దువ్వాడ పోస్ట్ పాయే!

శ్రీకాకుళం జిల్లా టెక్కలికి చెందిన వైసీపీ ఎమ్మెల్సీ, టెక్కలి నియోజకవర్గం వైసీపీ ఇంచార్జ్ అయిన దువ్వాడ శ్రీనివాస్ పోస్ట్ ని తీసేసి ఆ పార్టీ అధినాయకత్వం షాక్ ఇచ్చేసింది. దువ్వాడను టెక్కలి ఇన్చార్జి పదవి…

శ్రీకాకుళం జిల్లా టెక్కలికి చెందిన వైసీపీ ఎమ్మెల్సీ, టెక్కలి నియోజకవర్గం వైసీపీ ఇంచార్జ్ అయిన దువ్వాడ శ్రీనివాస్ పోస్ట్ ని తీసేసి ఆ పార్టీ అధినాయకత్వం షాక్ ఇచ్చేసింది. దువ్వాడను టెక్కలి ఇన్చార్జి పదవి నుంచి తప్పించింది. ఆ ప్లేస్ లో పేడాడ తిలక్ ని కొత్త ఇంచార్జి గా నియమించింది.

దీంతో పార్టీ పరంగా దువ్వాడ శ్రీనివాస్ మీద వైసీపీ తీసుకున్న తొలి యాక్షన్ గా దీనిని చూస్తున్నారు. దువ్వాడ శ్రీనివాస్ వ్యక్తిగత ఇబ్బందులలో పడడం, ఆయన సతీమణి దువ్వాడ వాణి ఆయన ఇంటి ముందు ఆందోళన చేయడం మరో మహిళతో సాన్నిహిత్యంగా ఉంటున్నారు అన్న ఆరోపణలు రావడంతో వైసీపీ పూర్తిగా ఇరకాటంలో పడింది.

దీనిని ఆసరాగా చేసుకుని టీడీపీ సోషల్ మీడియా యాక్టివిస్టులు వైసీపీని బదనాం చేసే విధంగా వ్యవహరించడంతో వైసీపీ అలెర్ట్ అయింది. దువ్వాడను ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయమని కూడా పార్టీ ఆదేశించినట్లుగా వార్తలు వచ్చాయి. అయితే దువ్వాడ ఎమ్మెల్సీగానే కొనసాగుతున్నారు.

ఇపుడు యాక్షన్ పార్ట్ లో మొదటి అడుగుగా ఆయనకు ఉన్న ఇంచార్జి పదవిని వైసీపీ తొలగించింది. ఎమ్మెల్సీ పదవికి దువ్వాడ రాజీనామా చేయకపోతే ఆయనను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తారా అన్న చర్చకు తెర లేస్తోంది. పార్టీ ముఖ్యం. తరువాత ఎవరైనా అని అధినాయకత్వం భావిస్తోంది. దువ్వాడ ఎపిసోడ్ లో ఇప్పటికే యాక్షన్ లేట్ అయింది అని కూడా అంటున్నారు. ఇవన్నీ చూస్తుంటే వైసీపీకి దువ్వాడ దూరం అవుతారా లేక ఆయనను దూరం పెడతారా అన్నది మరి కొద్ది రోజులలో తేలిపోతుందని అంటున్నారు.

దువ్వాడ ప్లేస్ లో కొత్త ఇంచార్జిగా నియమితుడైన పేడాడ తిలక్ 2019 ఎన్నికల్లో టెక్కలి నుంచి వైసీపీ ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో శ్రీకాకుళం ఎంపీగా పోటీ చేసి పరాజయం పాలు అయ్యారు. అయితే ఆయన కూడా దువ్వాడ కులస్థుడు కావడంతో పాటు సామాజిక సమీకరణలు అన్నీ చూసుకున్న మీదటనే వైసీపీ ఈ నిర్ణయం తీసుకుంది అని అంటున్నారు.

8 Replies to “దువ్వాడ పోస్ట్ పాయే!”

  1. శీను, నీకు ఇంత అవమానం జరిగితే ఊరుకుంటావా లేక వాణ్ణి గు’ద్ధ మీద 11 తన్ని, నీలి పార్టీ నుండి బైటపడతావా??

  2. “నా భార్య కూతురు ఎదురు నిలిచారని తెలిసి కూడా టికెట్ నాకే ఇచ్చి ప్రచారం లో పక్కన నిలబెట్టుకుని మరీ, నన్ను మంచివాడు, రాముడు లాంటి వాడు అంటూ బాగా దువ్వి, ఇప్పుడు ఉన్న పదవి ఊడ పెరిగితే.. నీ ప్యాలస్ లో “గోరంట్ల గుసగుసల లీలలు” బయటికి తీస్తా ల0గా Leven గా” — దువ్వడ.

  3. గెలవలేదని, భార్య అండ్ కూతురు ఎదురు నిలిచారని నన్ను పీకేస్తావా??

    నీ తల్లీ, చెల్లి ఎదురు నిలిచారు కదరా పొట్టి పకోడీ? నువ్వు నీ ఫ్యామిలీ లో సక్కగా ఉండక party ని ఓడించావ్.. నీకేం శిక్ష వెయ్యాలి మరి?? నిన్నూ పీకెయ్యాలి అవునా కాదా?? – దువ్వాడ

Comments are closed.