వైఎస్సార్ సీపీ ప్రభుత్వ కాలంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి చాలా సన్నిహితంగా మెలగిన అధికారుల్లో ఐఏఎస్ ప్రవీణ్ ప్రకాష్ కూడా ఒకరు. సహజంగానే తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆయనను పక్కన పెట్టింది. ఈ ప్రభుత్వంతో తనకు పొసగదనే అభిప్రాయంతోనే ఉన్న ఆయన కూడా ఇంకా తనకు ఏడేళ్ల సర్వీసు మిగిలి ఉన్నప్పటికీ.. వీఆర్ఎస్ కు దరఖాస్తు చేసుకున్నారు. వెంటనే సీఎస్ నీరబ్ కుమార్ దానిని ఆమోదించడం కూడా జరిగింది.
సెప్టెంబరు 30 నుంచి అది అమల్లోకి వస్తుంది కూడా. అయితే ఇప్పుడు ప్రవీణ్ ప్రకాష్ తనను మళ్లీ సర్వీసులోకి తీసుకోవాలని కోరుతూ ప్రభుత్వం చుట్టూ తిరుగుతున్నారు. దరఖాస్తు కూడా చేసుకున్నారు. ఆయనకున్న ట్రాక్ రికార్డు పరంగా చూస్తే, ఆయన కోరిక నెరవేరడం అసాధ్యం అని అంతా అనుకుంటుండగా.. ఇలా రాజీనామా, తర్వాత మళ్లీ చేరడానికి వేడికోలు వంటి గంతులు వేయడం ద్వారా ఆయన పరువు పోతుంది కదా అని ప్రజలు అనుకుంటున్నారు.
ఏపీలోని టీచర్ల ఎదుట ప్రవీణ్ ప్రకాష్ పేరెత్తితే చాలు మండిపడతారు. ఆ రేంజిలో కీర్తిప్రతిష్టలను ఆయన మూటగట్టుకున్నారు. జగన్మోహన్ రెడ్డి తీసుకున్న అనేక వివాదాస్పద నిర్ణయాల్లో ఆయన పాత్ర ఉన్నదనే ప్రచారం ఉంది. కేవలం వివాదాస్పద అధికారిగా ఉండడం మాత్రమే కాదు.. టీచర్లను చాలా చులకనగా చూడడం ద్వారా కూడా ఆయన చెడ్డపేరు తెచ్చుకున్నారు.
ఇవన్నీ ఒక ఎత్తు అయితే.. హిందీ సినిమా పాటలకు పార్కుల్లో డ్యాన్సులు వేస్తూ రీల్స్ చేసి ఇన్ స్టా ఖాతాలో పెట్టడం లాంటి పనులు కూడా చేసి, ఐఏఎస్ అధికారిగా ఆయన హోదాకు తగని ఆటలు ఆడారు.
ఎన్నికలకు ముందు.. జగన్ పార్టీ ఓడిపోయి తెదేపా గెలిస్తే సర్వీసులో కొనసాగలేనని ఆయన అన్న వ్యాఖ్యలు కూడా ఫలితాలు తర్వత వెలుగులోకి వచ్చాయి. ఇన్ని ట్విస్టుల మధ్య ఇక ఈ ప్రభుత్వం తనను లూప్ లైన్లోనే ఉంచేస్తుందనే నమ్మకంతోనే ఆన వీఆర్ఎస్ తీసుకున్నారు. తీరా ఏం జరిగిందో ఏమో.. మళ్లీ సర్వీసులోకి తీసుకోమంటూ ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకున్నారు. అయితే ప్రభుత్వం మాత్రం అందుకు అనుమతించే ఉద్దేశంతో లేనట్టు తెలుస్తోంది.
ఆయన ఇలా తిరిగి అప్లయి చేసుకోవడం ద్వారా తన పరువు తానే తీసుకున్నారని కూడా పలువురు అంటున్నారు. చంద్రబాబు ప్రభుత్వం అనుమతించదని తెలిసినా అడగడం పరువుచేటు కదా అని వ్యాఖ్యానిస్తున్నారు.
ఆ రాజీనామా సెప్టెంబెర్ లొ అమలులొకి రావటం కాదు రా అయ్యా! రాజీనామా అమొదించిన వెంటనె అమలు లొకి వస్తుంది.
అయితె అయన తిరిగి అభ్యర్దిస్తె ప్రభుత్వం పరిశీలించవచ్చు.
లేదు సర్ ..సెప్టెంబర్ 30 న లాస్ట్ డేట్ ఆయనకీ ….మనం ఎలా జాబ్ నుండి resign చేస్తే లాస్ట్ వర్కింగ్ డే నోటీసు పీరియడ్ ని బట్టి 45-90 డేస్ ఉంటుందో ఆలా…అదీ కాకా ఐఏఎస్ లు కదా చాల పనుల్లో ముక్కు వేళ్ళు పెట్టి ఉంటారు అన్ని ఒక కొలిక్కి తేవాలి అంటే అంత సమయం పట్టడం లో అసాధారణం ఏమి ఉండకపోవచ్చు
ఇలాంటి స్టెబిలిటీ లేని వల్లనే పెట్టుకుని కదా మన అన్న అస్సాం అయిపోయింది …
ఇలాంటి స్టెబిలిటీ లేని వల్లనే పెట్టుకుని కదా మన అన్నki appadam అయిపోయింది …
ఇలాంటోళ్లని పెట్టుకునే కదా అన్న కి ఇత్తడి అయిపోయింది
కొన్ని ఆర్టికల్స్ ఇంత బాగా రాసేస్తున్నారు ఏమిటి?
సోషల్ మీడియా విభాగం ఇవ్వలేదు అన్న ఆక్రోశం….మన అనుకున్నవాడు ఇలా అప్పడం అయిపోయాడు ఏంటి అనే వైరాగ్యం ….ఇప్పటి దాక రుచి మరిగిన యాడ్ రెవెన్యూ తప్పి పోతుంది అనే బాధ ..ఇలా అన్ని కలగలిసి అసంకల్పతితం గానే రాయించేస్తున్నాయి మనోడి చేత ఇలా
కి కి కి.
ఎక్కడ చెడిందో ఏమో మరి, వెంకట్ రెడ్డి ప్యాలస్ లో కనిపిస్తే కాళ్ళు విరిచేయండి అనేత సీరియస్ ఆర్డర్వ్వేసింది వదినమ్మ అని తాడేపల్లి లో అంటున్నారు.
డబ్బా , పరువు కావాలా అంటే వైసీపీ బంట్రోతులకి డబ్బే ముఖ్యం , వీడి బాసు బ్రిటన్ పారిపోటానికి దరఖాస్తు
VC estanu 9380537747
అన్ని రహస్యాలు బయట పెడితేనే, ఉద్యోగం అనే కండిషన్ పెడితే సరి, ప్యాలెస్ పులకేశి కాజేసిన ప్రజల డబ్బు బయట పడిద్దు.
40,000/- జి.ఓ., ఇచ్చి, సుమారు 10 వేల మంది ఉసురు పోసుకున్నందుకు – తగిన శాస్తే కలగాలి.. సవతి తల్లి ప్రేమలాగ స్టేట్మెంటు చూస్తే ప్రపంచంలో ఇంత మంచి వాడు ఉంటాడా అన్నట్లు – చేసేవి అరాచకాలు – వీడి అరాచకానికి, ఐ.ఏ.ఎస్., అధికారి కూడా చనిపోయింది.. మరిచిపోయారేమో… మీ పత్రికలు ..
who … వీడి అరాచకానికి, ఐ.ఏ.ఎస్., అధికారి కూడా చనిపోయింది
No..no… these are fake news