రెడ్ల‌ను ఏకం చేయ‌డం ఎలా?

ఎన్నిక‌ల్లో సొంత సామాజిక వ‌ర్గం వ్య‌తిరేకంగా చేసింద‌ని వైసీపీ అధినేత వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి భావిస్తున్నారు. ఇదే స‌మ‌యంలో చంద్ర‌బాబు సామాజిక వ‌ర్గం టీడీపీ విజ‌యం కోసం ఏక‌మైంద‌ని కూడా జ‌గ‌న్ గుర్తించారు. త‌న సామాజిక…

ఎన్నిక‌ల్లో సొంత సామాజిక వ‌ర్గం వ్య‌తిరేకంగా చేసింద‌ని వైసీపీ అధినేత వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి భావిస్తున్నారు. ఇదే స‌మ‌యంలో చంద్ర‌బాబు సామాజిక వ‌ర్గం టీడీపీ విజ‌యం కోసం ఏక‌మైంద‌ని కూడా జ‌గ‌న్ గుర్తించారు. త‌న సామాజిక స‌మీక‌ర‌ణ‌లు వ‌ర్కౌట్ కాలేద‌ని, ఎక్క‌డ లోప‌మ‌ని జ‌గ‌న్ సీరియ‌స్‌గా ఆలోచిస్తున్నారు. గ‌తఃగ‌త‌హాః అని, ఎన్నిక‌ల్లో మెజార్టీ రెడ్లు మ‌ద్ద‌తు ఇవ్వ‌క‌పోవ‌డాన్ని వ‌దిలేసి, భ‌విష్య‌త్‌లో అంద‌రినీ ద‌గ్గ‌రికి తీసుకోవ‌డంపై అత్యంత స‌న్నిహితుల‌తో జ‌గ‌న్ చ‌ర్చించారని తెలిసింది.

ముఖ్యంగా రియ‌ల్ ఎస్టేట్‌, విద్యా, కాంట్రాక్ట్ రంగాల్లో ఉన్న రెడ్డి సామాజిక వ‌ర్గం జ‌గ‌న్ పాల‌న‌లో దెబ్బ‌తింది. ఇదే విష‌యాన్ని జ‌గ‌న్‌కు వివ‌రించార‌ని తెలిసింది. వైసీపీ ప్ర‌భుత్వ విధానాలు సొంత సామాజిక వ‌ర్గాన్ని కోలుకోలేని విధంగా దెబ్బ‌తీయ‌డంతో వారంతా ప్ర‌త్య‌ర్థుల‌కు అండ‌గా నిలిచార‌ని జ‌గ‌న్‌కు ముఖ్యులు వివ‌రించార‌ని స‌మాచారం. మ‌రోవైపు చంద్ర‌బాబు సామాజిక వ‌ర్గంపై ర‌క‌ర‌కాల దాడుల‌తో వాళ్లంద‌రినీ గ‌తంలో ఎప్పుడూ లేని విధంగా ఏకం చేసిన ఘ‌న‌త జ‌గ‌న్‌కే ద‌క్కింది.

అలాగే ప‌వ‌న్‌క‌ల్యాణ్ వ్య‌క్తిగ‌త జీవితంపై ప‌దేప‌దే జ‌గ‌న్ విమ‌ర్శ‌లు చేసి, ఆయ‌న సామాజిక వ‌ర్గాన్ని పూర్తిగా వ్య‌తిరేకం చేసుకున్నారు. ఇక ఉద్యోగుల విష‌యాన్ని చెప్పాల్సిన ప‌నిలేదు. అలాగే మందుబాబులు మొద‌లుకుని, ప్ర‌తి ఒక్క‌ర్నీ శ‌త్రువుగా చేసుకున్న వైనాన్ని ఇటీవ‌ల జ‌గ‌న్‌కు కొంద‌రు స‌న్నిహితులు వివ‌రించారు. వ్య‌వ‌స్థ‌ల్ని వ్య‌తిరేకం చేసుకున్నామ‌ని, అందుకే ఇలాంటి ఓట‌మిని మూట‌క‌ట్టుకున్నామ‌ని జ‌గ‌న్‌కు కుండ‌బ‌ద్ధ‌లు కొట్టిన‌ట్టు కొంద‌రు స‌న్నిహితులు చెప్పార‌ని తెలిసింది.

ఈ నేప‌థ్యంలో ఓట‌మికి దారి తీసిన ప‌రిస్థితుల‌పై జ‌గ‌న్ కూడా ఆవేద‌న చెందార‌ని స‌మాచారం. ముందుగా సొంత సామాజిక వ‌ర్గాన్ని తిరిగి ద‌గ్గ‌రికి తీసుకోవాల‌ని జ‌గ‌న్ భావిస్తున్నార‌ని తెలిసింది. దీని కోసం ఏం చేయాల‌ని జ‌గ‌న్ స‌న్నిహితుల్ని ప్ర‌శ్నించార‌ని స‌మాచారం.

ప్ర‌స్తుతానికి చేసేదేమీ లేద‌ని, ఆరు నెల‌లు చంద్ర‌బాబు పాల‌న ఇట్లే సాగితే, తాను చేయాల్సిన ప‌ని గంధ‌ర్వులు చేసిన‌ట్టు అన్నీ చ‌క్క‌బ‌డుతాయ‌ని జ‌గ‌న్‌కు వివ‌రించార‌ని స‌మాచారం. ఆ అభిప్రాయంతో జ‌గ‌న్ కూడా ఏకీభ‌వించిన‌ట్టు తెలిసింది. త‌న వైపు నుంచి తెలియ‌కుండానే కొన్ని తీవ్ర‌మైన త‌ప్పులు జ‌రిగాయ‌ని ఇప్పుడిప్పుడే జ‌గ‌న్ రియ‌లైజ్ అవుతున్నారు.

కేవ‌లం చంద్ర‌బాబు ఫెయిల్యూర్‌తోనే తాను అధికారంలోకి రావాల‌ని జ‌గ‌న్ అనుకోవ‌డం లేదు. పార్టీని బ‌లోపేతం చేయ‌డంతో పాటు మ‌ళ్లీ జ‌నానికి ద‌గ్గ‌రైతేనే అధికారం సిద్ధిస్తుంద‌నే క్లారిటీకి జ‌గ‌న్ వ‌చ్చారు. రానున్న రోజుల్లో జ‌గ‌న్ యాక్ష‌న్ ప్లాన్ ఎలా వుంటుందనేది ఆస‌క్తిక‌రంగా మారింది.

33 Replies to “రెడ్ల‌ను ఏకం చేయ‌డం ఎలా?”

  1. అదేంటి కొత్తగా ఆణిముత్యం ముద్రగడ పద్మనాభ రెడ్డి ని నీచుడు జగన్ రెడ్డి పార్టీ లో చేరాడు కదా ఇంకా ఎక్కడ వేరుగా ఉన్నారు ఏకం చేయటానికి ?

  2. ఏమీ అక్కర్లేదు, చచ్చినట్లు సపోర్ట్ చేస్తారు సొంత కులం కనుక, మైనారిటీ లు, రిజర్వేషన్ కులాల నే పట్టుకోండి!

  3. ముఖ్య మంత్రి గా పని చేసిన వ్యక్తి కి ఇవన్నీ సన్నిహితులు చెప్తే కానీ తెల్వద??

  4. ఎందరో మంచి మంచి రెడ్లను వొదిలేసి, ఈ జగన్ రెడ్డి ను పట్టుకు వెలాడుతున్నారు. ఆలోచించుకోండి, లేదా ఎవరి కర్మకు వాళ్ళే బాధ్యులు.

  5. ఇంకేంటి GA…. ఆ సోఫా కిందే ఆనందంతో వుబ్బి తబ్బిబ్బు ఐపోయివుంటావ్ గా….😂😂….ALREADY దెబ్బతిన్న వాళ్ళని మళ్ళీ ఎలా మోసం చెయ్యాలి అని ఆలోచిస్తున్నారు అంటావ్…😂😂😂…. బావుంది GA…

      1. ఈ వి ఎమ్ లు గెలిపించా యి చంద్ర బాబు ని మోడీ జీ ని ప్రజల అమాయక త్వం వల్ల న్యాయ వ్యవస్థ లు నిద్ర పోవటం వల్ల

  6. “ఇప్పుడిప్పుడే జ‌గ‌న్ రియ‌లైజ్ అవుతున్నారు” – Hope is the greatest thing for Cheddi batch but he is a psycho. look at the hospital visit smile face yesterday…

    lack of empathy..

  7. చేతనైతే మొత్తం ప్రజలందరినీ ఏకం చేయమను. అది చెయ్యలేడు ఎందుకంటే ప్రతిపక్ష నాయకుల్ని వెంటాడి వెంటాడి అణగతొక్కాడు ఏ కులపోడైయినా. ఆ బుద్దులు ఇప్పట్లో పోవు.

    అయినా శ్రీ సిటీ లో భూములున్న రెడ్లు, దాన్ని డెవలప్ చేస్తున్న బాబు కి సపోర్ట్ చేస్తారు కానీ జగన్ కి కాదు.

  8. వై సీ పీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ పై పార్టీ అధిష్ఠానం వేటు వేసింది. టెక్కలి వై సీ పీ ఇన్ఛార్జి బాధ్యతల నుంచి తొలగించింది.

    మరి విజయ్ సాయి మీద ఎందుకు వేటు వేయలేదు..? అంటే ఇలాగానే ఏకం హేయడం అంటే !

  9. Bc కులాన్ని చిన్న చూపు చూస్తున్న వై చీపి

    ఒక bc కులస్తుడు అయినా దువ్వాడ కి ఒక న్యాయం

    రెడ్డి కులస్తుడు అయిన విజయ సాయి కి ఒక న్యాయమా!

    bc నాయకులకు ఇవి కనపడడం లేదా

    శ్రీను అన్నా, మాధురి ఆంటీ నిగ్గు తీసి అడుగు నీ జగనన్నని..

  10. They are all firmly united and behind kootami. Ika moosuko ra GA. Reddies know they cannot run their own parties now. It is only Kootami run by TDP and Janasena. Future is with Janasena and many Reddies are now making queue lines to catch Pawan sir’s legs and join Janasena. Reddies future is only under the guardianship of Janasena and Kootami.

Comments are closed.