రేవంత్‌, కేటీఆర్ మ‌ధ్య ఫైర్‌!

తెలంగాణ స‌చివాల‌యం ఎదుట దివంగ‌త రాజీవ్‌గాంధీ విగ్ర‌హాన్ని పెట్టాల‌ని కాంగ్రెస్ స‌ర్కార్ భావిస్తోంది. అయితే ఆ విగ్ర‌హాన్ని తొల‌గించి, తెలంగాణ త‌ల్లి విగ్ర‌హాన్ని పెడ‌తామ‌ని బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కామెంట్స్ చేయ‌డంపై సీఎం…

తెలంగాణ స‌చివాల‌యం ఎదుట దివంగ‌త రాజీవ్‌గాంధీ విగ్ర‌హాన్ని పెట్టాల‌ని కాంగ్రెస్ స‌ర్కార్ భావిస్తోంది. అయితే ఆ విగ్ర‌హాన్ని తొల‌గించి, తెలంగాణ త‌ల్లి విగ్ర‌హాన్ని పెడ‌తామ‌ని బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కామెంట్స్ చేయ‌డంపై సీఎం రేవంత్‌రెడ్డి ఫైర్ అయ్యారు. రాజీవ్‌గాంధీ జ‌యంతి సంద‌ర్భంగా సోమాజిగూడ‌లో నిర్వ‌హించిన స‌మావేశంలో సీఎం రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ కేటీఆర్‌పై తీవ్ర‌స్థాయిలో విరుచుకుప‌డ్డారు.

సెక్ర‌టేరియ‌ట్ ఎదుట కేటీఆర్ వాళ్ల అయ్య (కేసీఆర్‌) విగ్ర‌హం పెట్టుకోవాల‌ని అనుకుంటున్నాడ‌ని మండిప‌డ్డారు. నీ అయ్య విగ్ర‌హం కోసం రాజీవ్ విగ్ర‌హాన్ని తొల‌గిస్తానంటావా? అని ఆయ‌న నిల‌దీశారు. చేత‌నైతే రాజీవ్ విగ్ర‌హంపై చేయి వేయాల‌ని ఆయ‌న స‌వాల్ విసిరారు. అధికారం వ‌స్తే అని కేటీఆర్ మాట్లాడుతున్నాడు… బిడ్డా ఇక మీకు అధికారం క‌లే అని రేవంత్ అన్నారు. ఇక మీరు చిన‌త‌మ‌డుక‌కే ప‌రిమితం అని ఆయ‌న అన్నారు.

రేవంత్‌రెడ్డి ఘాటు వ్యాఖ్య‌ల‌పై కేటీఆర్ ఎక్స్ వేదిక‌గా స్పందించారు. ఈ మేర‌కు ఆయ‌న ఒక పోస్టు పెట్టారు. అదేంటంటే…

“మీలాంటి ఢిల్లీ గులాంలు తెలంగాణ ఆత్మ గౌర‌వాన్ని అర్థం చేసుకుంటార‌ని ఆశించ‌లేం. బ‌డిపిల్ల‌ల ముందు నీచ‌మైన భాష‌ను ఉప‌యోగించ‌డం మీ నీచ‌మైన ఆలోచ‌నా విధానాన్ని ప్ర‌తిబింబిస్తోంది. మాన‌సిక అనారోగ్యం నుంచి త్వ‌ర‌గా మీరు కోలుకోవాల‌ని కోరుకుంటున్నాను అని కేటీఆర్ పోస్టు సెట్టారు. తెలంగాణ‌లో కాంగ్రెస్‌, బీఆర్ఎస్ నేత‌ల మ‌ధ్య డైలాగ్ వార్ ఏ విధంగా వుందో అర్థం చేసుకోవ‌చ్చు. బీఆర్ఎస్ నేత‌ల్ని తిట్ట‌డానికి అవ‌కాశం కోసం రేవంత్‌రెడ్డి ఎదురు చూస్తున్న‌ట్టు ఆయ‌న మాట‌ల్ని వింటే అర్థం చేసుకోవ‌చ్చు.

6 Replies to “రేవంత్‌, కేటీఆర్ మ‌ధ్య ఫైర్‌!”

  1. తెలంగాణ వచ్చిందిగా ఇక BRS అవసరం ఏముంది.అందుకే TRS పేరు మార్స్హుకున్నారు. జనాలు కూడా బాగా దించారు.

Comments are closed.