మరింత కీలకంగా చెవిరెడ్డి! ఏం సాధించడానికి?

పార్టీ తీసుకునే నిర్ణయాలు చాలా వాటి వెనుక చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కీలక హస్తం ఉన్నది.

ఎన్నికల్లో ఘోర పరాజయం తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని పునర్వ్యవస్థీకరించడానికి అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డి కసరత్తు చేస్తున్నట్లుగా కనిపిస్తుంది. ఇందులో భాగంగా పార్టీ కీలక స్థానాలలో ఉండే నాయకులను ఆయన మారుస్తున్నారు.

ఈ ప్రక్రియలో భాగంగా రాయలసీమకే చెందిన, అది కూడా ఇరుగుపొరుగు జిల్లాల వారైన ముగ్గురు నాయకులకు రాష్ట్ర ప్రధాన కార్యదర్శులుగా అవకాశం కల్పించడం విశేషం. వీరిలో పార్టీ పరాజయం వెనుక కీలక కారకులలో ఒకరుగా ముద్రపడిన చెవిరెడ్డి భాస్కర రెడ్డిని మరింత పెద్ద బాధ్యతలోకి తీసుకోవడం కూడా వివాదాస్పదం అవుతోంది.

చెవిరెడ్డి భాస్కర రెడ్డి గత ఎన్నికలలో ఒంగోలు నుంచి ఎంపీగా పోటీ చేశారు. చంద్రగిరి నియోజకవర్గంలో ఆయన మీద వ్యతిరేకత ఉన్నదని సర్వేల్లో తేలడంతో, కొడుకు మోహిత్ రెడ్డిని అక్కడ పోటీ చేయించారు. తండ్రి కొడుకులు ఇద్దరు కూడా ఈ ఎన్నికల్లో ఓడిపోయారు.

అయితే పరాజయ పర్వం కేవలం వారితో మాత్రమే కాకుండా చెవిరెడ్డి పుణ్యమా అని పార్టీ అంతటికి వ్యాపించిందని ఆరోపణలు ఉన్నాయి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి స్వయంగా తన ఫీడ్ బ్యాక్ కోసం రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన అనేక ఎన్నికల సర్వేలు చెవిరెడ్డి సారథ్యంలోనే సాగాయి.

చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఒక అతి పెద్ద యంత్రాంగాన్ని ఏర్పాటు చేసుకుని, వ్యక్తులను నియమించుకుని రాష్ట్రవ్యాప్త సర్వేలకు సారథ్యం వహిస్తూ వచ్చారు. ఆ రకంగా పార్టీ తీసుకునే నిర్ణయాలు చాలా వాటి వెనుక చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కీలక హస్తం ఉన్నది. పార్టీ వ్యూహాల నిర్మాణంలో చెవిరెడ్డి చేయించిన సర్వేల ప్రభావం కూడా ఉన్నది. వీటన్నింటి నేపథ్యంలో పార్టీ పరాజయానికి చెవిరెడ్డి కూడా కారణమయ్యారని ఆరోపణలు ఉన్నాయి.

సర్వేలలో వచ్చిన ఫలితాలను ఉన్నది ఉన్నట్టుగా కాకుండా అధినేత సంతోషం కోసం మార్చి తెలియజేస్తూ తద్వారా పార్టీకి చేటు చేశారనే ప్రచారం ఉంది. అలా చెవిరెడ్డి మీద సొంత పార్టీలోనే అనేక ఆరోపణలు ఉన్నప్పటికీ ఆయనకు సంస్థాగత ప్రమోషన్ ఇచ్చి పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా నియమించుకోవడం వెనుక జగన్ ఆంతర్యం ఏమిటో ఎవరికి బోధపడడం లేదు.

ఓటమికి సారథ్యం వహించిన టీం సభ్యులను మరింత కీలక స్థానాల్లోకి తీసుకొని ఏ రకంగా పార్టీని విజయం వైపు నడిపించాలని జగన్ అనుకుంటున్నారో తెలియడం లేదు.. అని పార్టీ కార్యకర్తలే విస్తుపోతున్నారు.

22 Replies to “మరింత కీలకంగా చెవిరెడ్డి! ఏం సాధించడానికి?”

  1. ఏమిటో వైకాపా లో అన్ని అన్నకి తెలీకుండా నే జరిగిపోతుంటాయి…అన్న కి తెలీకుండానే పదవులు ఫిల్ ఐపోతుంటాయి….పార్టీ నాయకులూ సర్వేలు నివేదికలు మడతపెట్టేస్తుంటారు…..ఇంకా ఎన్నో ఎన్నెన్నో …మీరు ఇచ్చే ఎలివేషన్స్ కి మీరు రాసె రాతలకి ఏమైనా సంబంధం ఉండిందా అసలు ????

  2. యె*ర్ర చంద*నం స్మగ్లిం*గ్ కిం*గ్ బాగా డబ్బు చేశాడు.. కనీసం 86,589 కోట్లు ఆస్తులు కూ దబెట్టారు అని, ఇండియా లో యే రాజకీయ నాయకులకి లేని విధంగా , ఏకంగా అమెరికలో లో లాస్ ఏంజిల్స్ లో కాసినో కొనేశారు అని మన రెడ్డి కురాళ్ళు తన్మయత్వం తో చెబుతున్నారు.

    ప్యాలస్ పులకేశి బెంగళూర్ కి వెళ్ళే ప్రతిసారి ఆ విమాన ప్రయాణం టిక్కెట్లు ఖర్చు మొత్తం చెవిలో గులిబి రెడ్డి దే అని ప్యాలస్ వర్గాల గుసగుసలు.

  3. ప్రతి వారం ప్యాలస్ పులకేశి బెంగ*ళూర్ ప్రయా*ణం టిక్కె*ట్లు ఖర్చులు అన్ని పెట్టుకునే యెర్ర చడ*నం స్మ*గ్లింగ్ కిం*గ్ చె*విలో గులి*బి రె*డ్డి గారు కి ఆమాత్రం పద*వులు ఇవ్వక*పోతే ఎ*లా!

  4. వైఎస్ఆర్ పార్టీ లో దళిత నాయకులు కి బానిసలు అన్న మాట. వాళ్ళకి పదవులు వుండవు, కేవలం రెడ్డి దొర లకి కాళ్ళు వొట్టడానికి మాత్రమే..

    1. పదవులున్నా అధికారాలుండవు .

      చెక్క గాడి దగ్గర ఐదు మంది డిప్యూటీలున్నారు .

      వాళ్ళ పేర్లు కూడా ఎవ్వరికీ తెలియదు

  5. వాడికి రాజకీయ పరిజ్ఞానం ఉంటే కదా ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నాడు అని అనుకోవటానికి. ఏదో అలా కలిసొచ్చింది…. తనలాంటి ఎర్రిపుష్పాలనే కీలక పదవులలో నియమించుకోవటానికి కారణం మంచి నిబద్ధత గల నాయకుడైతె తాను పలుచన అవుతానని అలాంటి తేడా మాడా నాయకులని పెట్టుకుంటున్నాడు.

  6. ఈడిది మాట మీద నిలబడ’లేని, విశ్వసనీయత అసలే ‘లేని కుక్క’ వంకర బుద్ధి.. అని Andra జనాలు తెలుసుకున్నారు కాబట్టే లోతుగా 11 inchulu dimpaaru. ఇంకా నమ్ముతారు anukovadam నీ నీలి భ్రమ..

    1. Avunu nijame chikatlo morige kukka

      Bolli Babu garu chanipoyentavaraku aayane CM ga ”EVM” Votes tho gelustooooo vundali.

      Appude manaki ”Kammaga” nidra padutundi.

  7. నా సర్వేలు దె0గాయని & ఎంపీ గా గెలవలేదని నన్ను పీకేయాలా?

    నీ ఇంట్లో సమస్యలు పరిష్కరించక, నీ తల్లీ, చెల్లి ఎదురు నిలిచారు కదరా పొట్టి పకోడీ? నువ్వు నీ ఫ్యామిలీ లో సక్కగా ఉండక party ని ఓడించావ్.. నీకేం శిక్ష వెయ్యాలి మరి?? నిన్నూ పీకెయ్యాలి అవునా కాదా?? – చెవి

  8. మా చెవిరెడ్డి తో సర్వే ల పేరుతో గొ’డ్డు చాకిరీ చేయించుకుని ఇప్పుడు వదిలేయడం “న్యాయం అండ్ ధర్మం” కాదు..

    అందరి గుట్టు ముట్లు తెలుసు

    దీని ఫలితం త్వరలో తెలుస్తుంది.. ‘ఖబడ్దార్..

    Ex: vijaya “సాయి” ఎలా విజయ”శాంతి”రెడ్డి గా మారాడో తెలిసి కూడా..!!??

    త్వరలో ఇంకో బిగ్ ‘బ్లాస్టింగ్ న్యూస్..

    1. Avunu me nanna valla Amma kodali tho Maro ycp nayakudu oyo room lo addanga dorikadanta idi flash news

      Vooru Peru lekunda nela chikatlo brathike langa na dash gadi kanna

      40% votes techukunna jagan chala great.

      Any way me Evm cm ni buildup lu dabba kottukovadam mani administration paina concentrate cheyamani cheppu

Comments are closed.