పారడైజ్ ఓటీటీ @ 65 కోట్లు

ఇంకా సినిమా ప్రారంభం కాకుండానే 65 కోట్లకు కాస్త అటు ఇటుగా ఓటీటీ హక్కుల డీల్ కుదిరిపోతోంది.

సరైన గ్లింప్స్ పడాలి.. టీజర్ కట్ రావాలి. లేదా బ్యానర్ కు గుడ్ విల్ వుండాలి. అప్పుడే ఓటీటీ హక్కులు హాట్ కేక్స్ లా అమ్ముడైపోతాయి. లేదంటే సినిమా మొత్తం పూర్తి చేసుకున్నా కూడా డిస్కౌంట్ సేల్ లో పెట్టుకుని కూర్చోవాలి. టాలీవుడ్ లో ఓటీటీ రైట్స్ పరిస్థితి ఇదీ.

ఓదెల 2 అనే సినిమా మహా కుంభ్ లో టీజర్ లాంచ్ చేసింది. వెంటనే ఓటీటీ హక్కులు మంచి రేటుకు అమ్ముడుపోయాయి. 11 కోట్లకు పైగా ఓటీటీ, ఆరు కోట్లకు పైగా హిందీ హక్కులు అమ్ముడుపోయాయి. అంటే సినిమా నిర్మాణ వ్యయంలో మూడు వంతులు రికవరీ అయినట్లే.

నాని సినిమాలకు ఓటీటీ హక్కులు చాలా ఫాస్ట్ గా అమ్ముడవుతాయి. అందులో డౌట్ లేదు. లేటెస్ట్ సినిమా పారడైజ్ గ్లింప్స్ మంచి అప్లాజ్ వచ్చింది. ఇంకా సినిమా ప్రారంభం కాకుండానే 65 కోట్లకు కాస్త అటు ఇటుగా ఓటీటీ హక్కుల డీల్ కుదిరిపోతోంది. ఇదే సినిమా అడియో రైట్స్ 18 కోట్లకు సెట్ అయిందని తెలుస్తోంది. ఆఫ్ కోర్స్ ఈ పద్దెనిమిది కోట్లలో మ్యూజిక్ డైరక్టర్ అనిరుధ్ రెమ్యూనిరేషన్ గా 15 కోట్లు వెళ్లిపోతుంది. అది వేరే సంగతి.

ఈ పరిస్థితి ఇలా వుంటే సినిమా పూర్తి అయినా ఓటీటీ హక్కులు అమ్ముడు కాని సినిమాలూ వున్నాయి. ముగ్గురు హీరోల మల్టీస్టారర్ భైరవం సినిమా ఓటీటీ అగ్రిమెంట్ ఇంకా కాలేదు. ఇంద్రగంటి.. ప్రియదర్శి కాంబో సారంగపాణి జాతకం ఇంకా అమ్ముడు పోలేదు. ఇలా సినిమాలు పూర్తయిపోయి, కాపీ రెడీ అయిపోయినా బేరం సెట్ కాని సినిమాలు చాలానే వున్నాయి. ఓటీటీ బేరం తెగితే తప్ప విడుదల డేట్ పోస్టర్ పడదు.

2 Replies to “పారడైజ్ ఓటీటీ @ 65 కోట్లు”

Comments are closed.