హీరో కిరణ్ అబ్బవరం, హీరోయిన్ రహస్య మొన్నటివరకు ప్రేమికులు. ఇప్పుడీ జంట భార్యాభర్తలుగా మారారు. కర్నాటకలోని కూర్గ్ లో వీళ్ల పెళ్లి ఘనంగా జరిగింది. టాలీవుడ్ కు దూరంగా, కుటుంబ సభ్యుల సమక్షంలో ఓ ప్రైవేట్ రిసార్ట్ లో వీళ్లిద్దరి పెళ్లి సంప్రదాయబద్ధంగా జరిగింది.
సంప్రదాయ పద్ధతిలో తెల్లటి వస్త్రాన్ని గొడుగుగా మార్చి కిరణ్ అబ్బవరంను పెళ్లి మంటపానికి తీసుకొచ్చారు. అటు రహస్య గోరక్ ను కూడా సంప్రదాయ పద్ధతిలో ఓ బుట్టలో కూర్చోబెట్టి మోసుకుంటూ మండపంపైకి తీసుకొచ్చారు. వేద పండితుల మంత్రోచ్ఛారణల మధ్య రహస్య మెడలో మూడు ముళ్లు వేశాడు కిరణ్. ఆమెను తన అర్థాంగిని చేసుకున్నాడు.
రాజావారు రాణిగారు సినిమాతో వీళ్లిద్దరూ కలిసి నటించారు. హీరోగా కిరణ్ అబ్బవరంకు, హీరోయిన్ గా రహస్యకు అదే తొలి సినిమా. అప్పట్నుంచి ఇద్దరూ క్లోజ్ అయ్యారు. రిలేషన్ షిప్ లో ఉన్నప్పటికీ ఐ లవ్ యు చెప్పుకోలేదు ఈ జంట. రిలేషన్ షిప్ మొదలుపెట్టిన ఏడాదిన్నర తర్వాత చెప్పుకున్నారు.
అప్పట్నుంచి బాహ్య ప్రపంచానికి తెలియకుండా ప్రేమించుకుంటున్న ఈ జంట, ఈ మధ్య నిశ్చితార్థం చేసుకుంది. ఇప్పుడు పెళ్లితో వైవాహిక బంధంలోకి అడుగుపెట్టింది. ఇక సినిమాల విషయానికొస్తే.. కిరణ్ నటిస్తున్న ‘క’ అనే సినిమా విడుదలకు సిద్ధమైంది
జనం పట్టించుకోరు
Call boy jobs available 8341510897
Venu swami yekkada ? pilipichnadi
Good joke
vc available 9380537747