ప్రొఫెసర్ కోదండరాం ఆదర్శం

తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడాలని ప్రజల స్వప్నం సాకారం కావడం వెనుక కీలకంగా వ్యవహరించిన వ్యక్తులలో ఉస్మానియా ప్రొఫెసర్ కోదండరాం పాత్ర విస్మరించలేనిది. తెలంగాణ రాష్ట్రానికి జాతిపితగా కేసీఆర్ ను అభివర్ణిస్తూ ఆయన అభిమానులు…

తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడాలని ప్రజల స్వప్నం సాకారం కావడం వెనుక కీలకంగా వ్యవహరించిన వ్యక్తులలో ఉస్మానియా ప్రొఫెసర్ కోదండరాం పాత్ర విస్మరించలేనిది. తెలంగాణ రాష్ట్రానికి జాతిపితగా కేసీఆర్ ను అభివర్ణిస్తూ ఆయన అభిమానులు ఎంతైనా ఊదరగొట్టవచ్చు గాక.. కానీ కెసిఆర్ తో సమానంగా రాష్ట్ర సాధనకు అవసరమైన కీలక తరుణంలో నాయకత్వం వహించిన వ్యక్తి ప్రొఫెసర్ కోదండరాం.

అన్ని పార్టీల సమన్వయంతో సంయుక్త కార్యాచరణ సమితి ఏర్పాటు చేసి, దానికి సారథ్యం వహిస్తూ రాజకీయ లబ్ధిని కోరుకునే పార్టీల వ్యవహారాలను సమన్వయం చేసుకుంటూ.. ఉద్యమాన్ని ముందుకు నడిపిన సారధి ఆయన!

పోరాటం జేఏసీ రూపంలో తారస్థాయికి చేరడం వలన మాత్రమే తెలంగాణ సాకారమైంది తప్ప, కేవలం ఒక పార్టీ పోరాటం లేదా ఒక నాయకుడి మాటల వలన జరిగినది కాదు! అలాంటి ప్రొఫెసర్ కోదండరాం రాష్ట్రం ఏర్పడిన పదేళ్ల తర్వాత తొలిసారిగా చట్టసభలోకి ప్రవేశించారు!

అక్కడ కూడా తన ప్రత్యేకతను ఆదర్శాలను ఆయన నిరూపించుకుంటున్నారు. కాంగ్రెస్ పార్టీ గవర్నర్ కోటాలో నియమించడంతో ఎమ్మెల్సీ అయిన కోదండరాం తనకు ప్రభుత్వం కల్పించే వ్యక్తిగత భద్రత ఏర్పాట్లు ఏవి వద్దని కుండబద్దలు కొట్టి చెబుతున్నారు.

తాను ప్రజల మనిషిని అని ప్రజల మధ్య తిరుగాడే వ్యక్తినని ప్రజలకు తనకు మధ్య దూరం పెంచేలాగా వ్యక్తిగత భద్రతా సిబ్బంది ఉండడం తగదని ఆయన చెప్పుకొచ్చారు. ప్రజలు తన వద్దకు వచ్చి వినతి పత్రాలు ఇవ్వదలుచుకుంటే ఈ వ్యక్తిగత భద్రతా సిబ్బంది అడ్డంగా ఉంటారని కూడా ప్రొఫెసర్ కోదండరాం చెప్పారు.

ఇలాంటి మాట చెప్పగల నాయకుడు మరొకరు మనకు ఉన్నారా అనిపిస్తుంది? ప్రభుత్వం భద్రత కల్పిస్తే నాకొద్దు అని, వారిని వెనక్కి పంపే ఎమ్మెల్యే గాని ఎమ్మెల్సీ గాని రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా లేరు. తనకు భద్రత కుదించారని, ఇంకా ఎక్కువ భద్రత ఇవ్వాలని తమను తాము ప్రజా వ్యతిరేకులుగా చేసుకుంటూ .. ప్రజలు తమ మీద దాడి చేస్తారేమో అని భయపడుతున్నట్లుగా నాయకులు తమ కోరికను వ్యక్తం చేస్తుంటారు.

అలాంటి పరిస్థితులలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన సెక్యూరిటీని వద్దని తిప్పి పంపడం ప్రొఫెసర్ కోదండరాం ప్రజా నాయకులకు చూపిస్తున్న ఆదర్శ మార్గం గా మనం భావించవచ్చు.

16 Replies to “ప్రొఫెసర్ కోదండరాం ఆదర్శం”

  1. ఇప్పుడు పదవి వచ్చింది అనో…ఇంకొక అందుకో మీరు పొగుడుతూ ఉండొచ్చు కానీ ఉద్యమ ముసుగు లో మిలియన్ మార్చ్ లో ట్యాంకుబండ్ మీద విగ్రహాల ద్వాంసం వెనుక …..కానీ సీమాంధ్రుల మీద చేసిన నిరాధారమైన ఆరోపణలు కానీ …ఈయన రెచ్చగొట్టే వ్యాఖ్యలు ద్వారా నష్టపోయిన విద్యార్థులు నిరుద్యోగులు సంఖ్య ఏమి తక్కువ కాదు …తెలంగాణ యువత ఆత్మ బలిదానాల్లో ఈయన పాత్ర లేకపోలేదు….మరీ ఎక్కువ పొగిడేయకండి….మీ మీడియా తో ఇదే బాధ ఎవరు ఎప్పుడు ఎందుకు నచ్చుతారో తెలీదు ..ఎందుకు నెత్తినపెట్టుకుంటారో తెలియదు

    1. అ౦త పెద్ద ఉద్యమం లో ఒకటి రెండు చిన్న స౦ఘటనలను చూపెడుతూ ఏదో జరిగిందని గగ్గోలు పెడుతు కోద౦డరా౦ లాంటి ప్రజల మనిషిపై అహేతుక విమర్శలు సరికాదు. గత పదేళ్ళ ప్రయాణం లో ఆ౦ధ్రప్రదేశ్ లో జరిగిన స౦ఘటనలను గుర్తుకు తెచ్చుకొని మాట్లాడితే బాగుంటుంది .

    2. Professor గా ఉంటూ.. ప్రభుత్వ జీతం తీసుకుంటూ క్లాసులు తీసుకోకుండా.. కేవలం జీతం మాత్రం తీసుకుంటూ.. విద్యార్థులను.. రెచ్చగొట్టి ఉద్యమం అంటూ రెచ్చ గొట్టి.. కాలేజీ కి వెళ్లకుండా.. రోడ్ల మీదే ఉండిపోయాడు ఈ ప్రొఫెసర్! వీడు నీతి సూక్తులు చెప్పటం!

  2. రోషం ఉన్న ఆంధ్రా వాడు ఎవరూ వాడి పేరు తల్చుకోరు, తల్లి కాంగ్రెస్ దగ్గర ఉన్నాడు కనుక మీకు అభిమానం పొంగి పొరలుతుంది, కులం కూడా కారణం కావచ్చు!

  3. Yekkadaki vellina paradhalu kattukoni, chetlu narikinchesi, intiki 30 adugula yetthuna godalu kattukune nayakula gurinche kadha chepthunnav…

    ఇంకా ఎక్కువ భద్రత ఇవ్వాలని తమను తాము ప్రజా వ్యతిరేకులుగా చేసుకుంటూ .. 
    ప్రజలు తమ మీద దాడి చేస్తారేమో అని భయపడుతున్నట్లుగా నాయకులు తమ కోరికను వ్యక్తం చేస్తుంటారు.
  4. అంటే మనొడు విపరీతమైన సెక్యూరిటి పెట్టుకున్నాడు, మనొడు ప్రజల మనిషి కాదు అని ఇండైరెక్ట్ గా చెప్తున్నారా?

Comments are closed.