మద్యానికి బానిసవ్వడానికి పెద్దగా కారణాలు అక్కర్లేదు. లవ్ ఫెయిలైతేనే మందు కొట్టాలనే రూల్ ఎక్కడా లేదు. సరదాగా మొదలుపెట్టి తాగుబోతులుగా మారిన వాళ్లు కూడా ఉన్నారు. ఇది అలాంటిందే. స్టార్ హీరో హృతిక్ రోషన్ అక్క సునైన, తన ‘మందు కష్టాలు’ చెప్పుకొచ్చింది.
ఒకానొక టైమ్ లో మానసికంగా బలహీనంగా ఉన్నప్పుడు మద్యం అలవాటు చేసుకుందంట సునైన. అప్పుడు తనకు మందు బాగా పనికొచ్చిందని, కాబట్టి డ్రింకింగ్ చెడ్డది కాదని చెప్పుకొచ్చింది. ఎప్పుడైతే డ్రింకింగ్ పై నియంత్రణ కోల్పోతామో అప్పుడు మద్యం చెడుగా మారుతుందని అంటోంది.
తను ఆ దశకు చేరుకున్నట్టు వెల్లడించింది సునైన. ఒక దశలో ఉదయం నుంచి రాత్రి వరకు మద్యం తాగుతూ ఉండేదంట సునైన. అలా తాగి తనపై తాను నియంత్రణ కోల్పోయింది. మంచంపై నుంచి, కుర్చీ నుంచి కిందపడి ఎన్నోసార్లు దెబ్బలు తగిలించుకుంది.
ఒక దశలో ఆమె పూర్తిగా అనారోగ్యానికి గురైంది. మద్యం లేకపోతే ఉండలేని పరిస్థితికి వచ్చేసింది. ఆమె తల్లిదండ్రులు రాకేష్ రోషన్-పింకీ సైతం కంట్రోల్ చేయలేకపోయారు. ఆమె క్రెడిట్ కార్డులు లాక్కున్నారు. మద్యం తాగే స్నేహితుల్ని కట్ చేశారు. అయినప్పటికీ సునైన మారలేదు.
ఎట్టకేలకు సునైన తనకుతానుగా ప్రమాదాన్ని గుర్తించింది. ఈ వ్యసనం నుంచి బయటపడాలని నిర్ణయించుకుంది. వరుసగా 28 రోజుల పాటు మద్యం ముట్టనని శపథం చేసింది. ఆ తర్వాత రీ-హేబిటేషన్ సెంటర్ లో కూడా చేరింది. కొంత చికిత్స కూడా తీసుకుంది.
అలా మద్యం తాగే వ్యసనం నుంచి పూర్తిగా బయటపడినట్టు వెల్లడించింది. ఏడేళ్ల పాటు హృతిక్ తో పాటు, తల్లిదండ్రుల్ని ఇబ్బంది పెట్టానని చెప్పుకొచ్చింది సునైన. అయితే ఆ తర్వాత ఆమె గర్భాశయ కాన్సర్ బారిన పడింది. దాన్నుంచి కూడా ఆమె కోలుకుంది.
కాల్ బాయ్ జాబ్స్ >>> ఏడు, తొమ్మిది, తొమ్మిది,
Omm