కొంతమంది హీరోయిన్ల కెరీర్లు అర్థాంతరంగా ముగుస్తాయి. కేవలం సినిమాలు ఆడకపోవడం వల్ల, క్రేజ్ తగ్గడం వల్ల ఇలా జరగదు. మరికొన్ని ఇతర కారణాలు కూడా ఉంటాయి. ఒకప్పటి స్టార్ హీరోయిన్ వినీత కెరీర్ కూడా ఇలానే బాధాకరంగా ముగిసింది. సక్సెస్ ఫుల్ గా నడుస్తున్న సినీ కెరీర్ అర్థాంతరంగా ఆగిపోయింది.
వినీత చాలామందికి గుర్తుండే ఉంటుంది. వెంకటేష్ నటించిన ‘ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు’ సినిమాలో ఆమె హీరోయిన్ గా నటించింది. తెలుగులో ఆమెకు అది మంచి గుర్తింపు తెచ్చిపెట్టింది.
అయితే అప్పటికే ఆమె తమిళ్ లో పెద్ద హీరోయిన్. విజయ్ కాంత్, ప్రభు, శరత్ కుమార్, అర్జున్ లాంటి హీరోలతో నటించింది. మలయాళంలో కూడా అప్పటికే మోహన్ లాల్ లాంటి హీరో సరసన నటించింది.
తెలుగులో కూడా హిట్ రావడం, అదే టైమ్ లో హిందీ, కన్నడ సినిమాల్లో కూడా అడుగుపెట్టడంతో తన కెరీర్ పరుగులు పెడుతుందని ఆమె భావించింది. కానీ సరిగ్గా అప్పుడే, 2003లో ఆమెపై వ్యభిచారం కేసు నమోదైంది. తల్లి, సోదరుడితో కలిసి వినీత వ్యభిచార గృహం నిర్వహిస్తున్నట్టు పోలీసులు కేసు పెట్టారు.
వ్యభిచారం ఆరోపణలు వినీత వ్యక్తిగత జీవితంతో పాటు, ఆమె కెరీర్ ను నాశనం చేశాయి. నెలలుగా ఆమె మానసిక క్షోభ అనుభవించింది. ఆ మరుసటి సంవత్సరం కోర్టు, వినీతను నిర్దోషిగా ప్రకటించి కేసు కొట్టేసింది.
అయితే అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ఏడాదిలోనే ఆమె కెరీర్ తలకిందులైంది. స్టార్ హీరోల సరసన నటించిన వినీతను చిన్న హీరోల సినిమాల్లోకి కూడా తీసుకోలేదు. ఆ తర్వాత అతి కష్టమ్మీద ఓ 3 సినిమాలు మాత్రమే చేసిన వినీత, తనకుతానుగా నటనారంగం నుంచి తప్పుకుంది. ప్రస్తుతం ఆమె రీఎంట్రీ కోసం ప్రయత్నిస్తోంది.
వ్యభిచారం all woods లో మామూలే…ఇదేదో trap అవ్వచ్చు…గిట్టని వాళ్ళతో
కాల్ బాయ్ జాబ్స్ >>> ఏడు, తొమ్మిది, తొమ్మిది,
Ayo