ఇప్పుడు కులాల వివరాలు రాయరుగా

జస్ట్ వన్ డే బిఫోర్ అమరావతిలో వేల కోట్ల కాంట్రాక్టులు ఫైనల్ చేశారు. అంతే, అంత వరకే. అంతే తప్ప, ఎవరికి ఇచ్చారు?

2019 నుంచి 2024 వరకు అటు ప్రధాన మీడియాలో ఇటు సోషల్ మీడియాలో ఒకటే గోల.. రెడ్డి.. రెడ్డి.. రెడ్డి అంటూ. ఒక పోస్ట్ ఇచ్చినా, ఓ కాంట్రాక్ట్ ఇచ్చినా అదే గోల. ఒక టెండర్ ఓకే చేస్తే చాలు, అది ఏ కంపెనీ? ఎవరి కంపెనీ? రెడ్డి మూలాలు ఉన్నాయా లేవా అన్నది పీకి పీకి వార్తలు రాయడం అలవాటు. అలాంటి ప్రధాన మీడియా ఇప్పుడు దాన్ని పక్కన పెట్టేసింది. అసలు తమకు తెలియనట్లే ఉంది.

జస్ట్ వన్ డే బిఫోర్ అమరావతిలో వేల కోట్ల కాంట్రాక్టులు ఫైనల్ చేశారు. అంతే, అంత వరకే. అంతే తప్ప, ఎవరికి ఇచ్చారు? ఆ కంపెనీలు ఎవరివి? అన్నది చెప్పరు.

దాదాపు 800 కోట్ల పనులు దక్కించుకున్న సంస్థ ఎంవిఆర్ ఇన్‌ఫ్రా. విశాఖ చిరునామాగా ఉన్న ఈ సంస్థ ముప్పా వెంకటరావు & కుటుంబీకులకు సంబంధించినది. ఈ సంస్థ ఆది నుంచీ తెలుగుదేశంతో ఉండటమే కాక, ఎన్టీఆర్‌ను తప్పించి చంద్రబాబు పార్టీని తీసుకున్న తర్వాత కూడా కొద్ది రోజులు ఈ సంస్థ అధినేతలు లక్ష్మీ పార్వతి-ఎన్టీఆర్‌తోనే ఉన్నారు. తరువాత సంగతి వేరే. విశాఖలో భారీ ఫ్లైఓవర్ కాంట్రాక్టులు, హైదరాబాద్‌లో గత పదేళ్లలో భారీ కాంట్రాక్టులు నిర్వహించిన సంస్థ ఇది. ఇప్పుడు ఈ సంస్థకు 800 కోట్ల మేరకు పనులు అప్పగించారు.

బీఎస్‌సీపీఎల్ అనే మరో సంస్థకు కూడా దాదాపు 800 కోట్లకు కాస్త దగ్గరగా పనులు అప్పగించారు. ఈ సంస్థ అధినేత బొల్లినేని కృష్ణయ్య.

దాదాపు 2000 కోట్లకు పైగా పనులు సంపాదించిన సంస్థ బిఎస్సార్ ఇన్‌ఫ్రా. జగపతి చౌదరి ఈ సంస్థ డైరెక్టర్. బలుసు శ్రీనివాసరావు దీని మేనేజింగ్ డైరెక్టర్.

మరో 2000 కోట్లకు పైగా పనులు సంపాదించిన సంస్థ ఆర్వీఆర్ ఇన్‌ఫ్రా. దీని అధినేత రాయల వెంకటేశ్వరరావు.

ఈ నాలుగు కంపెనీలు ఎవరివి? వాటి అధినేతలు, వారి వివరాలు అన్నది గూగుల్ చేస్తే తెలుస్తుంది.

ఇక మెఘా ఇంజినీరింగ్ సంస్థకు దగ్గర దగ్గరగా 1200 కోట్ల పనులు దక్కాయి. దీని యజమాని కృష్ణా రెడ్డి.

ఎన్‌సీసీ సంస్థకు అందరికన్నా ఎక్కువగా 2600 కోట్ల పనులు దక్కాయి. ఏఏవి రంగరాజు దీని మేనేజింగ్ డైరెక్టర్.

అదీ విషయం. 2019 నుంచి 2024 వరకు ఇలా వివరంగా రాసే మెయిన్‌స్ట్రీమ్ మీడియా ఇప్పడు ఆ పని పక్కన పెట్టడంతో ఈ వివరాలు అందించాల్సి వచ్చింది.

21 Replies to “ఇప్పుడు కులాల వివరాలు రాయరుగా”

  1. 15% కమ్మ వర్గానికి అంటే మిగితా 85% మిగితా వర్గాలకి వెళ్ళినట్లే అని ఒప్పుకున్నట్లేగా నువ్వు

  2. బహుశా గతంలో పనులు చేసినా రెడ్ల కి అన్న బిల్లులు ఇవ్వకుండా ఎగ్గొట్టాడుగా, పులివెందుల అర్బన్ డెవలప్మెంట్, సచివాలయాలు, విల్లగె క్లినిక్, నాడు నేడు విషయం లో ఎంత మంది మునిగారో తెలుసుగా. ఇక వారికి ప్రభుత్వ కాంట్రాక్టులు చేసే ఓపిక పోయి ఉంటది, అట్లుంటది అన్నతోని

  3. గత ప్రభుత్వం లో చేసిన పనులకు బిల్లులు రాక తడి ఆరిపోయి ఉంటది రెడ్లకు…అట్లుంటాది అన్నతోని

  4. నువ్వు ఇచ్చిన లిస్ట్ లొనె కమ్మ, కాపు, రెడ్డి, రాజు ఉన్నారు! ఇంకా నువ్వు చెప్పని వాళ్ళల్లొ ఎన్న్ని కులాలు ఉన్నాయొ?

    .

    మరి జగన్ లా గుంప గుత్తగా అన్ని మన మేగారెడ్ది కె ఇవ్వళ్ళి అంటావా?

  5. పొని ఈసారి కూడా జగన్ చెప్పిన వాళ్ళకె టెండెర్లు ఇవ్వాలి అంటవా గురువిందా?

  6. అప్పట్లో కాంట్రాక్టు కులాల వారి శాతం ఎంత?

    రెడ్డి కులం కి 100% వుండేవి. మిగతా కులాలకు ఎంత వుండేవి?

    ఇప్పుడు ఎంత వుంటున్నాయి ?

  7. Erri pushpam… anyone can participate in this and send their quotation… who ever gives best price will get the contract…

    Indulo kuda cast concept entra babu…

    Tender rules marchina

    Offline bidding chesina

    Govt direct reruit (mana annayalaga) chesina

    ..

    Adi tappu…

    ila chesthe adi chattam and nyayam

  8. Erri pushpam… anyone can participate in this and send their quotation… who ever gives best price will get the contract…

    Indulo kuda cast gola entra babu…

    Tender rules marchina

    Offline bidding chesina

    Govt direct recruit (mana annayalaga) chesina

    Adi tappu..

    Ila chesthe..adi rule…law and practice

  9. 100 crores budget datithe .. bidding pilavalani..anni 99crores projects ga marchi.. sontha vallaki panchi pettina mana annaya mundu ..

    Intha honesty kanapadadu meeku

  10. అరె బాబు! నీకో దణ్ణంరా సామి! అన్నయ్య పేరు చెప్పాడని, చె డ్ డి పేరు చెప్పాడని లేదా నీకు ఇష్టం లేని నీ సవతి బ్రదర్ పేరు చెప్పాడని ఎంతో మంది కామెంట్స్ ఆపేస్తావ్ కదరా, వాళ్ళతో పాటే ఈ Bhanu Rudra galla కామెంట్స్ కూడా ఆపరా బాబు. ఈ చండాలం చూడలేకపోతున్నాం.

  11. నువ్వు ఇచ్చిన లిస్ట్ లొనె కమ్మ, కాపు, రెడ్డి, రాజు ఉన్నారు! ఇంకా నువ్వు చెప్పని వాళ్ళల్లొ ఎన్న్ని కులాలు ఉన్నాయొ?

Comments are closed.