అధికారం వుంద‌ని… అహంకారంతో!

కాకినాడ మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత ద్వారంపూడి చంద్ర‌శేఖ‌ర్‌రెడ్డిని టీడీపీ, జ‌న‌సేన టార్గెట్ చేశాయి. ఎన్నిక‌ల‌కు ముందు ద్వారంపూడిపై జ‌న‌సేన అధ్య‌క్షుడు ప‌వ‌న్‌క‌ల్యాణ్ తీవ్ర సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేసిన సంగ‌తి తెలిసిందే. అక్ర‌మంగా బియ్యం…

కాకినాడ మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత ద్వారంపూడి చంద్ర‌శేఖ‌ర్‌రెడ్డిని టీడీపీ, జ‌న‌సేన టార్గెట్ చేశాయి. ఎన్నిక‌ల‌కు ముందు ద్వారంపూడిపై జ‌న‌సేన అధ్య‌క్షుడు ప‌వ‌న్‌క‌ల్యాణ్ తీవ్ర సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేసిన సంగ‌తి తెలిసిందే. అక్ర‌మంగా బియ్యం వ్యాపారం చేస్తూ నేర సామ్రాజ్యాన్ని విస్త‌రించాడంటూ ద్వారంపూడిపై ప‌వ‌న్ ఆరోప‌ణ‌లు గుప్పించారు.

కూట‌మి అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత ద్వారంపూడిని ప‌వ‌న్‌, నాదెండ్ల మ‌నోహ‌ర్ టార్గెట్ చేశారు. చౌక బియ్యాన్ని ద్వారంపూడి అక్ర‌మంగా స‌ర‌ఫ‌రా చేస్తున్నారని వారు ఆరోపించారు. ఈ మేర‌కు ద్వారంపూడి అక్ర‌మాల‌పై నివేదిక‌లు ఇవ్వాల‌ని జిల్లా ఉన్న‌తాధికారుల‌కు ఉప ముఖ్య‌మంత్రి ప‌వ‌న్‌క‌ల్యాణ్‌, మంత్రి నాదెండ్ల మ‌నోహ‌ర్ ఆదేశాలు ఇచ్చారు. మ‌రోవైపు కాకినాడ ఎమ్మెల్యే వ‌న‌మూడి కొండ‌బాబు వాళ్లిద్ద‌రికీ తోడ‌య్యారు.

ఎలాగైనా చంద్ర‌శేఖ‌ర్‌రెడ్డిని జైలుకు పంపాల‌ని అంద‌రూ వ్యూహాత్మ‌కంగా పావులు క‌దుపుతున్నారు. ఈ క్ర‌మంలో ద్వారంపూడి కాకినాడ ఎమ్మెల్యేకి బ‌హిరంగ లేఖ రాయ‌డం ప్రాధాన్యం సంత‌రించుకుంది. ఆ లేఖ‌లోని ముఖ్య అంశాలు ఏంటంటే…

“ఇటీవల జరిగిన ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం ఇచ్చిన సూపర్-6, ఇతర హామీల కారణంగా ప్రజలు మీపై ఎంతో నమ్మకం, విశ్వాసంతో కాకినాడ సిటీ శాసనసభ్యునిగా గెలిపించుకున్నారు. ఎన్నికల అనంతరం ఇచ్చిన హామీలను, ప్రజా సమస్యలను పరిష్కరించే దిశగా పని చేయాల్సింది పోయి అందుకు పూర్తి విరుద్ధంగా కక్షసాధింపు చర్యలు, నిరాధారమైన ఆరోపణలతో నాపైనా, వైఎస్సార్ కాంగ్రెస్పార్టీకి చెందిన కేడర్పైనా అనేక నిందలు వేస్తూ తప్పుడు కేసులు పెడుతున్నారు. ప్రశాంతతకు మారుపేరుగా ఉండే కాకినాడలో రాజకీయ కక్షలు ప్రేరేపించే విధంగా వ్యవహరిస్తూ కాకినాడలో కొత్త ఒరవడికి శ్రీకారం చుడుతున్నారు. కేవలం అధికారం ఉందన్న అహంకారంతో ఇష్టారాజ్యంగా వ్యవహరించడం ఎంత మాత్రం సరికాదన్న విషయాన్ని మీకు తెలియజేస్తున్నాను.

వ్యక్తిగతంగా నన్ను లక్ష్యంగా చేసుకుని చేస్తున్న ఆరోపణలు, కేసులను ఎదుర్కొనేందుకు నేను సిద్ధంగా ఉన్నాను. ఏమైనా ఆధారాలు ఉంటే వాటిని బహిరంగ పరిచి ఎన్ని కేసులు పెట్టుకున్నా అభ్యంతరం లేదు. చట్టబద్ధంగా ఎలాంటి కేసులనైనా ఎదుర్కొనేందుకు సంసిద్ధంగా ఉన్నానని తెలియజేస్తున్నాను.

రాజకీయంగా నాపై కక్ష సాధించాలనే ఉద్దేశంతో కాకినాడ రేవు నుంచి కోట్లాది రూపాయల బియ్యం అక్రమ రవాణా జరుగుతుందంటూ ఎన్నికలకు ముందు నుంచి అనేక ఆరోపణలు, దుష్ప్రచారాలు చేశారు. వ్యక్తిగతంగా నేను ఎటువంటి బియ్యం వ్యాపారంలో గానీ, రైస్ ఎక్స్పోర్టులో గానీ లేనన్న విషయం మీకు స్పష్టంగా తెలిసినప్పటికీ ఉద్దేశ పూర్వకంగా కాకినాడ రేవుపై కక్షకట్టి దాడులు చేస్తున్నారు. నన్ను ఇబ్బంది పెట్టాలనే లక్ష్యంతో కాకినాడ రేవుపై చేస్తున్న దుందుడుకు చర్యల వల్ల పోర్టుపై ఆధారపడ్డ సుమారు 30 వేల కార్మికులు, లారీ యజమానులు, బాడ్జి ఓనర్లు, ఇతర అనుబంధ రంగాలకు చెందిన కార్మిక వర్గాలు పూర్తిగా నష్టపోతున్నాయి. ఒకప్పుడు బియ్యం ఎగుమతుల్లో దేశంలోనే అగ్రస్థానంలో ఉన్న కాకినాడ పోర్టు ఇప్పుడు నిర్మానుష్యంగా మారిపోయింది. ఎగుమతులన్నీ ఇక్కడి నుంచి ఇతర పోర్టులకు తరలిపోయే పరిస్థితి ఏర్పడింది. ఇందుకు కారణం మీరు కాదా?

లారీ ఓనర్స్ అసోసియేషన్ సమీపంలోని సంజయ్ నగర్ డంపింగ్ యార్డు కేంద్రంగా గంజాయి అక్రమ రవాణా జరుగుతుందంటూ గతంలో తీవ్ర ఆరోపణలు చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంలో గంజాయి నియంత్రణకు కఠిన చర్యలు తీసుకుని అరికట్టడంతోపాటు సుమారు 70 మందిని అరెస్టులు కూడా చేయించాము. ఇప్పుడు మీరు అధికారంలోకి వచ్చినందున గంజాయిని అరికట్టేందుకు కఠినమైన చర్యలు తీసుకుంటారని ఆశిస్తున్నాను.

కాకినాడ ప్రజల ట్రాఫిక్ కష్టాలు తీర్చేందుకు మూడవ వంతెన నిర్మించే విషయంలో మీ భూములు మీదుగా వంతెన ఏర్పాటయ్యేలా ఎలైన్మెంట్ మార్చి రూ.30 కోట్లు ప్రభుత్వం ద్వారా లాభం పొందేందుకు మరోసారి ప్రయత్నిస్తున్నారు. ఈ విషయంలో మీకు ఎటువంటి స్వార్థం లేకపోతే ఏటిమొగ వెనుక నుంచి ఎలాంటి ట్రాఫిక్ సమస్యలకు ఆస్కారం లేకుండా ప్రభుత్వ స్థలాల్లో ఇళ్ళు కోల్పోకుండా ప్రతిపాదించిన బ్రిడ్జి నిర్మాణానికి చొరవ తీసుకుని మీ చిత్తశుద్ధిని నిరూపించుకోవాలి.

ఎన్నికలు పూర్తయ్యి కొత్త ప్రభుత్వం వచ్చాక ప్రజలకిచ్చిన హామీలు నెరవేర్చేందుకు కనీసం ఆరు నెలలపాటు అవకాశం ఇచ్చి ఎలాంటి విమర్శలు, ఆరోపణలు జోలికి వెళ్ళకూడదని అనుకున్నాను. అయితే మీ వ్యవహారశైలి చూస్తుంటే స్పందించక తప్పలేదు. తప్పుడు ఆరోపణలతో జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీలకు ఇస్తోన్నఫిర్యాదులు, పాల్పడుతున్న వేధింపులు అత్యంత దారుణంగా ఉన్నాయి. కాకినాడ సిటీలో జరుగుతున్న ప్రతీ అంశాన్ని నిశితంగా పరిశీలిస్తూనే ఉన్నాం. ఆరు నెలలు గడిచిన వెంటనే తగిన రీతిలో స్పందించి ప్రజలకు అండగా నిలబడతాం” అని ఘాటు లేఖ రాయ‌డం చ‌ర్చ‌నీయాంశ‌మైంది.

16 Replies to “అధికారం వుంద‌ని… అహంకారంతో!”

  1. GA జనాలు ఈమె తెలియని గొర్రెలు అనుకుని ఇవి అన్నీ చేస్తున్నావా ఏంటి ? CBN ని భూతు తిట్టాడు ద్వారంపూడి పవన్ కళ్యాణ్ ని కూడా తిట్టాడు అప్పుడే లైమ్ లైట్ లో కి వచ్చాడు లేకపోతె ఎవరి ఇతను

  2. Natural resources ను దోచుకునే, బియ్యం mafia criminals కి నువ్విచ్చే elevations మాత్రం 😂😂😂 …. excellent GA…

  3. నువ్వు పెట్టిన హేడింగ్ చూస్తె… వీడు అదికార మధంతొ వళ్ళు తెలియకుండా ప్రవర్తించిందె జనానికి గుర్తు వస్తుంది.

    అయినా అధికార మదంతొ అడ్డంగా బొక్కెసి, ఇప్పుడు ఒక్కొక్కటి భయటకి వస్తుంటె మిమ్మలని పవన్, చంద్రబాబు కాపాడలా? ఎధెక్కది న్యయం అయ్యా!

  4. వీడి అక్రమాల గురించి నువ్వు ఎప్పుడు రాయలేదు వీడి గురించే కాదు ఎవరి గురించి నువ్వు రాయలేదు అప్పుడు రాష్ట్రాన్ని మొత్తం దోచేశారు నీకు అప్పుడు కళ్ళు కనిపించలేదు

  5. వైసీపీ లో ఎవడ్ని పట్టుకున్న వొందల కోట్ల అవినీతి , హత్య రాజకీయలతో సంబంధాలు

  6. అరేయ్ ద్వారంపూడి నువ్వు కూడా నీతులు చెపుతున్నావా? అధికారం శాశ్వతం కాదని నీకు ఇప్పుడు అధికారం పోయాక తెలిసిందా? 🤮🔥😡

Comments are closed.