి. మిమ్మల్ని మీరు నీచంగా మారుకోవడం చూసి చుట్టుపక్క వాళ్లకు నవ్వుల పాలవుతారన్నది గట్టిగా గుర్తుంచుకోండి.

        మీకు మంచి బుద్ధి ప్రసాదించాలి అన్నదే నా నిజమైన కోరిక.

  4. జగన్ రెడ్డి ఒక ఫోన్ కాల్ చేస్తే గజ గాజా వనకాల్సిన కార్పొరేటర్లు.. ఇప్పుడు జగన్ రెడ్డి కి లుంగీ ఎత్తి చూపిస్తున్నారా.. హత విధీ..

    జగన్ రెడ్డి వల్ల అవలేనిది.. నత్థి సత్తి బాబు వల్ల అవుతుందంటావా..?

  5. Dear KUKKAA GARU

    మీకు చెప్పదలిచిన ఒక ముఖ్యమైన మాట ఏమిటంటే జీవితం వ్యర్థ రాజకీయాలకే పరిమితం కాదు. తల్లులను అసభ్యకర పదజాలంతో అవమానించడం ద్వారా మీరు మీ స్థాయిని తక్కువగా చూపించుకుంటున్నారు. ఇవేనా మీ సంస్కారం? మీరు తీవ్ర ఒత్తిడిలో ఉన్నారనుకోండి, కానీ అందుకు మానవత్వాన్ని వదిలేయడం సరైన రచకతకాదు.

    కుక్కలకన్నా వాటికి ఎంతో మంచితనం ఉంటుంది. ఒక వ్యక్తిగా తల్లులను గౌరవించడం మౌలిక ధర్మం. మీకూ తల్లి ఉందని గుర్తుంచుకోండి. ఈ వల్గర్ భాష వాడటం మీ మానసిక స్థాయిని మరింతగా దిగజారుస్తోంది. భ్రమపరిచే రాజకీయ నేతలకోసం ఇంత హీనమైన స్థాయికి దిగిపోవడం చూస్తే చిగురుటాకులా వణికిపోతున్నాను.

    అయినప్పటికీ, నేను దేవునికి ప్రార్థిస్తున్నాను—మీరు మళ్లీ మంచి మార్గంలో అడుగులేస్తారని. ఎప్పటికప్పుడు విచక్షణను కోల్పోవకుండా, ఒక పరిపక్వ మనిషిగా మారాలని కోరుకుంటున్నాను.

    దేవుని ఆశీస్సులు మీ మీద ఉండాలి.

Comments are closed.