మాజీ ఎమ్మెల్యేని మ‌రిచిపోతున్న వైసీపీ!

వైఎస్సార్ జిల్లా జ‌మ్మ‌ల‌మ‌డుగు మాజీ ఎమ్మెల్యే డాక్ట‌ర్ ఎం.సుధీర్‌రెడ్డిని వైసీపీ కార్య‌క‌ర్త‌లు, నాయ‌కులు నెమ్మ‌దిగా మ‌రిచిపోతున్నారు. వైసీపీ ఘోర ప‌రాజ‌యం త‌ర్వాత ఆయ‌న నియోజ‌క‌వ‌ర్గానికి చుట్ట‌పు చూపుగా వెళుతున్నారు. దీంతో ఆయ‌న‌పై వైసీపీ శ్రేణులు…

వైఎస్సార్ జిల్లా జ‌మ్మ‌ల‌మ‌డుగు మాజీ ఎమ్మెల్యే డాక్ట‌ర్ ఎం.సుధీర్‌రెడ్డిని వైసీపీ కార్య‌క‌ర్త‌లు, నాయ‌కులు నెమ్మ‌దిగా మ‌రిచిపోతున్నారు. వైసీపీ ఘోర ప‌రాజ‌యం త‌ర్వాత ఆయ‌న నియోజ‌క‌వ‌ర్గానికి చుట్ట‌పు చూపుగా వెళుతున్నారు. దీంతో ఆయ‌న‌పై వైసీపీ శ్రేణులు తీవ్ర ఆగ్ర‌హంగా ఉన్నాయి. వైసీపీ అధికారంలో ఉన్న‌ప్పుడు తాను పులి అంటూ డాక్ట‌ర్ సుధీర్ గాండ్రించారు. అధికారం పోగానే, పిల్లిలా మారిపోయార‌ని సొంత పార్టీ నాయ‌కులు ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు.

రాజ‌కీయాల‌కు స్వ‌స్తి చెబుతున్న‌ట్టు మీడియా స‌మావేశం పెట్టి మ‌రీ ప్ర‌క‌టిస్తార‌ని ఇటీవ‌ల జ‌మ్మ‌ల‌మ‌డుగు నియోజ‌క‌వ‌ర్గంలో పెద్ద ఎత్తున ప్ర‌చారం జ‌రిగింది. చివ‌రి నిమిషంలో డాక్ట‌ర్ సుధీర్ ఆ నిర్ణ‌యాన్ని మార్చుకున్నార‌ని వైసీపీ శ్రేణులు చెబుతున్నాయి. జ‌మ్మ‌ల‌మ‌డుగు ఇన్‌చార్జ్‌గా సుధీర్‌ను తొల‌గించి, కొత్త వాళ్ల‌కి బాధ్య‌త అప్ప‌గిస్తార‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది.

మాజీ మంత్రి పి.రామ‌సుబ్బారెడ్డి లేదా ఆయ‌న కుమారుడికి జ‌మ్మ‌ల‌మ‌డుగు వైసీపీ బాధ్య‌త‌లు అప్ప‌గిస్తార‌ని ఆ నియోజ‌క‌వ‌ర్గంలో విస్తృతంగా ప్ర‌చారం జ‌రుగుతోంది. ఎన్నిక‌ల ఫ‌లితాల త‌ర్వాత డాక్ట‌ర్ సుధీర్ వ్య‌వ‌హార శైలిపై వైసీపీ శ్రేణులు మండిప‌డుతున్నాయి. పార్టీ క‌ష్ట కాలంలో ఉన్న‌ప్పుడు, కార్య‌క‌ర్త‌ల్ని, నాయ‌కుల్ని గాలికి వ‌దిలేసి, ఆయ‌న మాత్రం హైద‌రాబాద్‌కు వెళ్లిపోయి త‌న సుఖం చూసుకున్నార‌నే చ‌ర్చ‌కు తెర‌లేచింది. కేసుల్లో ఇరుక్కుని ఇబ్బంది ప‌డుతున్న త‌మ‌కు దిక్కెవ‌ర‌ని కార్య‌క‌ర్త‌లు,నాయ‌కులు నిల‌దీస్తున్నారు.

వైసీపీ అధికారంలో ఉన్న‌ప్పుడు డాక్ట‌ర్ సుధీర్ ఆర్థికంగా బాగా వృద్ధి చెందాడ‌ని, మాజీ మంత్రి రామ‌సుబ్బారెడ్డితో పాటు ఇత‌ర నాయ‌కులెవ‌రినీ క‌లుపుకుని వెళ్ల‌లేద‌నే విమ‌ర్శ‌లొస్తున్నాయి. ఇప్పుడేమో అంద‌ర్నీ వ‌దిలేసి, త‌న‌కు రాజ‌కీయాలు వ‌ద్ద‌ని హైద‌రాబాద్‌లో గ‌డుపుతూ, అప్పుడ‌ప్పుడూ నియోజ‌క‌వ‌ర్గానికి వ‌చ్చిపోతున్నాడ‌ని కార్య‌క‌ర్త‌లు మండిప‌డుతున్నారు. డాక్ట‌ర్ సుధీర్‌ను వైసీపీ శ్రేణులు మ‌రిచిపోయే ప‌రిస్థితి వ‌చ్చింద‌నే చ‌ర్చ‌కు తెర‌లేచింది

6 Replies to “మాజీ ఎమ్మెల్యేని మ‌రిచిపోతున్న వైసీపీ!”

  1. MLA గా గెలవలేదని నన్ను పీకేస్తావా??

    నీ ఇంట్లో సమస్యలు పరిష్కరించక, నీ తల్లీ, చెల్లి ఎదురు నిలిచారు కదరా పొట్టి పకోడీ? నువ్వు నీ ఫ్యామిలీ లో సక్కగా ఉండక party ని ఓడించావ్.. నీకేం శిక్ష వెయ్యాలి మరి?? నిన్నూ పీకెయ్యాలి అవునా కాదా?? – Dr. సుదీర్

Comments are closed.