డిస్కషన్ లోకి మరోసారి పుష్ప 2

పుష్ప 2 సినిమా ఏనాటి నుంచో షూటింగ్ లోనే వుంటూ వస్తున్న సినిమా. ఎంత భారీ సినిమా అయినా, ఎంత పాన్ ఇండియా సినిమా అయినా ఇలా ఏళ్లకు ఏళ్లు షూటింగ్ చేయడం కాస్త…

పుష్ప 2 సినిమా ఏనాటి నుంచో షూటింగ్ లోనే వుంటూ వస్తున్న సినిమా. ఎంత భారీ సినిమా అయినా, ఎంత పాన్ ఇండియా సినిమా అయినా ఇలా ఏళ్లకు ఏళ్లు షూటింగ్ చేయడం కాస్త అనుమానించాల్సిన విషయమే. హాలీవుడ్ సినిమాల మాదిరిగా అయిదేళ్లు, పదేళ్లు తీసే మోడల్ అయితే కాదు కదా మనది. అసలు ఎప్పుడు రావాల్సిన సినిమా. ఎన్ని వాయిదాలు పడింది. హీరో బన్నీ ఏన్ని ఏళ్లుగా ఇలా ఒక్క సినిమా మీద వుండిపోతారు? అసలు ఏం జ‌రుగుతోంది?

అగస్ట్ 15 నుంచి డిసెంబర్ కు వాయిదా పడింది. దర్శ‌కుడికి, హీరోకి మధ్య సమ్ థింగ్. సమ్ థింగ్ అని వార్తలు వినిపించాయి. వదంతులు కాదు నిజ‌మే అని తరువాత వినిపించింది. ఎంతగా హీరో బన్నీ సన్నిహితుడు బన్నీ వాస్ వైపు నుంచి కవర్ చేసే ప్రయత్నం చేసినా సమ్ థింగ్ అన్నది క్లారిటీ వచ్చేసింది. అయినా కూడా పుష్ప 2 డిసెంబర్ బరిలోకి పక్కాగా వస్తుందని నమ్ముతూ వచ్చారు. ఎందుకంటే నాలుగైదు నెలల సమయం వుంది కనుక.

కానీ ఇప్పుడు మళ్లీ కొత్తగా మరోసారి వాయిదా అనే వార్తలు బలంగా వినిపిస్తున్నాయి. ఇప్పటికీ కూడా దర్శకుడు- హీరో మధ్య కమ్యూనికేషన్ గ్యాప్ అలాగే వుందనే గ్యాసిప్ లు వినిపిస్తున్నాయి. ఈ మధ్య మూడ్ బాగాలేదనో, హెల్త్ బాగాలేదనో దర్శకుడు షూట్ క్యాన్సిల్ కొట్టారనే గ్యాసిప్ లు వినిపిస్తున్నాయి. మొత్తం మీద ఏదో జ‌రుగుతోంది. డిసెంబర్ లో సినిమా రావాలంటే నవంబర్ అంతా పబ్లిసిటీకి వదిలేయాలి. సెప్టెంబర్, అక్టొబర్ వేళకు సినిమా మొత్తం పూర్తి కావాలి.

కానీ డిసెంబర్ లో గేమ్ ఛేంజ‌ర్ ఫిక్స్ అని తెలుస్తోంది. సంక్రాంతికి పెద్ద సినిమాలు వున్నాయి. ఇక మిగిలింది డిసెంబర్ తొలి వారం మాత్రమే. నాన్ స్టాప్ గా నాలుగు వారాలు దొరికే అవకాశం అయితే పుష్ప 2 కి లేదు. ఇఫ్పటికీ ఇంకా బన్నీ అంటే ఓ సెక్షన్ మెగా అభిమానులు మండి పడుతున్నారు. ముఖ్యంగా పవన్ అభిమానులు. తెలుగుదేశం అభిమానులు కూడా. ఇలాంటి పరిస్థితుల్లో సినిమా పదిశాతం తగ్గినా ట్రోలింగ్ వంద శాతం వుంటుంది.

అందువల్ల కాస్త వెనక్కు వెళ్తే మంచిదనే ఉద్దేశం కూడా వుందని వినిపిస్తోంది. వెనక్కు వెళ్లాలి అంటే సమ్మర్ తప్ప మరోటి లేదు. సంక్రాంతికి వేస్తే చాలా గడబిడ అవుతుంది ఎందుకంటే మెగాస్టార్ సినిమా వుంది. బాలయ్య సినిమా వుంది. విక్టరీ వెంకటేష్ సినిమా వుంది.

అందువల్ల మైత్రీ సంస్థ ఏం చేస్తుందో, ఇవన్నీ ఉట్టి గ్యాసిప్ లే డిసెంబర్ విడుదల పక్కా అంటుందో, లేదో చూడాలి.

7 Replies to “డిస్కషన్ లోకి మరోసారి పుష్ప 2”

  1. బన్నీ ఎవడ్రా బాబు..అని అంతా మర్చిపోయేవరకు సినిమాలు బయటకు రానిచ్చేట్టులేరే!

  2. వైసీపీ ఎన్నికల్లో గెలిచి ఉంటే

    బన్నీ “తగ్గేదేలే ” అంటూ సినిమాను ఇప్పటికే విడుదల చేయించేవాడు.

    కానీ ” ఎక్కడ నెగ్గాలో కాదు ఎక్కడ తగ్గాలో ” బాగా నేర్చుకున్న ఒక మనిషి తాను తగ్గి తనను నెగ్గేలా చేసుకొని బాగా పరీక్ష పెడుతున్నాడు.

    అహంకారం అందరికి ఉంటుంది. దాన్ని అవసరమైనప్పుడు కాలిక్రింద (ఆత్మగౌరవానికి భంగం లేకుండ)తొక్కిపట్టేవాడే విజేత అవుతాడు.

    ఒకడు అహంకారం తలకెక్కే తనతో పాటు 99 మంది తమ్ముళ్ళ ప్రాణాలు బలితీసుకున్నాడు.

    ఒక అహంకారి 140 మందిని బలిచ్చి 11గా మిగిలాడు.

    ఇప్పుడు మరో అహంకారి వంతు వచ్చింది.

Comments are closed.